?max-results="+numposts1+"&orderby=published&alt=json-in-script&callback=showrecentposts1\"><\/script>");

Popular Posts

What’s Hot

22 - భారతదేశం - బహుళార్థ సాధక ప్రాజెక్టులు

‘ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు’ అని భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అన్నమాట నాటికి, నేటికీ అక్షర సత్యం. మన దేశ ప్రగతిని సరికొత్త మలుపు తిప్పినవి బహుళార్థ సాధక ప్రాజెక్టులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి దేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక(1951) నుంచి వివిధ ప్రాంతాల్లో పలు బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మించారు.
  • ఒకటి కంటే ఎక్కువ సదుపాయాల కల్పనకు ఉద్దేశించి నిర్మించిన ప్రాజెక్టునే బహుళార్థ సాధక ప్రాజెక్టు అంటారు.
    • భారతదేశంలో వ్యవసాయ నీటిపారుదల, గృహ, పరిశ్రమ అవసరాలకు నీటి సరఫరా, విద్యుదుత్పాదన, వరద నివారణ, స్థానిక రవాణా, భూ సంరక్షణ, మత్స్య పరిశ్రమ అభివృద్ధి, విహారయాత్ర, కృత్రిమ వనాల పెంపకం మొదలైన అనేక ప్రయోజనాల కోసం ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు.
    • బెంగాల్‌లో 1948లో వరదలను, వాటిఅనుబంధ సమస్యలను నివారించడానికి దామోదర్ నదీ, దాని ఉపనదులపైన ప్రాజెక్టులు కట్టడం కోసం మొట్టమొదటి నదీలోయ ప్రాజెక్టు సంస్థను ఏర్పాటు చేశారు.
    • ఈ సంస్థను అమెరికాలోని టెన్నిస్ వేలీ అథారిటీ (టీవీఏ) నమూనా ఆధారంగా ఏర్పాటు చేశారు.
    • 1948 ఫిబ్రవరి 18న భారత పార్లమెంట్ ఈ సంస్థను ఆమోదించడంతో ఇది దామోదర్ లోయ కార్పొరేషన్ (డీవీసీ)గా వాస్తవ రూపం దాల్చింది.
    • డీవీసీ ఏర్పడక ముందు వరదలతో బెంగాల్ దుఃఖదాయినులుగా దామోదర్, దాని ఉపనదులున్నాయి. తర్వాత వాటిపై ప్రాజెక్టులు నిర్మించడంతో బెంగాల్ వరదాయినులుగా ఉన్నాయి.
    • భారతదేశంలో నీటి పారుదల ప్రాజెక్టులను మూడు రకాలుగా విభజించవచ్చు.
    అవి...
    1. భారీ నీటిపారుదల పథకాలు
    2. మధ్య తరహా నీటి పారుదల పథకాలు
    3. చిన్న తరహా నీటి పారుదల పథకాలు

    ప్రాజెక్టు కల్పించే నీటి పారుదల విస్తీర్ణాన్ని బట్టి ప్రాజెక్టులను విభజించారు.
    1. భారీ నీటిపారుదల పథకాలు
      10,000 హెక్టార్ల కంటే ఎక్కువ ఆయకట్టు ప్రాంతం ఉన్న పథకాలను భారీ నీటిపారుదల పథకాలు అంటారు. వీటిని ప్రధానంగా నదులపై నిర్మిస్తారు.
    2. మధ్య తరహా నీటిపారుదల పథకాలు
      2,000 నుంచి 10,000 హెక్టార్ల వరకు ఆయకట్టు ప్రాంతం ఉన్న పథకాలు. వీటిని నదులపై, ఉపనదులపై నిర్మిస్తారు.
    3. చిన్న తరహా నీటిపారుదల పథకాలు
      2,000 హెక్టార్ల కంటే తక్కువ ఆయకట్టు గల పథకాలు. భూగర్భ జల పథకాలు, ఉపరితల జల పథకాలు ఈ తరహా పథకాల్లోకి వస్తాయి.

భూగర్భ జల పథకాలు: సాధారణ బావులు, గొట్టపు బావులు.
ఉపరితల జల పథకాలు: చెరువులు, జలాశయాల నుంచి నీటిని మళ్లించే పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు.

ఆయకట్టు ప్రాంత అభివృద్ధి పథకం
నీటిపారుదల ఆవశక్యత, ఉత్పత్తి, వినియోగాల మధ్య అంతరాన్ని పూడ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 1974-75లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశంలో 1990లో జాతీయ జల మండలిని ఏర్పాటు చేశారు. 2008 నవంబర్ 4న గంగానదిని ‘జాతీయ నది’గా ప్రకటించారు. 

దేశంలో కొన్ని ప్రధాన బహుళార్థ సాధక ప్రాజెక్టులు
  1. భాక్రానంగల్ ప్రాజెక్టు
    దేశంలో నిర్మించిన మొట్టమొదటి ప్రాజెక్టు, అన్నిటికంటే పెద్దది. దీన్ని భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1962 అక్టోబర్ 22న జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌ల ఉమ్మడి పథకం. వీటితోపాటు హిమాచల్ ప్రదేశ్ కూడా లబ్ధి పొందుతోంది. సట్లేజ్ నదిపై హిమాచల్‌ప్రదేశ్‌లో భాక్రా అనే ప్రాంతంలో భాక్రా ఆనకట్ట (226 మీటర్లు), పంజాబ్‌లోని నంగల్ ప్రాంతం వద్ద నంగల్ ఆనకట్ట(29 మీటర్లు)ను నిర్మించారు. ఈ ప్రాజెక్టు 1204 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తుంది.
  2. హీరాకుడ్ ప్రాజెక్టు
    ఈ ప్రాజెక్టును ఒడిశాలో మహానదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టు 4801 మీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. దీన్ని విద్యుదుత్పాదన, నీటిపారుదల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేశారు.
  3. నాగార్జున సాగర్ ప్రాజెక్టు
    తెలంగాణలోని నల్గొండ జిల్లాలో నందికొండ గ్రామ సమీపంలో కృష్ణానదిపై నిర్మించారు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల పథకం. దీనికి భారత తొలి ప్రధాని నెహ్రూ 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు 1450 మీటర్ల పొడవుతో, రాతి కట్టడపు ఆనకట్టల్లో ప్రపంచంలోనే ప్రథమ స్థానం పొందింది. దీని కుడి కాలువను జవహర్ కాలువ అంటారు. ఈ కాలువ 204 కి.మీ. పొడవు ఉంది. ఇది గుంటూరు, కృష్ణా జిల్లాలకు నీరు అందిస్తుంది. దీని ఎడమ కాలువను లాల్ బహదూర్ కాలువ అంటారు. ఈ కాలువ 179 కి.మీ. పొడవుతో నల్గొండ, ఖమ్మం జిల్లాలకు నీటిని సరఫరా చేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తిగా భారతీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది.
  4. దామోదర్ నదీలోయ ప్రాజెక్టుఈ ప్రాజెక్టు పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల ఉమ్మడి పథకం. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం బెంగాల్ ప్రాంతాన్ని.. దామోదర్ నది, దాని ఉపనదుల వల్ల వచ్చే వరదల నుంచి కాపాడడం. ఈ పథకంలో భాగంగా తిలయ్యా, మైథాన్ ఆనకట్టలు - బరాకర్ నదిపై, పంచట్‌హిట్ ఆనకట్ట - దామోదర్ నదిపై, కోనార్ ఆనకట్ట- కోనార్ నదిపై నిర్మించారు.
  5. బియాస్ పథకం
    ఇది పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల ఉమ్మడి పథకం. ఇది బియాస్ జలాలను సట్లేజ్ జలాలతో కలుపుతుంది. బియాస్ నదిపై ‘పోంగ్’ వద్ద ఈ ఆనకట్టను నిర్మించారు.
  6. కోసి ప్రాజెక్టు
    దీన్ని బీహార్ - నేపాల్ సరిహద్దులోని హనుమాన్‌నగర్ సమీపంలో ‘కోసి’ నదిపై నిర్మించారు. ఇది అంతర్జాతీయ పథకం
  7. గండక్ పథకం
    దీన్ని బీహార్‌లోని వాల్మీకినగర్ వద్ద గండక్ నదిపై నిర్మించారు. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్, నేపాల్‌ల ఉమ్మడి పథకం.
  8. చంబల్ పథకం
    ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ఉమ్మడి పథకం. దీన్ని చంబల్ నదిపై నిర్మించారు. ఈ పథకంలో మూడు ఆనకట్టలున్నాయి. అవి ...
    1. గాంధీసాగర్ ఆనకట్ట
    2. రాణా ప్రతాప్‌సాగర్ ఆనకట్ట
    3. జవహర్ సాగర్ ఆనకట్ట
  9. తెహ్రీడ్యామ్ ప్రాజెక్టు
    ఈ ప్రాజెక్టు ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, ఢిల్లీ రాష్ట్రాల ఉమ్మడి పథకం. దీన్ని ‘భాగీరథి’ నదిపై హిమాలయ ప్రాంతం(ఉత్తరాఖండ్)లోని భూకంపాలు సంభవించే ప్రదేశంలో నిర్మించడం వల్ల ఇది వివాదాస్పదమైంది. తెహ్రీడ్యామ్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన వ్యక్తి - సుందర్‌లాల్ బహుగుణ.
  10. ఇందిరాసాగర్ ప్రాజెక్టు
    ఇది నర్మద నదిపై ఉంది. దీన్ని గుజరాత్‌లోని పూర్ణసా ప్రాంతంలో నిమొరి జిల్లాలో నిర్మించారు. ఇది మధ్యప్రదేశ్, గుజరాత్‌ల ఉమ్మడి ప్రాజెక్టు
  11. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు
    దీన్ని నర్మద నదిపై, గుజరాత్‌లోని బరూచ్ జిల్లాలో బడగావ్ అనే ప్రాంతంలో నిర్మించారు. ఇది రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, గుజరాత్‌ల ఉమ్మడి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మేథాపాట్కర్ చేపట్టిన ఉద్యమమే- నర్మదా బచావో.

మరికొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు
వ.సం.
ప్రాజెక్టు పేరు
నది
రాష్ట్రాలు
1.
బాగ్లీహార్ ప్రాజెక్టు
చీనాబ్
జమ్మూ - కాశ్మీర్
2.
ధూల్‌హస్తి
చీనాబ్
జమ్మూ - కాశ్మీర్
3.
నాథ్‌పాజాక్రి
సట్లేజ్
హిమాచల్ ప్రదేశ్
4.
రిహాండ్
రిహాండ్
ఉత్తరప్రదేశ్
5.
రామ్‌గంగా
రామ్‌గంగా
ఉత్తరప్రదేశ్
6.
సువర్ణరేఖ
సువర్ణరేఖ
బీహార్
7.
ఫరక్కా
హుగ్లీ
పశ్చిమ బెంగాల్
8.
మయూరాక్షి
మురళీ
పశ్చిమ బెంగాల్
9.
జయక్‌వాడీ
గోదావరి
మహారాష్ర్ట
10.
బాబ్లీ
గోదావరి
మహారాష్ర్ట
11.
ఆల్మట్టి
కృష్ణా
కర్ణాటక
12.
ఇడుక్కి
పెరియార్
కేరళ
13.
శబరిగిరి
పంప
కేరళ
14.
మెట్టూరు
పైకారా
తమిళనాడు
15.
ఉకాయ్
తపతి
గుజరాత్
16.
కాక్రపార
తపతి
గుజరాత్
17.
శ్రీ‌రాంసాగర్
గోదావరి
తెలంగాణ
18.
సుంకేసుల
తుంగభధ్ర
ఆంధ్రప్రదేశ్
19.
పులిచింతల
కృష్ణానది
ఆంధ్రప్రదేశ్
20.
జంఝావతి
జంఝావతి నది
ఆంధ్రప్రదేశ్
21.
ఎల్లంపల్లి(శ్రీ పాదసాగర్)
గోదావరి
తెలంగాణ

