?max-results="+numposts1+"&orderby=published&alt=json-in-script&callback=showrecentposts1\"><\/script>");

Popular Posts

What’s Hot

ఒక దేశంలోని ప్రజల ఆర్థిక, సాంఘిక, రాజకీయ, జీవన స్థితిగతులు ఆ దేశంలోని రవాణా సౌకర్యాల అభివృద్ధిపై ఆధారపడి ఉంటాయి. వస్తువులను, ప్రయాణికులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చేర్చడాన్ని ‘రవాణా’ అంటారు. ప్రాథమిక, పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధిలో రవాణా సౌకర్యాల పాత్ర అత్యంత కీలకం. రాష్ట్రంలో 2014-15 నాటికి సేవా రంగంలో రవాణా రంగం వాటా 10.58 శాతంగా ఉంది. సేవా రంగంలో ఇది ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది.
రాష్ట్రంలో ప్రధానంగా మూడు రకాల రవాణా సౌకర్యాలు ఉన్నాయి. అవి:
1. రోడ్డు రవాణా 
2. రైల్వే రవాణా
3. వాయు రవాణా
తెలంగాణకు సముద్ర తీర ప్రాంతం లేదు కాబట్టి రాష్ట్రంలో జల రవాణాకు తగిన ప్రాధాన్యం లేదు.

రోడ్డు రవాణా
తెలంగాణ రాష్ట్రంలో ‘నిజాం స్టేట్ రైల్వే’లో భాగంగా 1932లో భారతదేశంలోనే మొట్టమొదటి రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశారు. దీని పేరు ‘నిజాం రాష్ట్ర రైల్ అండ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్’ (ఎన్‌ఎస్‌ఆర్-ఆర్‌టీడీ).
  • రాష్ట్రంలోని మొదటి రోడ్డు రవాణా సంస్థ 27 బస్సులు, 166 మంది కార్మికులతో ప్రారంభమైంది.
  • నిజాం రాజ్య ప్రధానమంత్రి సాలార్జంగ్ చొరవతో హైదరాబాద్ - షోలాపూర్ రహదారిని నిర్మించారు.
  • 1932లో రహదారులను జాతీయం చేసి ప్రభుత్వమే బస్సులను నడిపింది.
  • 1936 నాటికే హైదరాబాద్ నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాలకు బస్సులు నడపటం ప్రారంభమైంది.
  • ఎన్‌ఎస్‌ఆర్-ఆర్‌టీడీ సంస్థను హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేసిన తేదీ 1951 నవంబర్ 1.
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1965లో ‘రోడ్లు, భవనాల శాఖ (ఆర్ అండ్ బీ)’ను ఏర్పాటు చేశారు.
  • ప్రస్తుతం రాష్ట్రంలోని రోడ్లు ‘తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ’ పరిధిలో ఉన్నాయి.
  • రాష్ట్రంలో 80 శాతానికి పైగా సరకులు, ప్రయాణికుల రవాణా రోడ్డు మార్గాలపైనే ఆధారపడి ఉంది.
  • 2015 జనవరి 30 నాటికి తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం రహదారుల పొడవు 26,837 కి.మీ.
  • రాష్ట్రంలో ఒక చదరపు కి.మీ.కు రోడ్డు సాంద్రత 0.23 కి.మీ.గా ఉంది.
  • తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వేయి మందికి అందుబాటులో ఉన్న రోడ్డు 0.86 కి.మీ.

రోడ్లు - రకాలురాష్ట్రంలోని రోడ్లను ‘ఆర్ అండ్ బీ నెట్ వర్‌‌క’ కింద ఉన్న రోడ్లు, ‘పంచాయతీ రాజ్’ రోడ్లు అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఆర్ అండ్ బీ నెట్‌వర్క్ కింద ఉన్న రోడ్లను తిరిగి జాతీయ రహదారులు (ఎన్‌హెచ్), రాష్ట్ర రహదారులు (ఎస్‌హెచ్), ప్రధాన జిల్లా రహదారులు, గ్రామీణ రోడ్లుగా విభజించవచ్చు.

రాష్ట్రంలో రహదారుల నెట్‌వర్క్ :
  • రాష్ట్రంలోని మొత్తం జాతీయ రహదారుల విస్తీర్ణం 2,592 కి.మీ.
  • రాష్ట్ర రహదారుల పొడవు 3,152 కి.మీ.
  • ప్రధాన జిల్లా రహదారుల పొడవు 12,079 కి.మీ.
  • గ్రామీణ రహదారుల పొడవు 9,014 కి.మీ.
  • జాతీయ రహదారులు మినహాయించి రాష్ట్ర రహదారుల మొత్తం పొడవు 24,245 కి.మీ.

