భారతదేశం సంక్షేమ రాజ్యం. ఈ భావనను దృష్టిలో ఉంచుకొని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇవి సక్రమంగా అమలయ్యేందుకు, వనరుల సమర్థ వినియోగానికి జనాభా లెక్కలను సేకరించడం తప్పనిసరి. జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘డెమోగ్రఫీ’ అంటారు. దేశంలో తొలిసారిగా 1872లో జనాభా లెక్కల సేకరణ మొదలైంది. 1881 నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కలను సేకరిస్తున్నారు.
|
భారతదేశ జనాభాలో విభిన్న శారీరక లక్షణాలు కనిపిస్తాయి. ప్రాచీన కాలం నుంచి వివిధ దేశాలకు చెందినవారు భారతదేశంలోకి ప్రవేశించి సాంఘికంగా, సాంస్కృతికంగా ఇక్కడి సమాజంలో కలిసిపోయారు. వీరు స్థానికులతో వివాహ సంబంధాలు ఏర్పర్చుకున్నారు. ఫలితంగా విభిన్న శారీరక లక్షణాలున్న సంతతి ఉద్భవించిందని ఆంత్రోపాలజిస్టుల అభిప్రాయం.
‘రిస్లే’ అనే ఆంత్రోపాలజిస్టు శారీరక లక్షణాల ఆధారంగా ప్రపంచ జనాభాను ఆరు జాతులుగా విభజించారు. ఏ దేశ జనాభాలోనైనా ఒక జాతి లేదా రెండు జాతుల లక్షణాలు ఉంటాయి. కానీ భారతదేశంలో మాత్రమే ప్రపంచంలోని ఆరు జాతుల లక్షణాలు కనిపిస్తాయి. అవి... ఎ) నీగ్రిటోలుదేశంలోకి మొదటిసారిగా వలస వచ్చిన జాతిగా వీరిని పేర్కొనవచ్చు. అండమాన్ నికోబార్ దీవుల్లో నివసించే షోంపైన్స్, జార్వాస్, ఓంజెస్ లాంటి తెగలలో, కేరళలోని పులియాన్స్ తెగలలో ఈ జాతి లక్షణాలు కనిపిస్తాయి. బి) ప్రొటో ఆస్ట్రలాయిడ్స్మధ్య భారతదేశంలో నివసించే గోండులు, ముండాలు, భిల్లులు, ఒరేన్‌లు, సంతాలులు, చెంచులు, కురుంబాలు లాంటి గిరిజన తెగలలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. సి) మెడిటరేనియన్వీరినే ద్రవిడులు అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో నివసించే ప్రజలను ఈ జాతి సంతతిగా పేర్కొంటారు. వీరినే సింధూ నాగరికత ప్రజల సంతతిగా పేర్కొనవచ్చు. ద్రవిడ ప్రజల జీవన విధానంలో సింధూ నాగరికత ప్రజల సాంస్కృతిక లక్షణాలు ఇప్పటికీ కనిపిస్తాయి. డి) మంగోలాయిడ్స్ఈశాన్య భారతదేశంలోని అసోం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రజల్లో, అండమాన్‌లోని ‘సెంటినీలీస్’ అనే తెగలో ఈ జాతి లక్షణాలు కనిపిస్తాయి. ఈ జాతి ప్రజల శరీరంలో ‘ఎపికాంతిక్ ఐలిడ్’ అనే ప్రత్యేక లక్షణం కనిపిస్తుంది. ఇ) బ్రాకీ సెఫాలస్ వీరినే కాకసాయిడ్ జాతి ప్రజలుగా పేర్కొంటారు. ఈ జాతి వారిలో తల వెడల్పుగా ఉంటుంది. గుజరాత్, మహారాష్ర్టలోని మార్వాడీలు, పశ్చిమ బెంగాల్‌లోని నయనార్ క్షత్రియులు, నంబూద్రీ బ్రాహ్మణుల్లో ఈ జాతి లక్షణాలు కనిపిస్తాయి. ఎఫ్) నార్డిక్స్ వీరినే ఆర్యన్లు అని పిలుస్తారు. భారతదేశంలోకి చివరిసారిగా వలస వచ్చిన జాతిగా వీరిని పేర్కొనవచ్చు. ఈ జాతి లక్షణాలున్న సంతతి ప్రస్తుతం పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లోని రాజపుత్రులు, జాట్‌లలో కనిపిస్తుంది. జనాభా లెక్కల సేకరణ (2011)ఒక నిర్దిష్ట ప్రాంతంలో తమలో తాము అంతఃప్రజననం జరుపుకునే, నిర్దిష్ట ఆవాసంలో నివసించే ప్రజా సమూహమే జనాభా. ఇంటింటి సర్వే ద్వారా శాస్త్రీయ పద్ధతిలో జనాభా, దాని అనుబంధ అంశాలను సేకరించే పద్ధతినే జనాభా లెక్కల సేకరణ అంటారు. భారతదేశం సంక్షేమ రాజ్యం. ఈ భావనను దృష్టిలో ఉంచుకొని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇవి సక్రమంగా అమలయ్యేందుకు, వనరుల సమర్థ వినియోగానికి జనాభా లెక్కల సేకరణ తప్పనిసరి. జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘డెమోగ్రఫీ’ అని అంటారు.
|
0 comments:
Post a Comment