21 - భారతదేశంలో రవాణా

ప్రపంచంలో ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థల్లో భారతీయ రైల్వే ఒకటి. రైల్వే నెట్‌వర్‌‌కలో అమెరికా, రష్యా, చైనా తర్వాత భారత్ నాలుగో స్థానంలో ఉంది. భారతీయ రైల్వే సంస్థ దశాబ్దాల పాత పద్ధతులను పక్కనబెట్టి ప్రమాదాల కుదుపులు లేకుండా ప్రయాణికులను గమ్య స్థానం చేర్చడానికి అవసరమైన అన్ని రకాల విధానాలను పట్టాలనెక్కిస్తోంది. మెట్రో రైళ్లు, బుల్లెట్ రైళ్లకు సంబంధించిన ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అభివృద్ధి దిశగా హైస్పీడు వేగంతో పరుగులు తీస్తోంది.
భారతదేశంలోని రవాణా రంగంలో రైల్వేలు, విమానయాన రంగం ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
రైల్వే రవాణా
దేశంలో పెద్ద ఎత్తున సరకును, ప్యాసింజర్లను సుదూర ప్రాంతాలకు తరలించడంలో రైల్వేలు కీలకపాత్ర వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 65 వేల కి.మీ. రైల్వే రూటు మార్గం, 1,14,500 కి.మీ. పొడవైన రైలు పట్టాలు, 8 వేలకు పైగా రైల్వేస్టేషన్లు ఉన్నాయి. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారతీయ రైల్వేలో రోజూ 19 వేల రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో 12 వేల రైళ్లు ప్రయాణీకులకు సేవలందిస్తుండగా, 7 వేల రైళ్లు సరకు రవాణా సాగిస్తున్నాయి.
రెండు రైలు పట్టాల మధ్య ఉన్న దూరం ఆధారంగా రైల్వే లైన్లను అయిదు గేజ్‌లుగా విభజించారు. అవి:
  • బ్రాడ్ గేజ్ - 1.676 మీటర్లు
  • మీటర్ గేజ్ - 1 మీ.
  • న్యారోగేజ్ - 0.762 మీ.
  • లైట్ న్యారోగేజ్ - 0.610 మీ.
  • స్టాండర్డ్‌ గేజ్ - 1.500 మీ. (దీన్ని మెట్రో మార్గాల్లో ఉపయోగిస్తున్నారు)
దేశంలో రైల్వేల అభివృద్ధి ఎక్కువగా గంగా-సింధూ మైదాన ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో వీటికి ఎక్కువ అనుకూలతలు ఉన్నాయి. ఈశాన్య ప్రాంతాల్లో రైల్వేల అభివృద్ధి అతి తక్కువగా ఉంది.
దీనికి కారణాలు:
1) అల్ప జన సాంద్రత ఉండటం
2) అల్ప ఆర్థిక వ్యవస్థ
3) విసిరేసినవిధంగా ఉన్న మానవ నివాసాలు
4) ఎగుడు, దిగుడు భూ స్థలాకృతి
దేశంలో పొడవైన రైలు మార్గాలు ఉన్న రాష్ట్రాల్లో మొదటి 4 స్థానాల్లో వరుసగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ ఉన్నాయి. దేశంలో రైల్వేలైన్లు లేని రాష్ట్రాలు మేఘాలయ, సిక్కిం. అసోం మినహా మిగిలిన ఈశాన్య రాష్ట్రాల్లో (అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, మిజోరాం) రైల్వే టెర్మినళ్లు మాత్రమే ఉన్నాయి.
కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్: దేశంలో మొదటిసారిగా 1998 జనవరి 26న ప్రైవేట్ రంగంలో రైల్వే మార్గాన్ని నిర్మించారు. ఇది మహారాష్ర్టలోని ‘రోహా’తో కర్ణాటకలోని ‘మంగళూరు’ను కలుపుతుంది. దీని పొడవు 700 కి.మీ. ఈ మార్గంలో అతి పొడవైన (6.5 కి.మీ.) సొరంగ మార్గం ఉంది. దీన్ని ‘కార్బూద్ టన్నెల్’గా పేర్కొంటారు. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర రాష్ట్రాలు కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కేంద్ర కార్యాలయం నవీ ముంబయిలో ఉంది.
దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం 17 రైల్వే మండలాలుగా విభజించారు. వీటిలో ‘కేంద్ర రైల్వే మండలం’ దేశంలోనే మొదటిది కాగా, అతి పెద్ద రైల్వే మండలం న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న ‘ఉత్తర రైల్వే మండలం’.
యునెస్కో జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ రైల్వేలు
రైల్వే లైను
- గుర్తించిన సంవత్సరం
డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే(పశ్చిమ బెంగాల్)
- 1999
ఛత్రపతి శివాజీ టెర్మినల్ (ముంబయి)
- 2004
నీలగిరి పర్వత రైల్వే (తమిళనాడు)
- 2005
కల్క - సిమ్లా రైల్వే (హిమాలయాలు)
- 2008
మాతరన్ రైల్వే (మహారాష్ట్ర)
- 2014
వాయు రవాణా
రవాణా మార్గాలన్నింటిలోకెల్లా అతి ఎక్కువ ఖర్చుతో కూడుకొని ఉన్న రవాణా ఇదే. దేశంలో పౌర విమాన సర్వీసులను అందజేయడంలో ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్‌‌స, వాయుదూత్, పవన్‌హన్‌‌స లిమిటెడ్ తదితర సంస్థల పాత్ర ఉంది. వీటితో పాటు డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్‌‌ట అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఏఏఐ), నేషనల్ ఎయిర్‌పోర్‌‌ట అథారిటీ (ఎన్‌ఏఏ) సంస్థలు ప్రాథమిక సదుపాయాల కల్పనకు సంబంధించి కీలకపాత్ర పోషిస్తున్నాయి.
పౌర విమానయానానికి సంబంధించి జాతీయ విధానాలు, నిబంధనలు, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, విమానాశ్రయాల ఏర్పాటు, వైమానిక రవాణా క్రమబద్ధీకరణ, పౌర విమాన రవాణా విస్తరణకు అమలు చేయదగిన కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది.
దేశంలో విమానయానం 1911లో మొట్టమొదటిసారిగా అలహాబాద్ - నైనిటాల్ మధ్య ప్రారంభమైంది. పోస్టల్ సర్వీస్‌ను బట్వాడా చేయడం ద్వారా దీన్ని ప్రారంభించారు. 1953 వరకు దేశంలో విమానయానాన్ని ప్రైవేట్ రంగంలో నిర్వహించారు. 1950లో ఏర్పాటు చేసిన రాజ్ అధ్యక్ష కమిటీ సూచనల మేరకు 1953లో ప్రైవేట్ రంగంలో నిర్వహిస్తున్న విమానయాన సంస్థలన్నింటినీ జాతీయం చేస్తూ రెండు ప్రధాన ప్రభుత్వ రంగ కార్పొరేషన్‌లుగా విభజించారు. అవి:
ఎ. ఎయిర్ ఇండియా: ఇది దేశాన్ని ఆనుకొని ఉన్న చిన్న చిన్న పొరుగు దేశాలు మినహా ఇతర దేశాలకు ఖండాంతర విమాన సర్వీసులను నడుపుతోంది.
బి. ఇండియన్ ఎయిర్ లైన్స్‌: ఇది దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య, దేశాన్ని ఆనుకొని ఉన్న చిన్న చిన్న పొరుగు దేశాలకు విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. 2005 డిసెంబరు 8న ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ పేరును ‘ఇండియన్’గా మార్చారు. దీని మస్కట్ ‘కోణార్క్‌ సూర్య దేవాలయంలోని రథ చక్రం’. 2007లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను, ఎయిర్ ఇండియాతో కలిపి ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. దీని మస్కట్ ‘ఎగిరే హంసతో కూడిన కోణార్క్‌ చిత్రం’.
వాయుదూత్: సరకుల రవాణా కోసం 1981 లో దీన్ని ప్రారంభించారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ విమానాలు నడవని ప్రాంతాలు, ముఖ్యంగా దట్టమైన అడవులున్న ఈశాన్య ప్రాంతాలకు ప్రయాణికుల కోసం ఈ సర్వీసులను ఉపయోగించారు. దీన్ని 1993లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో విలీనం చేశారు.
పవన్‌హన్స్‌ లిమిటెడ్: దీన్ని 1985 అక్టోబర్ 15న స్థాపించారు. దీని కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంది. పెట్రోలియం స్థావరాలకు సహాయం కోసం ఇది ఏర్పాటైంది. తర్వాతి కాలంలో కొండ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, ఎన్టీపీసీ, గెయిల్, బీఎస్‌ఎఫ్ లాంటి సంస్థలకు సేవలందించేందుకు విస్తరించారు.
  • ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీలో పైలట్లకు శిక్షణ ఇస్తారు. ఇది ఉత్తర ప్రదేశ్‌లోని ఫుర్‌సత్‌గంజ్‌లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తోంది.
  • బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ విమానాల తయారీ, రిపేర్లను నిర్వహిస్తోంది.
ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా:
నేషనల్ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియాలను విలీనం చేసి ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియాను 1995 ఏప్రిల్ 1న ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) కింద మూడు సంస్థలు పనిచేస్తున్నాయి. అవి
1. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ డివిజన్ 
2. నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ డివిజన్ 
3. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ 
1990లో ప్రవేశపెట్టిన ఓపెన్ స్కై పాలసీ వల్ల ప్రైవేటు రంగంలో 8 ప్యాసింజర్ ఎయిర్‌వేస్ ప్రారంభమయ్యాయి. అవి 
1. జెట్ ఎయిర్‌వేస్ 
2. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌
3. ఇండిగో ఎయిర్‌వేస్
4. స్పైస్‌జెట్
5. జెట్‌లైట్
6. గో ఎయిర్‌వేస్ 
7. పారామౌంట్ ఎయిర్‌వేస్ 
8. దక్కన్ ఏవియేషన్
అంతర్జాతీయ విమానాశ్రయాలు
1. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం  (పాతపేరు పాలెం) - న్యూఢిల్లీ2. నేతాజీ సుభాస్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం (పాతపేరు - డమ్‌డమ్) - కోల్‌కతా3. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం (పాతపేరు శాంతాక్రాజ్, సహారా) - ముంబై (మహారాష్ర్ట)4. అన్నాదురై అంతర్జాతీయ విమానాశ్రయం (పాతపేరు మీనంబాకం) - చెన్నై (తమిళనాడు)
5. నిడుంబస్సేరి అంతర్జాతీయ విమానాశ్రయం - తిరువనంతపురం (కేరళ)6. గురురామ్‌దాస్‌జీ/రాజాసాన్సీ అంతర్జాతీయ విమానాశ్రయం - అమృత్‌సర్ (పంజాబ్) 7. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం  - శంషాబాద్ (హైదరాబాద్)8. లోకప్రియ గోపీనాథ్ బర్డోలియా అంతర్జాతీయ విమానాశ్రయం - గువాహటి (అసోం)9. సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం -  అహ్మదాబాద్ (గుజరాత్)10. వీర సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం - పోర్ట్‌బ్లెయిర్ (అండమాన్ నికోబార్ దీవులు)
11. దేవి అహల్యాబాయి అంతర్జాతీయ విమానాశ్రయం - ఇండోర్ (మధ్యప్రదేశ్)12. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం - నాగపూర్ (మహారాష్ర్ట)13. గయా అంతర్జాతీయ విమానాశ్రయం - గయ (బీహార్)14. బెంగళూరు/ దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం - బెంగళూరు (కర్ణాటక)15. రాజాభోజ్ అంతర్జాతీయ విమానాశ్రయం - భోపాల్ (మధ్యప్రదేశ్)16. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం - జైపూర్ (రాజస్థాన్)17. వాస్కోడగామా అంతర్జాతీయ విమానాశ్రయం - పనాజి (గోవా)

