ఒక దేశం లేదా రాష్ట్రం ఆర్థికంగా, సాంకేతికంగా ముందడుగు వేయడంలో పరిశ్రమల పాత్ర కీలకం. సమాజ సంక్షేమం పారిశ్రామిక అభివృద్ధితోనే సాధ్యమవుతుందని చెప్పవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. భారతదేశంలో ఇనుము-ఉక్కు పరిశ్రమల స్థాపనతో ప్రారంభమైన పారిశ్రామికీకరణ క్రమంగా అన్ని రంగాలకు విస్తరించింది. రెండో పంచవర్ష ప్రణాళికా కాలం నుంచి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పరిశ్రమల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోంది. ‘టీఎస్-ఐపాస్’ లాంటి నూతన విధానాలతో పారిశ్రామికీకరణను వేగవంతం చేస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
|
తెలంగాణ రాష్ట్రం భారీ పరిశ్రమలకు పుట్టినిల్లు లాంటిది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిసరాల్లో అనేక రకాల పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ ఐటీ, ఫార్మా, ఇంజనీరింగ్ గూడ్స్, డిఫెన్స్ లాంటి చాలా పరిశ్రమలను నెలకొల్పారు.
రాష్ట్రంలోని పరిశ్రమలను ముడిసరకు ఆధారంగా మూడు రకాలుగా విభజించవచ్చు. అవి: 1. వ్యవసాయాధారిత పరిశ్రమలు 2. అటవీ ఆధారిత పరిశ్రమలు 3. ఖనిజ ఆధారిత పరిశ్రమలు వ్యవసాయాధారిత పరిశ్రమలు వ్యవసాయ ముడి పదార్థాలపై ఆధారపడి వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలను ‘వ్యవసాయాధారిత పరిశ్రమలు’ అంటారు. వీటిలో వస్త్ర పరిశ్రమ, పంచదార పరిశ్రమ, సిగరెట్ పరిశ్రమలు ముఖ్యమైనవి. ఎ. వస్త్ర పరిశ్రమతెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ పరిశ్రమ ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. హైదరాబాద్, మెదక్, భువనగిరి, నిర్మల్, వరంగల్ ప్రాంతాలు వస్త్ర పరిశ్రమకు గుర్తింపు పొందాయి. ముఖ్యమైన వస్త్ర పరిశ్రమలు:
బి. పంచదార పరిశ్రమతెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి పంచదార పరిశ్రమ ‘నిజాం చక్కెర పరిశ్రమ’. దీన్ని హైదరాబాద్ సంస్థానం చివరి నవాబైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1921లో నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో స్థాపించారు. ఇది రాష్ట్రంలోని పంచదార పరిశ్రమల్లో కెల్లా పెద్దది. ఈ కర్మాగారంలో పంచదారతోపాటు మొలాసిస్, పిప్పర్‌మెంట్లు, కార్బన్ డై ఆక్సైడ్ వాయువును కూడా తయారు చేస్తారు.
ఈ పరిశ్రమకు అనుబంధంగా నాలుగు పంచదార ఫ్యాక్టరీలను నెలకొల్పారు. అవి: 1. జహీరాబాద్ (మెదక్) - 1973 2. మిర్యాలగూడ (నల్లగొండ) - 1977 3. ముత్యంపేట (కరీంనగర్) - 1981 4. సారంగాపూర్ (నిజామాబాద్) సి. సిగరెట్ పరిశ్రమవజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ (వీఎస్‌టీ):దీన్ని ఎం.డి. వజీర్ 1920లో ఆజామాబాద్ (హైదరాబాద్)లో స్థాపించారు. ఇది 1983లో పూర్తిగా స్వతంత్ర సంస్థగా రూపొంది వీఎస్టీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌గా నమోదైంది. ఇది చార్మినార్ సిగరెట్లను తయారు చేసి, సరఫరా చేస్తోంది.
