తెలంగాణ రాష్ట్రం 15°55' నుంచి 19° 56' ఉత్తర అక్షాంశాలు, 77° 15' నుంచి 80° 47' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. రాష్ట్ర వైశాల్యం 1,14,840 చ.కి.మీ. ఇది భారతదేశ విస్తీర్ణంలో దాదాపుగా 3.49 శాతం. విస్తీర్ణపరంగా దేశంలో 12వ స్థానంలో ఉంది.
|
రాష్ట్ర సరిహద్దులు
తెలంగాణ రాష్ట్రానికి తూర్పు, దక్షిణ సరిహద్దుగా ఆంధ్రప్రదేశ్, ఈశాన్య సరిహద్దుగా ఛత్తీస్‌గఢ్, ఉత్తర, వాయవ్య సరిహద్దుగా మహారాష్ట్ర, పశ్చిమ సరిహద్దుగా కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి.
జిల్లాలు - సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రం
1) మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం - ఆంధ్రప్రదేశ్ 2) మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ - కర్ణాటక 3) ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ - మహారాష్ట్ర 4) ఖమ్మం, వరంగల్, కరీంనగర్ - ఛత్తీస్‌గఢ్
రాష్ట్రంలోని అన్ని జిల్లాలు పశ్చిమ పీఠభూమి (దక్కన్ పీఠభూమిలోని భాగం) పరిధిలో ఉన్నాయి. ఇది పురాతనమైన పెనిప్లేన్, గోండ్వానా శిలలతో కూడి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఆర్కియన్, నైస్, గ్రానైట్ శిలలున్నాయి.
పశ్చిమ కనుమలు లేదా సహ్యాద్రి పర్వతాలు అజంతా శ్రేణి నుంచి విడిపోయి ఆగ్నేయ దిశగా తెలంగాణ రాష్ట్రంలో మొదటగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశిస్తున్నాయి. అక్కడి నుంచి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల వరకు విస్తరించాయి. ఈ పర్వతాలను వివిధ జిల్లాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు. తూర్పు కనుమలు రాష్ట్రంలోకి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవేశిస్తున్నాయి. వీటిని రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో వివిధ పేర్లతో పిలుస్తున్నారు. |
0 comments:
Post a Comment