20 - భారతదేశం - శక్తి సంపద

శక్తి ఒక ముఖ్య వనరు మాత్రమే కాకుండా ఆధునిక కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించే ప్రథమ కారకం. ఒక దేశం వ్యవసాయకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి శక్తి సంపద ఎంతో అవసరం. ప్రస్తుతం మానవ జీవితం శక్తి వనరులపై ఎంతో ఆధారపడింది. మానవ జీవితావసరానికి రూపొందించే ప్రతి వస్తు ఉత్పత్తి ఈ శక్తిపైనే ఆధారపడి ఉంటుంది.
శక్తి వనరులను రెండు రకాలుగా విభజించొచ్చు. అవి..
1. సంప్రదాయ శక్తి వనరులు/తరిగిపోయే శక్తి వనరులు
2. సంప్రదాయేతర/తరిగిపోని శక్తి వనరులు
1. సంప్రదాయ/తరిగిపోయే శక్తి వనరులు:
  • బొగ్గు, చమురు, సహజవాయువు, అణుశక్తిని ఉత్పత్తి చేసే యురేనియం, థోరియం వంటి ఖనిజాలు మొదలైన వాటిని సంప్రదాయ శక్తి వనరులు అంటారు.
  • వీటి నిల్వలు ప్రకృతిలో నిర్దిష్ట పరిమాణంలో మాత్రమే ఉన్నందున వాడుతూ ఉంటే క్రమేణా తరిగిపోతాయి.
  • ఇవి తరిగిపోతే మానవుడు పునరుద్ధరించలేడు. కాబట్టి వచ్చే తరాలను దృష్టిలో పెట్టుకొని వీటిని క్రమబద్ధంగా వినియోగించుకోవాలి.
2. సంప్రదాయేతర/తరిగిపోని శక్తి వనరులు:
  • నీరు, సౌరశక్తి, పవన శక్తి, వేలా తరంగాలు, భూతాప శక్తి మొదలైన వాటిని సంప్రదాయేతర శక్తి వనరులుగా పరిగణిస్తారు.
  • ఇవి ప్రకృతిలో నిరంతరం లభ్యమవుతాయి. కాబట్టి తరిగిపోవడమనే సమస్యే లేదు.
  • అయితే వీటిని శక్తి ఉత్పాదకతకు ఉపయోగించుకోవాలంటే సాంకేతికాభివృద్ధితో మాత్రమే సాధ్యపడుతుంది.
  • మనదేశంలో నేలబొగ్గు, చమురు, కర్ర బొగ్గు, నీరు ప్రధాన శక్తి వనరులు. సూర్యరశ్మి, గాలి మొదలైన వనరుల వాడకం ఇప్పుడిప్పుడే అభివృద్ధి దశలో ఉంది. అలాగే అణుశక్తి కూడా మంచి అభివృద్ధి దశలో ఉందని చెప్పొచ్చు. వీటన్నింటిలోనూ బొగ్గు చాలా ముఖ్యమైన శక్తి ఉత్పాదక వనరు. ఆ తర్వాత స్థానం జలశక్తి ఆక్రమిస్తుంది.
  • మనదేశంలో మొదటిసారి విద్యుచ్ఛక్తి తయారీ డార్జిలింగ్ (పశ్చిమ బంగా)లో 1897లో ప్రారంభమైంది. ఆ తర్వాత 1902లో కర్ణాటకలోని శివసముద్రం వద్ద జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
  • స్వాతంత్య్రానంతరం ‘విద్యుచ్ఛక్తి చట్టం 1948’లో ప్రవేశపెట్టి విద్యుచ్ఛక్తిని ప్రభుత్వ రంగ పరిధిలోకి తెచ్చారు.
  • 1975లో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ‘నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్’ల ఏర్పాటుతో దేశంలో విద్యుచ్ఛక్తి రంగంలో గణనీయమైన అభివృద్ధి జరిగింది.
  • మనదేశంలో విద్యుచ్ఛక్తి ఉత్పత్తి 1947లో 1400 మెగావాట్లు ఉంటే, 2005-06 నాటికి 1,19,607 మె.వాట్లకు చేరింది.
థర్మల్ విద్యుత్
  • బొగ్గు, నీటి ఆవిరి ఆధారంగా ఉత్పత్తి చేసే విద్యుత్‌ను థర్మల్ విద్యుత్ అంటారు. దేశంలో సుమారు 73 శాతం ఉత్పత్తితో థర్మల్ విద్యుత్ మొదటి స్థానంలో ఉంది.
  • థర్మల్ విద్యుత్‌ను ఎక్కువగా మహారాష్ర్ట, గుజరాత్ రాష్ట్రాలు ఉత్పత్తి చేస్తున్నాయి.
  • వేయి మెగావాట్ల కంటే ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన పవర్ స్టేషన్‌ను సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్టీపీఎస్) అంటారు. ఇవి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) ఆధ్వర్యంలో ఉంటాయి.
భారతదేశంలో సూపర్ థర్మల్ పవర్ స్టేషన్లు
వ.సం.
ఎస్టీపీఎస్
రాష్ర్టం
1.
సింగ్రౌలి
ఉత్తరప్రదేశ్
2.
దాద్రి
ఉత్తరప్రదేశ్
3.
రీహాండ్
ఉత్తరప్రదేశ్
4.
వూంచహార్
ఉత్తరప్రదేశ్
5.
సింహాద్రి
ఆంధ్రప్రదేశ్
6.
రామగుండం
తెలంగాణ
7.
వింద్యాచల్ -1
మధ్యప్రదేశ్
8.
వింద్యాచల్-2
మధ్యప్రదేశ్
9.
కోర్బా
ఛత్తీస్‌గఢ్
10.
కహాల్‌గావ్
బీహార్
11.
తాల్చేర్
ఒడిశా
12.
కాయంకుళం
కేరళ
13.
ఫరక్కా
పశ్చిమ బంగా
  • 4000 మె.వాట్ల కంటే ఎక్కువ థర్మల్ విద్యుత్ సామర్థ్యం ఉంటే వాటిని ‘ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్’ (యూఎంపీపీ) అంటారు.
భారతదేశంలో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్స్
వ.సం.
యూఎంపీపీ
రాష్ర్టం
1.
ముంద్రా
గుజరాత్
2.
తాద్రి
కర్ణాటక
3.
గిర్యా
మహారాష్ర్ట
4.
ససన్
మధ్యప్రదేశ్
5.
ఇబ్ నదీ లోయ
ఒడిశా
6.
కృష్ణపట్నం (నెల్లూరు)
ఆంధ్రప్రదేశ్
అణు విద్యుత్
  • అణు విద్యుదుత్పత్తికి అవసరమైన యురేనియం, థోరియం, ఇల్మనైట్, మోనజైట్ ఖనిజాలు భారతదేశంలో తగినంతగా లభిస్తున్నాయి.
  • జార్ఖండ్‌లోని రాణి మేఖలలో, రాజస్థాన్‌లోని ‘ఆరావళి’ పర్వత ప్రాంతంలో యురేనియం లభిస్తోంది.
  • బీహార్‌లో గయ, రాజస్థాన్‌లో జైపూర్, ఉదయ్‌పూర్, ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు జిల్లాల్లో యురేనియం నిల్వలున్నాయి.
  • జార్ఖండ్‌లోని ‘జాదుగూడ’లో యురేనియాన్ని శుద్ధి చేసే ప్లాంట్ ఉంది.
  • కేరళ తీరం వెంట ఉన్న మోనజైట్ ఇసుకల్లో థోరియం నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి.
  • ప్రపంచంలోని థోరియం నిక్షేపాల్లో 50 శాతంపైగా భారతదేశంలోనే ఉన్నాయి.
  • ప్రస్తుతం భారతదేశ అణు విద్యుత్ సామర్థ్యం 4780 మె.వా. ఇది దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఉత్పత్తిలో సుమారు 3 శాతం.
  • ప్రపంచంలో అణు విద్యుత్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఫ్రాన్స్‌.
భారతదేశంలోని అణు విద్యుత్ కేంద్రాలు
1. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం (టీఎపీఎస్) (మహారాష్ర్ట):
  • భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి అణు విద్యుత్ కేంద్రం.
  • 1969, అక్టోబర్ 28న దీన్ని స్థాపించారు.
  • ఇక్కడ ఉన్న అణు రియాక్టర్ పేరు - అప్సర.
  • ఈ కేంద్రం అణు విద్యుత్ సామర్థ్యం - 1400 మె.వాట్లు.
2. రావత్ భటా అణు విద్యుత్ కేంద్రం (ఆర్‌ఎపీఎస్) (రాజస్థాన్):
  • ఈ కేంద్రాన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు.
  • 1973, డిసెంబర్ 16న రాజస్థాన్‌లో నెలకొల్పారు.
  • ‘కోటా అణు విద్యుత్ కేంద్రం’ అని కూడా అంటారు.
  • అణు విద్యుత్ సామర్థ్యం 1180 మె.వాట్లు.
3. కల్పకం అణు విద్యుత్ కేంద్రం (ఎంఎపీఎస్) (తమిళనాడు):
  • 1984, జనవరి 24న తమిళనాడులోని కల్పకం వద్ద ఏర్పాటు చేశారు.
  • మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ (ఎంఎపీఎస్) అని, ‘ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్‌‌చ’ అని కూడా అంటారు.
  • ఇక్కడ ఉన్న అణు రియాక్టర్ పేరు - కామిని, ఈ రియాక్టర్ ద్వారా ప్లాటినాన్ని ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.
  • అణు విద్యుత్ సామర్థ్యం - 440 మె.వా.
      4. నరోరా అణు విద్యుత్ కేంద్రం (ఎన్‌ఎపీఎస్) (ఉత్తరప్రదేశ్):
    • ఉత్తరప్రదేశ్‌లోని నరోరా వద్ద 1991, జనవరి 1న దీన్ని ఏర్పాటు చేశారు.
    • దీని ద్వారా ప్రధానంగా ఢిల్లీకి విద్యుత్‌ను అందిస్తున్నారు.
    • అణు విద్యుత్ సామర్థ్యం 440 మె.వా.
        5. కాక్రపార అణు విద్యుత్ కేంద్రం (కెఏపీపీ) (గుజరాత్):
      • గుజరాత్‌లోని కాక్రపార ప్రాంతంలో 1993, మే 6న నెలకొల్పారు.
      • అణు విద్యుత్ సామర్థ్యం 440 మె.వా.
          6. కైగా అణు విద్యుత్ కేంద్రం (కెపీపీ) (కర్ణాటక):
        • కర్ణాటక రాష్ర్టంలోని ‘కైగా’ ప్రాంతంలో 2000, నవంబర్ 16న స్థాపించారు.
        • అణు విద్యుత్ సామర్థ్యం 850 మె.వా.
        • తమిళనాడులోని ‘కూడంకుళం’ వద్ద రష్యా సహాయంతో వేయి మెగావాట్లతో రెండు అణు రియాక్టర్లను నిర్మిస్తున్నారు.
        • అణు విద్యుత్ కర్మాగారంలో మితకారిగా ‘భారజలం’ను ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చు.
            భారతదేశంలో భారజల కేంద్రాలు
            వ.సం.
            భారజల కేంద్రం
            రాష్ర్టం
            1.
            కోటా
            రాజస్థాన్
            2.
            తాల్చేర్
            ఒడిశా
            3.
            థాల్
            మహారాష్ర్ట
            4.
            బరోడా
            గుజరాత్
            5.
            ట్యుటికోరిన్
            తమిళనాడు
            6.
            హజీరా
            మధ్యప్రదేశ్
            7.
            మణుగూరు
            తెలంగాణ
            • భారతదేశంలో 1962లో మొట్టమొదటి ‘భారజల కేంద్రాన్ని’ ‘నంగల్’ (ఉత్తరప్రదేశ్)లో ఏర్పాటు చేశారు.