జాతీయ రహదారులుఇవి సెంట్రల్ వర్క్స్ డిపార్ట్ మెంట్ పరిధిలో ఉంటాయి.
  • తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదార్లు అధికంగా (266 కి.మీ.) ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. అతి తక్కువగా హైదరాబాద్‌లో (36 కి.మీ.) ఉన్నాయి.
  • రాష్ట్రంలో జాతీయ రహదారుల సాంద్రత 100 చ.కి.మీ. ప్రాంతానికి 2.25 కి.మీ.గా ఉంది.
  • దేశంలో జాతీయ రహదారుల సాంద్రత 100 చ.కి.మీ. ప్రాంతానికి 2.82 కి.మీ.
  • రాష్ట్రంలో అతి పొడవైన జాతీయ రహదారి ‘ఎన్‌హెచ్-44’, అతి చిన్న జాతీయ రహదారి ‘ఎన్‌హెచ్-61’.
  • రాష్ట్రంలోని మొత్తం జాతీయ రహదారుల పొడవు 2,592 కి.మీ. ఇందులో.. నాలుగు లేన్ల జాతీయ రహదారుల పొడవు 964 కి.మీ.
    రెండు లైన్ల జాతీయ రహదారుల పొడవు 1264 కి.మీ.
    మధ్య తరహా (ఇంటర్మీడియెట్) లైన్ జాతీయ రహదారుల పొడవు 153 కి.మీ.
    సింగిల్ లైన్ జాతీయ రహదారుల పొడవు 211 కి.మీ.

రాష్ట్రంలోని జాతీయ రహదారులు1. జాతీయ రహదారి నంబర్ - 44 ఇది వారణాసి నుంచి కన్యాకుమారి వరకు ఉంది. దీని పాత నంబర్ - 7. ఇది మహారాష్ట్ర సరిహద్దు నుంచి ఆదిలాబాద్, నిర్మల్, రామాయంపేట, హైదరాబాద్, మహబూబ్‌నగర్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. తెలంగాణలో ఈ రహదారి పొడవు 519.64 కి.మీ.
2. జాతీయ రహదారి నంబర్ - 65దీని పాత నంబర్ -9. ఇది కర్ణాటక సరిహద్దు నుంచి జహీరాబాద్, హైదరాబాద్, సూర్యాపేట్ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. రాష్ట్రంలో దీని పొడవు 291.74 కి.మీ.
3. జాతీయ రహదారి నంబర్ - 63దీని పాత నంబర్ -16. ఇది నిజామాబాద్ నుంచి ఆర్మూర్, జగిత్యాల, లక్సెట్టిపేట, చెన్నూర్ మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. రాష్ట్రంలో దీని పొడవు 235.15 కి.మీ.
4. జాతీయ రహదారి నంబర్ - 167ఇది నూతన రహదారి. ఇది కర్ణాటక సరిహద్దు నుంచి జడ్చర్ల (మహబూబ్‌నగర్) మీదుగా ఎన్‌హెచ్-44ను కలుస్తుంది.
5. జాతీయ రహదారి నంబర్ - 163దీని పాత నంబర్-202. ఇది హైదరాబాద్ నుంచి జనగాం, వరంగల్, వెంకటాపురం మీదుగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తెలంగాణలో దీని పొడవు 306 కి.మీ.
6. జాతీయ రహదారి నంబర్ - 30దీని పాత నంబర్- 221. ఇది ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నుంచి పెనుబలి, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశిస్తుంది. రాష్ట్రంలో దీని పొడవు 100 కి.మీ.
7. జాతీయ రహదారి నంబర్ - 61దీని పాత నంబర్ - 222. ఇది రాష్ట్రంలో మహారాష్ట్ర సరిహద్దు నుంచి నర్సాపూర్ మీదుగా నిర్మల్ వరకు ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దీని పొడవు 53.6 కి.మీ.
8. జాతీయ రహదారి నంబర్ - 161ఇది నూతన జాతీయ రహదారి. ఇది సంగారెడ్డి మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. రాష్ట్రంలో దీని పొడవు 140.5 కి.మీ.
9. జాతీయ రహదారి నంబర్ - 363ఇది నూతన జాతీయ రహదారి. ఇది మహారాష్ట్ర సరిహద్దు నుంచి మహాదేవ్‌పూర్, పరకాల, ఆత్మకూరు ద్వారా ఎన్‌హెచ్-163తో కలుస్తుంది.
10. జాతీయ రహదారి నంబర్ -365ఇది నూతన జాతీయ రహదారి. ఇది నకిరేకల్ నుంచి తుంగతుర్తి, మహబూబాబాద్, నర్సంపేట మీదుగా మల్లంపల్లి వద్ద ఎన్‌హెచ్-163తో కలుస్తుంది.
11. జాతీయ రహదారి నంబర్ - 565ఇది కూడా నూతన జాతీయ రహదారి. ఇది నకిరేకల్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది.
- 363, 365, 565 నంబర్ జాతీయ రహదార్ల మొత్తం ఉమ్మడి పొడవు 330 కి.మీ.
12. జాతీయ రహదారి నంబర్ - 563ఇది నూతన జాతీయ రహదారి. ఎన్‌హెచ్-63పై ఉన్న మంచిర్యాల మీదుగా కరీంనగర్- వరంగల్ ద్వారా ఎన్‌హెచ్-163తో కలుస్తుంది. రాష్ట్రంలో దీని పొడవు 136 కి.మీ.
13. జాతీయ రహదారి నంబర్ - 365ఎఇది కూడా నూతన జాతీయ రహదారి. ఇది ఎన్‌హెచ్-65పై ఉన్న కోదాడ మీదుగా ఖమ్మం- మహబూబాబాద్ ద్వారా ఎన్‌హెచ్ -365తో కలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో దీని పొడవు 75 కి.మీ.
14. జాతీయ రహదారి నంబర్ - 765ఇది నూతన జాతీయ రహదారి. హైదరాబాద్ నుంచి అమన్‌గల్, వెల్దండ, కల్వకుర్తి, వంగూర్, అచ్చంపేట మీదుగా ఆంద్రప్రదేశ్‌లో ప్రవేశిస్తుంది. రాష్ట్రంలో దీని పొడవు 196 కి.మీ.
  • నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్రంలో 768 కి.మీ. పొడవైన జాతీయ రహదారులను ‘నేషనల్ హైవేస్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు’ కింద నాలుగు లైన్ల రహదారులుగా అభివృద్ధి చేస్తోంది.

