మానవుడిలో ఒక జత ఎడ్రినల్ గ్రంథులు మూత్ర పిండాల పైభాగంలో ఉంటాయి. అధివృక్క వల్కలం నుంచి విడుదలయ్యే హార్మోన్లను కార్టికాయిడ్‌లు అంటారు. ఇవి మూడు రకాలు. అవి.. కార్టిసాల్, అల్డోస్టిరాన్, లైంగిక కార్టికాయిడ్‌లు. ఎడ్రినలిన్ హార్మోన్ హృదయ స్పందన రేటును పెంచి గుండెపోటుకు కారణమవుతుంది. ప్రొజెస్టిరాన్‌ను ప్రెగ్నెన్సీ హార్మోన్, గర్భస్రావ నిరోధక హార్మోన్ అంటారు. ఈ హార్మోన్ పిండ ప్రతిస్థాపనకు తోడ్పడుతుంది. పీనియల్ గ్రంథి మానవుడి మెదడు ద్వారగోర్థం పృష్టతలంలో ఉంటుంది. ఇది మెలటోనిన్ హార్మోన్‌ను స్రవిస్తుంది.
|
1. ఎడ్రినల్ (అధివృక్క) గ్రంథులుమానవుడిలో ఒక జత ఎడ్రినల్ గ్రంథులు మూత్ర పిండాల పైభాగంలో ఉంటాయి. అధివృక్క గ్రంథిలో రెండు భాగాలుంటాయి. 1. వల్కలం.. అధివృక్క గ్రంథి వెలుపలి భాగం. 2. దవ్వ.. లోపలి భాగం.
అధివృక్క వల్కల హార్మోన్లు: దీని నుంచి విడుదలయ్యే హార్మోన్లను కార్టికాయిడ్‌లు అంటారు. ఇవి మూడు రకాలు. ఎ) కార్టిసాల్ బి) అల్డోస్టిరాన్ సి) లైంగిక కార్టికాయిడ్‌లు కార్టిసాల్ఈ హార్మోన్ పిండి పదార్థాల జీవక్రియలో పాల్గొంటుంది. ఉపవాస(అత్యవసర) పరిస్థితుల్లో గ్లూకోజ్‌ను సంశ్లేషించి రక్తంలోకి విడుదల చేస్తుంది. కాబట్టి కార్టిసాల్‌ను ప్రాణరక్షక హార్మోన్ అంటారు. ఇది ఒక ఒత్తిడి పోరాట హార్మోన్‌గా కూడా పనిచేస్తుంది. కార్టిసాల్ అధికస్రావం వల్ల కూషింగ్స్ వ్యాధి (బఫెల్లో నెక్) వస్తుంది. - లక్షణాలు: ముఖం, అవయవాలు, వీపు ప్రాంతంలో కొవ్వు పేరుకుపోతుంది. వీపుపై మూపురం (బఫెల్లో హంప్) వేలాడుతూ ఉంటుంది. కార్టిసాల్ తక్కువైతే అడిసన్స్ వ్యాధి వస్తుంది. లక్షణాలు: చర్మంపై కంచు వర్ణపు మచ్చలు, బరువు కోల్పోవడం, కండరాల బలహీనత. అల్డోస్టిరాన్ఇది దేహంలో నీరు, లవణాల తుల్యతను క్రమపరుస్తుంది. మూత్రం నుంచి సోడియం (Na+) పునఃశోషణను పెంచుతుంది. అదే సమయంలో పొటాషియం (K+), ఫాస్ఫేట్ అయాన్లను మూత్రంలోకి స్రవింపజేయడంలో తోడ్పడుతుంది. శరీరంలో పొటాషియం అయాన్ల గాఢత పెరగడం ప్రమాదకరం. కాబట్టి అధివృక్క ఆల్డోస్టిరాన్ లోపిస్తే మానవుడు మరణిస్తాడు. లైంగిక కార్టికాయిడ్లుఇవి ఒక రకమైన లైంగిక హార్మోన్లు(ఆండ్రోజన్స్). ఇవి స్త్రీ, పురుషుల్లో లైంగిక హార్మోన్లకు అనుబంధంగా పనిచేస్తాయి. ఈ హార్మోన్ల అధిక స్రావం వల్ల స్త్రీ , పురుషుల్లో వ్యాధులు వస్తాయి. అవి..
ఎ) ఎడ్రినలిన్ (ఎఫినెఫ్రిన్) బి) నార్ ఎడ్రినలిన్ (నార్ ఎఫినెఫ్రిన్) ఇవి ఒత్తిడి, అత్యవసర పరిస్థితులకు అనుక్రియగా ఉత్పత్తి అవుతాయి. కాబట్టి వీటిని అత్యవసర హార్మోన్లు (ఎమర్జెన్సీ హార్మోన్లు), పోరాట లేదా పలాయన హార్మోన్లు, 3F హార్మోన్ (Fight -Flight - Fright), 4 హార్మోన్ (Sugar Metabolism, Salt retainning, Sex hormones, Source of Energy), బీపీ హార్మోన్ లేదా రక్తపోటుకు కారణమైన హార్మోన్ అని పిలుస్తారు. ఈ హార్మోన్ల వల్ల భయం, కోపం వంటి భావోద్వేగాలకు లోనైనప్పుడు వెంట్రుకలు నిక్కబొడుచుకోవడం, చెమటపట్టడంతో పాటు హృదయస్పందన, శ్వాసక్రియ రేటు పెరుగుతాయి. ఎడ్రినలిన్హృదయ స్పందన రేటును పెంచి గుండెపోటుకు (బీపీ) కారణమవుతుంది. నార్ ఎడ్రినలిన్ఈ హార్మోన్ రక్త పీడనాన్ని తగ్గిస్తుంది (నియంత్రిస్తుంది) గమనిక: లోనోట్రోప్స్ రక్తపోటును తగ్గించడానికి వాడే ఔషధం. 2. బీజకోశాలుబీజకోశాలు రెండు రకాలు.. 1) పురుష బీజకోశాలు (ముష్కాలు) 2) స్త్రీ బీజ కోశాలు ముష్కాలు / పురుష బీజకోశాలు ముష్కాలు పురుష ప్రత్యుత్పత్తి అంగాలు. ఒక జత ముష్కాలు శరీరం వెలుపల ముష్క గోణుల్లో ఉంటాయి.
5. జఠరాంత్రనాళ హార్మోన్లుజీర్ణాశయం, ఆంత్రమూలాల శ్లేష్మస్తరం హార్మోన్లను స్రవిస్తుంది. ఈ హార్మోన్లు జీర్ణ గ్రంథుల చర్యలను పరిరక్షిస్తాయి. ఇది నాలుగు రకాల పెప్టైడ్ హార్మోన్లను స్రవిస్తుంది. అవి...
|
0 comments:
Post a Comment