            19 - భారతదేశం- భూ స్వరూపాలు

            తీరమైదానాలు
            దక్కను పీఠభూమికి ఇరువైపులా అరేబియా సముద్రం, బంగాళాఖాతం వెంబడి తీర మైదానాలున్నాయి. అవి:
            1. పశ్చిమ తీర మైదానం
            2. తూర్పు తీర మైదానం
            వీటి వెడల్పులు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి. 



            పశ్చిమ తీరమైదానం
            ఇది దక్కను పీఠభూమికి పశ్చిమం వైపున అరేబియా సముద్రం మధ్య వ్యాపించి ఉంది. ఈ మైదానం సన్నగా, అసమానంగా అక్కడక్కడ కొండల భూ భాగంతో ఉంది. ఇది గుజరాత్ తీరంలోని రాణా ఆఫ్ కచ్ నుంచి కేరళ తీరం వరకు విస్తరించి ఉంది. ఈ తీరం చాలా తక్కువ వెడల్పు (10 - 25 కి.మీ) కలిగి ఉంది. దీన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తున్నారు.
            మహారాష్ట్ర - కొంకణ్ తీరం
            గోవా - గోవా తీరం
            కర్ణాటక - కెనరా తీరం
            కేరళ - మలబార్ తీరం
            • ఈ తీరమైదానంలో ఎక్కువ సంఖ్యలో నదీ ముఖాలున్నాయి. వీటిలో నర్మద, తపతి ముఖ్యమైనవి. వీటికి ఉత్తరంగా సబర్మతి, మహి మొదలైన నదుల వల్ల గుజరాత్ మైదానం ఏర్పడింది.
            • కర్ణాటక మైదానం ద్వారా శరావతి నది ప్రవహిస్తోంది. ఈ నదిపై దేశంలోనే అతి ఎత్తయిన జలపాతం జోగ్ (జర్సోప్పా) ఉంది. దీని ఎత్తు 275 మీ.
            • దీంట్లో మలబారు తీరం ఉప్పు నీటి సరస్సులకు ప్రసిద్ధి. వీటినే ‘లాగూన్’లు అని కూడా అంటారు. వీటిలో ముఖ్యమైనవి అష్టముడి, వెంబనాడు సరస్సులు.


            తూర్పుతీర మైదానం
            ఈ మైదానం దక్కను పీఠభూమికి తూర్పున, బంగాళాఖాతానికి మధ్య విస్తరించి ఉంది. ఈ మైదానం పశ్చిమ తీరమైదానంలా కాకుండా బల్లపరుపుగా, ఎక్కువ వెడల్పుతో ఉంది. దీని సరాసరి వెడల్పు 120 కి.మీ. ఈ తీరానికి కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లు ఉన్నాయి.
            పశ్చిమబెంగాల్ - వంగ తీరం
            ఒడిశా - ఉత్కళ్ తీరం
            ఉత్తర ఆంధ్ర - సర్కార్ తీరం
            తమిళనాడు - కోరమాండల్ తీరం


            ఈ తీరంలో ఉన్న ముఖ్యమైన సరస్సులు:
            చిలకా సరస్సు: ఇది ఉప్పునీటి సరస్సు. ఒడిశా తీరంలో ఉంది.
            కొల్లేరు సరస్సు: ఇది మంచినీటి సరస్సు. కృష్ణా, గోదావరి డెల్టాల మధ్య ఉంది. 
            పులికాట్ సరస్సు: ఇది ఉప్పునీటి సరస్సు. ఆంధ్రప్రదేశ్‌లో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తమిళనాడు సరిహద్దులో ఉంది.
            • పులికాట్ సరస్సులో శ్రీహరికోట అనే దీవి ఉంది. దీని నుంచి రాకెట్లను ప్రయో గిస్తారు. ఇటీవల దీన్ని సతీష్‌ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రంగా పేరు మార్చారు. ఈ సరస్సును ఆనుకొని నేలపట్టు పక్షి సంరక్షణా కేంద్రం ఉంది.
            • ఈ తీరప్రాంతం నాలుగు ప్రధాన డెల్టాలకు నిలయంగా ఉంది. 
              అవి: మహానది డెల్టా - ఒడిశా, కృష్ణా, గోదావరి డెల్టాలు - ఆంధ్రప్రదేశ్, కావేరి డెల్టా - తమిళనాడు.
            • ఇది వ్యవసాయ రంగానికి చాలా అనుకూలమైందిగా ఉంది.
            ఎడారులు
            భారత ఉపఖండంలో అతిపెద్ద ఎడారి థార్. దీన్ని భారతదేశ గొప్ప ఎడారి అంటారు. ఇది ఆరావళి పర్వతాలకు వాయువ్యంగా ఉంది. దీని విస్తీర్ణం సుమారు 2 లక్షల చ.కి.మీ.
            • ఈ ఎడారి రాజస్థాన్‌లో అధిక భాగం, హర్యానాలో కొంతభాగం, పాకిస్థాన్‌లో అతికొద్ది భాగం విస్తరించి ఉంది.
            • ఈ ఎడారిలో వార్షిక వర్షపాతం అతి తక్కువ. ఇక్కడ వర్షపాతం 10 సెం.మీ. నుంచి 50 సెం.మీ. వరకు ఉండటం వల్ల ఎక్కువగా ముళ్లపొదలతో కూడిన ఉద్భిజ్జాలు ఉన్నాయి.
            • థార్ ఎడారి ప్రాంతంలోని జోథ్‌పూర్, బికనీర్, జైసల్మీర్ భారతదేశ జనపదాల్లో ముఖ్యమైనవిగా ప్రసిద్ధి చెందాయి.
            గంగా - సింధు మైదానాలు
            హిమాలయాలు, ద్వీపకల్ప పీఠభూమి మధ్యలోని లోతట్టు ప్రాంతంలో గంగా-సింధు మైదానాలు ఏర్పడ్డాయి. ప్లీస్టోసీన్ కాలం నుంచి నేటి వరకు హిమాలయ నదులు తీసుకువచ్చిన ఒండ్రుమట్టితో ఈ విశాల మైదానాలు ఏర్పడ్డాయి. వీటిలో ప్రధానంగా ప్రవహించే గంగా, సింధు నదుల పేరు మీదుగా వీటికి ఆ పేరు వచ్చింది. ఇవి సుమారు 7 లక్షల చ.కి.మీ.లలో విస్తరించి ఉన్నాయి. 150 కి.మీ. నుంచి 300 కి.మీ. వెడల్పుతో సింధు నది ముఖ ద్వారం నుంచి గంగానది ముఖ ద్వారం వరకు 3200 కి.మీ. పొడవున వ్యాపించి ఉన్నాయి. భారత్‌లో పశ్చిమాన రావి, సట్లెజ్ నదీ తీరాల నుంచి తూర్పున గంగానది డెల్టా వరకు సుమారు 2400 కి.మీ. పొడవున విస్తరించి ఉన్నాయి. దీని వెడల్పు దేశమంతా ఒకేవిధంగా లేదు. అసోంలోని రాజ్‌మహల్ కొండల వద్ద అతి తక్కువగా (90-100 కి.మీ.), ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్ వద్ద అత్యంత వెడల్పుగా (280 కి.మీ.) ఉన్నాయి. ఈ మైదాన భూ స్వరూపాల్లో నాలుగు ప్రధాన ఉపరితల వ్యత్యాసాలను గుర్తించవచ్చు. 

