హర్దిక వలయం (కార్డియాక్ సైకిల్)
- పిండం (భ్రూణం)లో మొదట ఏర్పడే అవయవం గుండె.
- మానవుడి గుండె పిండాభివృద్ధి దశలో 21వ రోజు నుంచి స్పందిస్తుంది.
- కర్ణికలు, జఠరికలు ఒకసారి సంకోచించి తిరిగి యథాస్థితికి వస్తే దాన్ని ఒక హృదయ స్పందన వలయం లేదా హర్దిక వలయం అంటారు.
హర్దిక వలయంలో 3 దశలు ఉంటాయి. ఎ) కర్ణికలు జఠరికల విశ్రాంత స్థితి (ఊహాస్థితి)
బి) శరీర భాగాల నుంచి కర్ణికల్లోకి రక్త ప్రవాహం..
మొదటి దశ: కర్ణికల సంకోచం (సిస్టోల్) .. రక్తం జఠరికల్లోకి ప్రవహిస్తుంది.
రెండో దశ: జఠరికల సంకోచం (సిస్టోల్).. కవాటాలు మూసుకుంటాయి(లబ్). రక్తం ధమనుల్లోకి ప్రవహిస్తుంది.
మూడో దశ: జఠరికల కర్ణికల యథాస్థితి (డయాస్టోల్) ధమనుల్లోని కవాటాలు మూసుకుంటాయి (డబ్).
సిస్టోల్
డయాస్టోల్
హృదయ స్పందన / గుండె కొట్టుకోవడం
- ఒక సంకోచం + ఒక సడలిక లేదా ఒక సిస్టోల్ + ఒక డయాస్టోల్ లేదా ఒక లబ్ + ఒక డబ్ను హృదయ స్పందనగా పేర్కొంటారు.
- హృదయ స్పందన ప్రారంభమయ్యే ప్రదేశం లయారంబకం (పేస్మేకర్).
- మానవుడిలో లయారంబకం AN, A.V. Node. (Sinus Auricular Node), (Atriun Ventricle node) (సిరాకర్ణిక, కర్ణిక జఠరిక కణుపు)
- కప్పలో లయారంబకం AN మాత్రమే. ఇది కుడికర్ణికలో ఉంటుంది.
- మానవుడిలో హృదయ సంకోచం సిరాకర్ణిక కణుపులో ప్రారంభమై ఊ కర్ణిక జఠరిక కణుపునకు వ్యాపించి అక్కడి నుంచి సంకోచం చెంది బండిల్ ఆఫ్ హిజ్ ద్వారా జఠరిక కుడ్యానికి విస్తరిస్తుంది.
- ఆరోగ్యవంతమైన ప్రౌఢ వ్యక్తిలో గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది.
- చిన్నపిల్లల్లో నిమిషానికి 130-140 సార్లు, వృద్ధుల్లో 60-70 సార్లు కొట్టుకుంటుంది.
- ఒక హృదయ స్పందనకు పట్టే కాలం - 0.8 సెకన్లు.
- కర్ణికల సంకోచానికి పట్టే సమయం - 0.11-0.14 సెకన్లు.
- జఠరికల సంకోచానికి పట్టే సమయం - 0.27-0.35 సెకన్లు.
- చిన్న పిల్లలు, వ్యాయామం చేసే సమయంలో, జ్వరం వచ్చిన వారిలో హృదయ స్పందన ఎక్కువగా ఉంటుంది.
- హృదయ స్పందనను వినే పరికరాన్ని స్టెతస్కోప్ (ప్రోనోకార్డియోగ్రాఫ్) అంటారు. దీన్ని రినె లిన్నెక్ కనుకొన్నారు.
- ధ్వని పరావర్తన సూత్రంపై ఆధారపడి స్టెతస్కోప్ పనిచేస్తుంది.
- అతిపెద్ద హృదయం (ఎక్కువ బరువు ఉన్న గుండె) తిమింగలంలో ఉటుంది.
- అతి తక్కువ హృదయ స్పందనలు చూపే గుండె నీలి తిమింగలం - 7 / నిమిషం.
- అతి చిన్న హృదయం (తక్కువ బరువు) కోయల్ టిట్ పక్షిలో ఉంటుంది.
- అతి ఎక్కువ హృదయ స్పందనలు చూపే గుండె కోయల్ టిట్ పక్షి -1200 / నిమిషం.
- క్షీరదాల్లో అతి చిన్న హృదయం ష్రూ (చుంచెలుక)లో ఉంటుంది. దీని గుండె నిమిషానికి 500 సార్లు కొట్టుకుంటుంది.
- టాకికార్డియా అంటే సగటుకంటే అధిక హృదయ స్పందనరేటు.
- బ్రాకికార్డియా అంటే సగటు కంటే తక్కువ హృదయ స్పందన రేటు.
- ఒకసారి హృదయ స్పందన జరిగినప్పుడు పంపు చేయడానికి కావాల్సిన రక్తం 70 మిల్లిలీటర్లు.
- ఒక నిమిషానికి మానవుడి హృదయం (4,900 మి.లీ.) దాదాపు 5 లీ. రక్తం పంపు చేస్తుంది.
- 72 స్పందనలు × 70 మి.లీ. రక్తం = 5040 మి.లీ. / నిమిషం. దాదాపు 5 లీటర్ల రక్తం.
వివిధ జీవుల్లో గుండె గదుల సంఖ్య- రక్త ప్రసరణ
జీవి | కర్ణికలు | జఠరికలు | మొత్తం గదులు | రక్త ప్రసరణ విధానం |
చేపలు | 1 | 1 | 2 | ఏకవలయ రక్త ప్రసరణ |
| | | | వ్యవస్థ(సింగిల్ సర్క్యులేషన్) |
ఉభయచరాలు | 2 | 1 | 3 | అసంపూర్ణ ద్విప్రసరణ |
సరీసృపాలు | 2 | 1½ | 3½ | అసంపూర్ణ ద్విప్రసరణ |
ఎ) మొసలి (సరీసృపం) బి) పక్షులు సి) క్షీరదాలు | 2 | 2 | 4 | ద్వంద్వ ప్రసరణ (డబుల్ సర్క్యులేషన్) |
జంతువు
| శరీర బరువు | గుండె బరువు | నిమిషానికి హృదయ స్పందనలు |
నీలి తిమింగలం | 1,50,000 కిలోలు | 750 కిలోలు | 7 |
ఏనుగు | 3,000 కిలోలు | 12-21 కిలోలు | 46 |
మానవుడు | 60-70 కిలోలు | 300 గ్రాములు | 72 |
కోయల్ టిట్ పక్షి | 8 గ్రాములు | 0.15 గ్రాములు | 1200 |
0 comments:
Post a Comment