దేశ ఆర్థికాభివృద్ధిలో ఖనిజ సంపద కీలకపాత్ర పోషిస్తుంది. భారత దేశంలో బొగ్గు, ముడి ఇనుము, బెరైటీస్, బాక్సైట్, మైకా, మాంగనీస్, జిప్సం, డోలమైట్, సున్నపురాయి మొదలైన ఖనిజాలు అధిక సంఖ్యలో లభిస్తున్నాయి.
|
భారతదేశంలో ఖనిజాలు అత్యధికంగా జార్ఖండ్ రాష్ట్రంలోని ‘ఛోటా నాగపూర్’ పీఠభూమిలో లభిస్తున్నాయి. అందువల్ల దీన్ని ‘రూర్ ఆఫ్ ఇండియా’గా పేర్కొంటారు. రూర్ అనేది జర్మనీలోని ప్రసిద్ధి చెందిన ఖనిజాల గని.
దేశంలోని ఖనిజాలను స్థూలంగా నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి: 1. లోహ ఖనిజాలు ఎ. ఫై ఖనిజాలు: ఇనుము, మాంగనీస్, కోబాల్ట్, నికెల్ మొదలైనవి. బి. నాన్ ఫై ఖనిజాలు: రాగి, సీసం, తగరం మొదలైనవి. సి. విలువైన ఖనిజాలు: బంగారం, అల్యూమినియం, వెండి మొదలైనవి. 2. అలోహ ఖనిజాలు మైకా (అభ్రకం), సున్నపురాయి, ముగ్గురాయి, రాతినార మొదలైనవి. 3. అణు ఖనిజాలుయురేనియం, థోరియం, జెర్కోనియం, ఇల్మనైట్, టెటానియం మొదలైనవి. 4. ఇంధన ఖనిజాలు బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు మొదలైనవి. ఇనుముప్రపంచ ఇనుప ఖనిజ నిల్వల్లో 25 శాతం భారతదేశంలోనే ఉన్నాయి. ప్రపంచ ఇనుము ఉత్పత్తిలో మనదేశానికి 5 శాతం వాటా ఉంది. ఇనుము ఉత్పత్తిలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఇనుప ధాతువులో లభ్యమయ్యే ఇనుము శాతం ఆధారంగా ముడి ఇనుప ఖనిజాన్ని 4 విధాలుగా వర్గీకరించవచ్చు. అవి: మాగ్నటైట్: ఇది నలుపు రంగు నుంచి డార్‌క బ్రౌన్ వరకు వివిధ వర్ణాల్లో ఉంటుంది. ఇందులో 72 శాతం వరకు ఇనుము ఉంటుంది. ఇది అన్నింటి కంటే మేలైంది. ఈ రకమైన ఇనుము అగ్ని, రూపాంతర శిలల్లో ఎక్కువగా లభిస్తుంది. హెమటైట్: ఇది ఎరుపు రంగులో ఉండి 70 శాతం వరకు ఇనుమును కలిగి ఉంటుంది. ఈ రకం ఇనుము ప్రపంచంలో ఎక్కువగా లభిస్తోంది. ముఖ్యంగా భారతదేశంలో ఇది విస్తారంగా లభిస్తోంది. లియోనైట్: ఇది బూడిద రంగులో ఉంటుంది. ఇందులో 40 నుంచి 50 శాతం వరకు ఇనుము ఉంటుంది. ఇది అవక్షేప శిలలో లభిస్తుంది. సిడరైట్: ఇది అన్నింటికంటే నాసి రకమైంది. ఇందులో 35 శాతం కంటే తక్కువగా ఇనుము ఉంటుంది. దీన్నే ‘కార్బొనేట్ ఐరన్’ అంటారు. ఇది బొగ్గు గనుల సమీపంలో లభిస్తుంది. ఇది గోధుమ రంగులో ఉండే కర్బన ఇనుము. దేశంలో ముఖ్యమైన ఇనుప గనులు ఒడిశా: కియోంజర్, తాల్చేరు, మయూర్ భంజ్, సుందర్‌గర్. జార్ఖండ్: సింగ్‌భమ్. ఛత్తీస్‌గఢ్: దూర్‌గ, బస్తర్ (బైలదిల్లా గని). కర్ణాటక: చిత్రదుర్‌గ, బళ్లారి, చిక్‌మంగుళూరు ఆంధ్రప్రదేశ్: వైఎస్సార్ కడప జిల్లా, కర్నూలు, నెల్లూరు. తెలంగాణ: ఖమ్మం, ఆదిలాబాద్. మహారాష్ట్ర: చంద్రాపూర్, రత్నగిరి. తమిళనాడు: సేలం.
ఇది పైరోలుసైట్, సైలోమిలేన్, బ్రాకైట్, క్రిప్టోమిలాన్ లాంటి ధాతువుల నుంచి లభిస్తుంది. మాంగనీస్ ఎక్కువగా ‘ధార్వార్’ శిలల నుంచి లభిస్తుంది.
ఒడిశా: కియోంజర్, కలహండి, కోరాపుట్ కర్ణాటక: షిమోగా, బెల్గాం, తుమ్కూరు. ఆంధ్రప్రదేశ్: శ్రీకాకుళం, విజయనగరం. మధ్యప్రదేశ్: బాలాఘాట్, చింద్వారా బెల్ట్. మహారాష్ట్ర: నాగపూర్, బండారా బెల్ట్. మాంగనీస్‌ను బ్లీచింగ్ పౌడరు, నల్ల ఎనామిల్ తయారీలో; ఫొటోగ్రఫీ, తోళ్లు, గాజు పరిశ్రమల్లోనూ ఉపయోగిస్తారు. బాక్సైట్దీన్నే ‘అల్యూమినియం ఆక్సైడ్’ అని కూడా అంటారు. దీని నుంచి అల్యూమినియంను సంగ్రహిస్తారు.
ఒడిశా: కలహండి, కోరాపుట్. ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి. గుజరాత్: జామ్‌నగర్, కెరా, కచ్. ఛత్తీస్‌గఢ్: బిలాస్‌పూర్, రాయ్‌గర్ మధ్యప్రదేశ్: జబల్‌పూర్, బాలాఘాట్. కర్ణాటక: కెమ్మనగండి.
రాజస్థాన్: ఖేత్రి, ఆల్వార్, జైపూర్. ఆంధ్రప్రదేశ్: అగ్నిగుండాల (గుంటూరు). మధ్యప్రదేశ్: మలజ్‌ఖండ్, బాలాఘాట్. జార్ఖండ్: సింగ్‌భమ్, హజారీబాగ్. తమిళనాడు: దక్షిణ ఆర్కాట్. కర్ణాటక: హసన్. హిమచల్‌ప్రదేశ్: కాంగ్రా. బంగారంబంగారాన్ని ‘నోబుల్ మెటల్’ అంటారు. ప్రపంచంలో బంగారం ఉత్పత్తిలో 0.75 శాతం మనదేశంలో ఉత్పత్తి అవుతోంది.
ఆంధ్రప్రదేశ్: అనంతపురం జిల్లాలోని రామగిరి. తమిళనాడు: కోయంబత్తూరు, నీలగిరులు. కేరళ: కోజికోడ్. క్రోమైట్ఇది క్రోమియం నుంచి లభిస్తుంది. దీన్ని ‘స్టెయిన్‌లెస్ స్టీల్’ తయారీలో ఉపయోగిస్తారు.
మహరాష్ట్ర: రత్నగిరి, భాండార్. |
0 comments:
Post a Comment