            అవి..


            భాబర్: శివాలిక్ కొండల పాదాల వెంట విసనకర్ర ఆకారంలో ఉండే గులకరాళ్లతో కూడిన సచ్ఛిద్ర మండలాన్ని ‘భాబర్’ అంటారు. ఇది పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని బృహత్ మైదానాల ఉత్తర సరిహద్దు వెంట 8 - 16 కి.మీ. వెడల్పుతో సన్నని మేఖలగా ఏర్పడింది.


            టెరాయి: హిమాలయ నదులు భాబర్ నుంచి ఉపరితలానికి వచ్చి ఎల్లప్పుడూ వెల్లువలా ప్రవహించడం వల్ల 15 - 30 కి.మీ. వెడల్పు ఉన్న చిత్తడి ప్రదేశం ఏర్పడింది. దీన్ని ‘టెరాయి’ అంటారు. ఇది దట్టమైన అడవులతో, అనేక రకాల వన్య మృగాలకు నిలయంగా ఉంది.


            భంగర్: టెరాయికి దక్షిణంగా ప్రాచీన కాలంలో ఏర్పడిన ఒండలి మైదానాన్ని ‘భంగర్’ అంటారు.



            ఖాదర్: 
            ఇటీవల ఏర్పడిన ఒండలి మైదానాన్ని ‘ఖాదర్’ అంటారు.
            • ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని శుష్క ప్రదేశాల్లో ఉన్న చవుడు, లవణీయ, స్ఫటికీయ భూభాగాలను ‘రే’ లేదా ‘కల్లార్’ అంటారు. భారతదేశ బృహత్ మైదానాల్లో పంజాబ్ - హర్యానా మైదానాలు, రాజస్థాన్ మైదానాలు, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌లోని గంగా మైదానాలు, అసోంలో బ్రహ్మపుత్ర లోయలున్నాయి.
            • పంజాబ్ - హర్యానా మైదానాల్లో రావి, బీయాస్, సట్లెజ్ నదులు ప్రవహిస్తున్నాయి. దీని విస్తీర్ణం 1.75 లక్షల చ.కి.మీ.
            • రాజస్థాన్ మైదానాల విస్తీర్ణం 1.75 లక్షల చ.కి.మీ. దీంట్లో ఇసుక దిబ్బలున్నాయి. దీంట్లో ప్రధానమైన నది ‘లూనీ’.
            • గంగా మైదానాల వైశాల్యం 3.75 లక్షల చ.కి.మీ. ఇది ఆగ్నేయంగా బంగాళాఖాతం వైపు వాలి ఉంది. దీనిలో యమున, సోన్, ఘాఘ్ర, గండక్, కోసి నదులు ప్రవహిస్తున్నాయి.
            • పశ్చిమ బెంగాల్‌లోని విశాలమైన మేఖలలో మడ అడవులున్నాయి. వీటిని ‘సుందర వనాలు’ అంటారు.



            ద్వీపకల్ప పీఠభూమి
            భూ విజ్ఞాన శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం ప్రాక్ కేంబ్రియన్ కాలంలో కఠిన అగ్నిశిలలు, రూపాంతర శిలలతో ఏర్పడిన ద్వీపకల్ప పీఠభూమి ‘గోండ్వానా’ భూమిలో భాగంగా ఉండేది. ఇది గంగా - సింధు మైదానాలకు దక్షిణంగా, 16 లక్షల చ.కి.మీ. వైశాల్యంతో దేశంలోనే అతి పెద్ద నైసర్గిక స్వరూపంగా ఉంది. త్రిభుజాకారంగా ఉన్న ఈ పీఠభూమికి దక్షిణ, పశ్చిమ, తూర్పుదిశల్లో సముద్రాలున్నాయి. దీని సాధారణ ఎత్తు 600 మీ. నుంచి 900 మీ. వరకు ఉంది.



            సరిహద్దులు: 
            వాయవ్యంలో ఆరావళి పర్వతాలు, ఉత్తరాన బుందేల్‌ఖండ్ ఉన్నత భూమి ఉత్తరపు అంచు, ఈశాన్యంలో రాజ్‌మహల్ కొండలు, పశ్చిమాన పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు ఉన్నాయి. తూర్పు, పశ్చిమ కనుమలు కలిసే దక్షిణాగ్రాన కన్యాకుమారి ఉంది. 
            ఈ పీఠభూమి తూర్పుదిశగా కొద్దిగా వాలి ఉంది. దీన్ని స్థూలంగా ఉత్తరాన మాల్వా పీఠభూమిగా, దక్షిణాన దక్కను పీఠభూమిగా విభజించారు. ఈ రెండు పీఠభూములను ఉత్తర భారత్ నుంచి నర్మదా నది వేరు చేస్తోంది.


            మాల్వా పీఠభూమి: 
            నర్మదానది పగులు లోయకు ఉత్తరంగా ఉన్న పీఠభూమిని ‘మాల్వా పీఠభూమి’ అంటారు. ఇది ఎక్కువగా నదీ క్రమక్షయానికి గురవడం వల్ల ఇక్కడ ‘కందర భూములు’ (Bad Land) ఏర్పడ్డాయి. ఇవి చంబల్, బనాస్ నదులు ప్రవహించే ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఈ పీఠభూమి గంగా నదిలోయ వైపునకు వాలి ఉంది. ఈ పీఠభూమి తూర్పు చివరి భాగాలను దక్షిణ ఉత్తరప్రదేశ్‌లో స్థానికంగా బుందేల్‌ఖండ్, బాఘల్‌ఖండ్ ఉన్నత భూములని, జార్ఖండ్‌లో చోటా నాగ్‌పూర్ పీఠభూమి అని అంటారు. ఈ పీఠభూమికి వాయవ్యంగా ఆరావళి, దక్షిణంగా వింధ్య పర్వతాలు ఉన్నాయి.



            ఆరావళి పర్వతాలు: 
            ఇవి అతి పురాతనమైన ముడుత పర్వతాలు. ఇవి గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు సుమారు 700 కి.మీ. పొడవున వ్యాపించి ఉన్నాయి. ఈ పర్వతాల ద్వారా బనాస్, మహీ, లూనీ నదులు ప్రవహిస్తున్నాయి. ఇవి అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఆరావళి శ్రేణిలో అబూ కొండల్లోని ‘గురుశిఖర్’ (1722 మీ.) అత్యంత ఎత్తయింది. ఆరావళి శ్రేణులు జల, వాయు క్రమక్షయ చర్యలకు గురై రాజస్థాన్‌లో చిన్న చిన్న గుట్టలుగా కనిపిస్తాయి.


            వింధ్య పర్వతాలు: 
            ఇవి మాల్వా పీఠభూమికి దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి. నర్మదా నదిలోయ వెంట తూర్పు పడమరలుగా నిట్రవాలుతో ఉండి, సోన్‌లోయ వెంట ఉన్న కైమూర్ శ్రేణితో కలుస్తున్నాయి.