అటవీ ఆధారిత పరిశ్రమలు
అడవిలో లభించే ముడి పదార్థాలతో వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలను ‘అటవీ ఆధారిత పరిశ్రమలు’ అంటారు. వీటిలో కాగితం పరిశ్రమ ముఖ్యమైంది. కాగితం పరిశ్రమసాధారణంగా కాగితం పరిశ్రమల్లో వెదురు, యూకలిప్టస్, సుబాబుల్ కలపను వినియోగిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిశ్రమలో ఎక్కువగా వెదురును వాడుతున్నారు. సిర్పూర్ పేపర్ మిల్స్: హైదరాబాద్ చివరి నవాబు అయిన మీర్ ఉస్మాన్ అలీ కాలంలో 1938లో ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో ‘సిర్పూర్ పేపర్ మిల్స్’ను నెలకొల్పారు. తెలంగాణ రాష్ట్రంలోని మొదటి పేపర్ మిల్లు ఇదే. ప్రస్తుతం ఇది మూతపడి ఉంది. రాష్ట్రంలోని ముఖ్యమైన కాగితం మిల్లులు:
ఖనిజ ఆధారిత పరిశ్రమలుగనుల నుంచి లభించే ఖనిజాలను ముడిసరకుగా ఉపయోగించి వస్తువులను తయారు చేసే పరిశ్రమలను ‘ఖనిజ ఆధారిత పరిశ్రమలు’ అంటారు. తెలంగాణాలో ఎక్కువగా సిమెంట్, ఇనుము-ఉక్కు, ఆస్‌బెస్టాస్ తదితర ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి ఎ. ఇనుము - ఉక్కు పరిశ్రమ1980లో ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో ‘స్పాంజ్ ఐరన్ ప్లాంట్’ను స్థాపించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్. ఇందులో తక్కువ స్థాయి బొగ్గును ఉపయోగిస్తున్నారు. బి. సిమెంట్ పరిశ్రమరాష్ట్రంలో సున్నపురాయి నిల్వలు అత్యధికంగా ఉన్నందువల్ల సిమెంట్ పరిశ్రమ రాష్ట్ర మంతటా వ్యాపించి ఉంది. ఇవి నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి.
రాష్ట్రంలోని ముఖ్యమైన కుటీర పరిశ్రమలు1. నిర్మల్ పెయింటింగ్స్అండ్ టాయ్స్ఈ పరిశ్రమ ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్‌లో 1955లో ఏర్పడింది. దీనికి రాష్ట్రపతి అవార్డు లభించింది. నిర్మల్ పెయింటింగ్స్ బంగారు వర్ణానికి ప్రసిద్ధి. వీటికి ఉపయోగించే కలప ‘పునికి కర్ర’. ఇది తేలికగా, అందంగా తీర్చిదిద్దడానికి అనువుగా ఉంటుంది.
3. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీఇది పురాతన కళ. ఇది ఎక్కువగా కరీంనగర్ జిల్లాలో అభివృద్ధి చెందింది. ఇందులో ఎక్కువ మొత్తంలో వెండి లేదా బంగారం లోహాలను ఉపయోగించి మృదువైన ఆభరణాలను తయారు చేస్తారు.
4. పెంబర్తి ఇత్తడి కుటీర పరిశ్రమ కఠినమైన ఇత్తడి మెటల్ షీట్‌పై అద్భుత కళాఖండాలు చెక్కే కళ ఇది. ఈ కళ వరంగల్ జిల్లాలోని ‘పెంబర్తి’ గ్రామంలో పుట్టింది. పెంబర్తి ఇత్తడి కళ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. దేశంలోని ఇత్తడి కళకు ఇది ప్రధాన కేంద్రంగా ఉంది. ఇతర కుటీర పరిశ్రమలు - ప్రసిద్ధి పొందిన ప్రాంతాలు:
|
0 comments:
Post a Comment