            సాత్పురా పర్వతాలు: 
            ఇవి దక్కన్ పీఠభూమికి ఉత్తరాన ఉన్నాయి. వీటికి దక్షిణాన తపతి, ఉత్తరాన నర్మదా నది ప్రవహిస్తున్నాయి. వీటితో పాటు సోన్, వార్థా, పెన్ గంగా, బ్రహ్మణ నదులు కూడా ఇక్కడే జన్మిస్తున్నాయి. ఈ పర్వతాలు మహారాష్ర్టలో రాజ్‌పిప్ల నుంచి రేవా వరకు వ్యాపించి ఉన్నాయి. ఈ పర్వతాల పడమర భాగంలోని కొండలను రాజ్‌పిప్ల కొండలని, ఉత్తర చివరలోని కొండలను మహాదేవ్ కొండలని, దక్షిణాన గర్విల్‌గర్ కొండలని, తూర్పు భాగాన్ని మైకాల పీఠభూమి అని పిలు స్తారు. మధ్యప్రదేశ్‌లోని మహాదేవ్ కొండల్లో పచ్‌మరి సమీపంలోని ధూప్‌గర్ (1350 మీ.) ఈ పర్వతాల్లో ఎత్తయిన శిఖరం. వింధ్య - సాత్పురా పర్వత శ్రేణుల మధ్య నర్మద, సాత్పురా - అజంతా శ్రేణుల మధ్య తపతి నది ప్రవహిస్తున్నాయి. ఇవి రెండూ తూర్పు నుంచి పశ్చిమం దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. వింధ్య - సాత్పురా ప ర్వతాలు భారతదేశాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విడదీస్తున్నాయి.


            దక్కన్ పీఠభూమి: 
            ఇది ద్వీపకల్ప భారతదేశంలో అధిక భాగం విస్తరించి ఉంది. దీనికి ఉత్తరాన సాత్పురా, అజంతా పర్వత శ్రేణులు, పడమర పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు సరిహద్దులుగా ఉన్నాయి. అగ్ని పర్వత ఉద్భేదనం వల్ల లావా నిక్షేపించడంతో ఈ పీఠభూమి ఏర్పడింది. ఇది ఉత్తర - దక్షిణాలుగా 1600 కి.మీ, తూర్పు - పడమరలుగా 1400 కి.మీ. వ్యాపించి ఉంది. ‘త్రిభుజాకార’ రూపంలో ఉంది. దీని ఎత్తు పశ్చిమాన 900 మీ., తూర్పున 300 మీ. తూర్పునకు వాలి ఉండటం వల్ల పశ్చిమ కనుమల్లో పుట్టిన నదులు (గోదావరి, కృష్ణా, కావేరి మొదలైనవి) తూర్పుదిశగా ప్రవహించి బంగాళాఖాతంలో క లుస్తున్నాయి. దీని ఉత్తర, వాయవ్య ప్రాంతా లను ‘మహారాష్ర్ట’ పీఠభూమిగా పిలుస్తారు. ఇది ‘బసాల్ట్’ శిలలతో ఏర్పడింది. ఆగ్నేయ భాగాన్ని ఆంధ్రా పీఠభూమిగా, దక్షిణభాగాన్ని కర్ణాటక పీఠభూమిగా పిలుస్తారు. ఇవి ఆర్కియన్, నీస్ శిలలతో ఏర్పడ్డాయి.


            పశ్చిమ కనుమలు: 
            వీటిని ‘సహ్యాద్రి శ్రేణి’ అని కూడా అంటారు. ఇవి దక్కన్ పీఠభూమికి పశ్చిమ పార్శ్వంలో ఉన్నాయి. తపతి నది లోయకు దక్షిణంగా మహారాష్ర్టలోని ఖందేష్ నుంచి ప్రారంభమై పశ్చిమ తీరానికి సమాంతరంగా 1600 కి.మీ. పొడవున దక్షిణాన కన్యాకుమారి వరకు అవిచ్ఛిన్నంగా వ్యాపించి ఉన్నాయి. వీటి వాలు సముద్రం వైపు చాలా నిటారుగానూ, పీఠభూమి వైపు తక్కువగానూ ఉంది. అఖండమైన పశ్చిమ కనుమల్లో అక్కడక్కడ ఎత్తు తక్కువ ఉన్న దారులు/ కనుమలు ఉన్నాయి. వీటి ద్వారా రోడ్డు, రైలు మార్గాలను వేశారు. పశ్చిమ కనుమల ఉత్తర భాగంలో ధాల్‌ఘాట్, బోర్‌ఘాట్ అనే కనుమలున్నాయి. దక్షిణ భాగంలో ‘పాల్‌ఘాట్’ కనుమ ఉంది. దీన్ని పురాతన నది వల్ల ఏర్పడిన లోయగా భావిస్తున్నారు. ఈ కనుమ తమిళనాడు, కేరళను కలుపుతుంది. దక్షిణాన నీలగిరి కొండలు, సహ్యాద్రి శ్రేణులు ‘గుడలూరు’ సమీపంలో కలుస్తున్నాయి. నీలగిరి కొండల్లో ఉదక మండలం (ఊటీ) సమీపంలోని ‘దొడబెట్ట’ (2,637 మీ.) అతి ఎత్తయిన శిఖరం. దక్షిణాన అన్నామలై, పళిని, కార్డమమ్ (యాలకుల) కొండలున్నాయి. కేరళలోని అన్నామలై కొండల్లోని అనైముడి శిఖరం (2,695 మీ.) ద్వీపకల్ప పీఠభూమిలో అతి ఎత్తయింది. 

            తూర్పు కనుమలు: 
            ఇవి దక్కను పీఠభూమికి తూర్పు హద్దుగా ఉన్నాయి. పశ్చిమ కనుమలంత ధృడంగా లేవు. తూర్పు కనుమలు ఉత్తరాన చోటా నాగ్‌పూర్ పీఠభూమితోనూ, దక్షిణాన నీలగిరి కొండలతోనూ కలుస్తున్నాయి. వీటిలో అతి ఎత్తయిన ప్రదేశం విశాఖపట్నం జిల్లాలోనూ (1506 మీ.), రెండో ఎత్తయిన స్థలం ఒరిస్సాలోని గంజాం జిల్లాలోని మహేంద్రగిరి (1501 మీ.) లోనూ ఉన్నాయి.
            వీటిని ఉత్తర భాగంలో ఉత్తర కొండలుగా, దక్షిణ భాగంలో ‘తమిళనాడు’ కొండలుగా, మధ్య భాగంలో ‘కడప’ శ్రేణులుగా విభజించవచ్చు. తమిళనాడు కొండలను కొల్లాయిమలై, పచ్‌మలై, గోడుమలై, షెవరాయ్, బిలగిరి రంగన్ పర్వతాలని వివిధ పేర్లతో పిలుస్తున్నారు. తూర్పు కనుమల ఉత్తర భాగం ప్రధానంగా ఖొండలైట్, చార్నోకైట్ వంటి శిలలతో ఏర్పడింది. వీటిలో తూర్పు భాగంలో నల్లమల కొండలు, వెలి కొండలు, పాల కొండలు ప్రముఖమైనవి. ఇవి ఆంధ్రప్రదేశ్‌లోని కడప, కర్నూలు జిల్లాల్లో ఉన్నాయి. తూర్పు కనుమల్లో లాంగుల్యా, సీలేరు, వంశధార, మాచ్‌ఖండ్ మొదలైన నదులు జన్మిస్తున్నాయి.

            18 - హిమాలయాలు

            భారత్‌కు ఉత్తర సరిహద్దుగా విస్తరించిన హిమాలయాలు నవీన ముడత పర్వతాలు.. ఇవి టెరిషరీ యుగానికి చెందినవి. దాదాపు 60 మిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడ్డాయి. హిమాలయ పర్వతోద్భవం.. ఆల్ఫైన్, జాగ్రోస్, హిందూకుష్ పర్వతపంక్తుల ఆవిర్భావంతో ముడిపడి ఉంది. యురేషియూ ఖండం భారత ద్వీపకల్పంతో ఢీకొనడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. ఈ పర్వతశ్రేణులున్న చోట గతంలో ‘టెథిస్’ సముద్రం ఉండేది.
             హిమాలయ పర్వత శ్రేణులు భారత్, భూటాన్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, నేపాల్, చైనాల్లో(ఆరు దేశాలు) వ్యాపించి ఉన్నాయి. హిమాలయ పర్వత పంక్తులు పశ్చిమాన పాక్‌లోని పోట్వార్ తీరం నుంచి తూర్పున మయన్మార్- నాగాలాండ్  సరిహద్దుల  వరకు 5,200 కి.మీ. మేర విస్తరించాయి. ఉత్తరాన టిబెట్ పీఠభూమి, దక్షిణాన గంగ బ్రహ్మపుత్ర మైదానాల మధ్య ఇవి వ్యాపించి ఉన్నాయి. 
            హిమాలయాలను తూర్పు-పడమరలుగా..
             1) పంజాబ్, కశ్మీర్ హిమాలయాలు  
             2) కుమవున్, గద్వాల్ హిమాలయాలు 
             3) నేపాల్ హిమాలయాలు
             4) అరుణాచల్ అసోం హిమాలయాలుగా విభజిస్తారు. ఇవి వరుసగా సింధూ-సట్లేజ్, సట్లేజ్-కాళి, కాళి-తీస్తా, తీస్తా- బ్రహ్మపుత్ర నదుల మధ్య విస్తరించి ఉన్నాయి.

            టిబెటన్ హిమాలయాలు భారత్‌లో.. కశ్మీర్‌లోని కారకోరం, జస్కర్, లడఖ్ పర్వతశ్రేణులు టిబెటన్ హిమాలయాల కోవకు చెందినవి.  కారకోరం పర్వతాలను ఆసియూ ఖండానికి వెన్నుముకగా పేర్కొంటారు.  టిబెటన్  హిమాలయాల సగటు ఎత్తు 4500 మీటర్లు. ఇందులో 7000 మీటర్ల కంటే  ఎత్తై  పర్వత శిఖరాలు అనేకం ఉన్నాయి. ఉదా: కె2/గాడ్విన్ ఆస్టిన్, నంగపర్భత్, నామ్చాబారుమా. టిబెటన్ హిమాలయాల్లో అనేక హిమనీనదాలు, హిమనీనద సరస్సులున్నాయి. ఉదా: సియూచిన్ (హిమాలయూల్లో పెద్దది), జైఫూ, మానస సరోవరం, రాకాస్‌తాల్.

             గ్రేటర్ హిమాలయాలు అన్నిటికంటే ఎత్తైవి మధ్య గ్రేటర్ హిమాలయాలు. వీటి సగటు ఎత్తు 6000 మీటర్లు. ఇవి అవిచ్ఛిన్న పర్వతశ్రేణిగా జమ్మూకశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించాయి. ప్రపంచంలో ఎత్తై పర్వతశిఖరాలైన ఎవరెస్టు, నందాదేవి, గైరీశంకర్, మకాలు, కామెత్ మధ్యగ్రేటర్ హిమాలయాల్లోనే  ఉన్నాయి.  గంగోత్రి, యమునోత్రి, పిండామ్ తదితర హిమనీనదాల జన్మస్థానం కూడా ఇదే. కశ్మీర్‌లోని గ్రేటర్-టిబెటన్ హిమాలయాల మధ్య సన్నని మైదానాలు ఉన్నాయి. ఉదా: దేవసాయి మైదానాలు.

             నిమ్న హిమాలయాలు: వీటి సగటు ఎత్తు 2500 మీటర్లు. వీటిని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. జమ్మూకశ్మీర్‌లో పిర్‌పంజాల్ పర్వతాలు, హిమాచల్‌ప్రదేశ్‌లో దవులాధార్ పర్వతాలు, ఉత్తరాఖండ్‌లో ముస్సోరి కొండలు, నేపాల్‌లో మహాభారత్, నాగాటిబ్బా పర్వతాలని పిలుస్తారు. ఈ పర్వతశ్రేణి  వేసవి విడిది  కేంద్రాలకు ప్రసిద్ధి. ఉదా: సిమ్లా, కులూ, మనాలి, నైనిటాల్, డార్జిలింగ్. నిమ్న హిమాలయ సానువుల్లో దట్టమైన కోనిఫర్ అడవులున్నాయి. 

             శివాలిక్ పర్వతాలు: వీటి సగటు ఎత్తు 1000-1500 మీటర్లు మాత్రమే. అందుకే వీటిని ఉప హిమాలయాలుగా పరిగణిస్తారు. ఇతర హిమాలయ పర్వత పంక్తుల శిఖరాలు శంఖాకారంలో ఉంటే.. శివాలిక్ పర్వతాలు కురచగా ఉంటాయి.  వీటిని జమ్మూకశ్మీర్‌లో జమ్మూ కొండలని.. ఉత్తరాఖండ్, నేపాల్‌లో శివాలిక్ కొండలని పిలుస్తారు.  అసొం, అరుణాచల్‌ప్రదేశ్‌లలో ఇవి అంతగా అభివృద్ధి చెందలేదు. శివాలిక్ పర్వతాలు దట్టమైన సమశీతోష్ణ మండల ఆయనరేఖా ఆకురాల్చే అరణ్యాలకు ప్రసిద్ధి. హిమాలయ నదులు శివాలిక్ పర్వతాలను ఛేదించుకుంటూ.. లోతైన ఇరుకు దారుల ద్వారా ప్రవహిస్తాయి. నిమ్న హిమాలయూలు, శివాలిక్ కొండల మధ్య ఉన్న సరస్సు హరివణాలను ‘డూన్’లని పేర్కొంటారు.  ఉదా: డెహ్రాడూన్.  శివాలిక్ పర్వతాలు, గంగా మైదానం మధ్య గిరిపద  మైదానం ఏర్పడింది. దీన్ని ‘బబ్బర్’, ‘తెరాయిమైదానాలుగా  విభజించారు. బబ్బర్ మైదానం గులకరాళ్లు, ఇసుకతో నిండి ఉంది.  తెరాయి మైదానం చిత్తడి నేలలకు ప్రసిద్ధి. ఈ మైదానంలో దట్టమైన రుతుపవన అరణ్యాలు ఉన్నాయి. జిమ్‌కార్బెట్, రాజాజీ నేషనల్ పార్కులు తెరాయి మైదానంలోనే ఉన్నాయి. 

            గంగ-సింధు-బ్రహ్మపుత్ర మైదానంగంగ-సింధు-బ్రహ్మపుత్ర మైదానం 1.5- 2.5 మిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడింది. ఈ మైదానంలో ప్రవహించే అనేక నదులు.. వరద మైదానాలను ఏర్పరచాయి. ఇవి సారవంతమైన ఒండ్రు మట్టిని కలిగి ఉన్నాయి. వీటిని  ‘కద్దర్’, ‘బంగర్’ మైదానాలుగా విభజించారు. కద్దర్ మైదానాలు పల్లపు ప్రాంతాలు. ఇవి తరచుగా వరద ముంపునకు గురవుతుండటంతో.. తాజా ఒండ్రుమట్టి  వచ్చి చేరుతుంది. వరదమైదానాల్లో ఎత్తై ప్రాంతాలు బంగర్‌లు. ఇక్కడ వరద ముంపు అరుదు. దాంతో ఈ ప్రాంతాల్లో పాత ఒండ్రు మట్టే ఉంటుంది. నదీమైదాన ప్రాంతంలో... నదుల మధ్య ఉండే నదీ విభాజక ప్రాంతాలను ‘డోబ్’లని పిలుస్తారు. 

            బాగార్పశ్చిమ రాజస్థాన్‌లోని థార్ ఎడారి.. సింధూ మైదాన ప్రాంతానికి చెందినది. ఆరావళి పర్వతాలకు ఆనుకొని ఉన్న ఈ ఎడారి ప్రాంతం పాక్షికంగా శుష్క మండలం. దీన్ని ‘బాగార్’ ప్రాంతంగా పిలుస్తారు.  ఇక్కడ అనేక ఎడారి నదులు, ఉప్పునీటి సరస్సుల్లోకి ప్రవహిస్తున్నాయి. ఈ ప్రాంతంలో సాంబార్, శబర్, దీద్వానా తదితర ఉప్పునీటి సరస్సులున్నాయి. ‘లూనీ’ పెద్ద ఎడారి నది. బాగార్‌కు పశ్చిమంగా.. పాకిస్తాన్‌లోని సింధ్ రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న థార్ ఎడారి ప్రాంతాన్ని  ‘మరుస్థలి’ అంటారు.

            ద్వీపకల్ప పీఠభూమి:భారతదేశంలో అతిపెద్ద నైసర్గిక విభాగం.. ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతం. ఇది  చిన్న, పెద్ద పీఠభూములు, కొండలు, నదీలోయలతో నిండి ఉంది. ఉత్తరాన గంగా మైదానం, ఈశాన్యంలో రాజమహల్ కొండలు, వాయవ్య దిశలో ఆరావళి కొండలు, పశ్చిమాన పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు, దక్షిణాన కన్యాకుమారి మధ్య ద్వీపకల్ప పీఠభూమి విస్తరించి ఉంది. ఇది అత్యంత పురాతన ఆర్కియూన్ (కాంబ్రియన్) మహాయుగపు శిలలతో ఏర్పడింది. దక్కన్ పీఠభూమి ప్రాంతం స్థిరమైన శిలావరణం.