రాష్ట్ర రహదారులురాష్ట్ర రహదారులు ప్రధానంగా జిల్లాల ప్రధాన కేంద్రాలను రాష్ట్ర రాజధానితో అనుసంధానం చేస్తాయి. రాష్ట్ర రహదారులు తెలంగాణలో 3,152 కి.మీ. వరకు విస్తరించి ఉన్నాయి.
  • రాష్ట్ర రహదారులు కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి.

జిల్లా రహదారులుతాలూకా కేంద్రాలతో; జిల్లా కేంద్రాలతో; ప్రధాన ఉత్పత్తి ప్రాంతాలు, మార్కెట్ కేంద్రాలను రాష్ట్రీయ రహదారులతో; రైల్వేస్టేషన్‌లతో కలిపే రహదారులను ‘జిల్లా రహదారులు’ అంటారు.
  • రాష్ట్రంలో జిల్లా రహదారులు 12,079 కి.మీ. మేర విస్తరించి ఉన్నాయి.

పంచాయతీరాజ్ రహదారులుపంచాయతీరాజ్ రహదారుల నిర్మాణం, నిర్వహణను రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పర్యవేక్షిస్తుంది. ఈ శాఖ గ్రామీణ ప్రాంత రోడ్లు, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, బిల్డింగ్‌లు, కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తుంది. 2014 ఏప్రిల్ 1 నాటికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 64,046 కి.మీ. పొడవైన పంచాయతీ రాజ్ రహదారులు ఉన్నాయి.
పంచాయతీ రాజ్ రోడ్లకు సంబంధించిన వివిధ రకాల రోడ్లు
  • సి.సి., బి.టి. రోడ్ల పొడవు 20,282 కి.మీ.
  • కంకర రోడ్ల పొడవు 14,734 కి.మీ.
  • డబ్ల్యూబీఎం రోడ్ల పొడవు 14,146 కి.మీ.
  • మట్టి రోడ్ల పొడవు 14,884 కి.మీ.

ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ఇది హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉంది. ఈ రింగ్ రోడ్డు పొడవు 158 కి.మీ. దీన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిర్మించింది. ఈ రింగ్ రోడ్డుకు మరో పేరు ‘నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు’.
  • పంచాయతీ రాజ్ రోడ్లు అధికంగా ఉన్న జిల్లా - మహబూబ్ నగర్
  • పంచాయతీ రాజ్ రోడ్లు అత్యల్పంగా ఉన్న జిల్లా రంగారెడ్డి (హైదరాబాద్ కాకుండా).
  • అన్ని రకాల రోడ్లను కలిపి చూసినప్పుడు.. మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్ల విస్తీర్ణం అధికంగా, హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా ఉన్నాయి.
  • హైదరాబాద్ - కర్నూలు, హైదరాబాద్ - మచిలీపట్నం రహదారులను నిజాం కాలంలోనే నిర్మించారు.
  • 1936 నాటికే తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బస్ డిపోలను ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాలకు బస్సులు నడిపారు.
  • తెలంగాణ రాష్ట్రం మీదుగా 14 జాతీయ రహదార్లు వెళుతున్నాయి.
  • రాష్ట్రంలోని అన్ని రకాల రోడ్ల మొత్తం పొడవు 26,837 కి.మీ.
  • తెలంగాణలో అతి పొడవైన జాతీయ రహదారి ఎన్‌హెచ్-44.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)పయాణికులను రైల్వేస్టేషన్‌కు చేర్చే ఉద్దేశంతో నిజాం రైల్వేశాఖ 1932లో 166 మంది సిబ్బందితో 27 బస్సులను నడపడం ప్రారంభించింది. హైదరాబాద్ రాష్ర్టం ఏర్పడిన తర్వాత 1951లో రాష్ర్ట ప్రభుత్వం ఈ బస్సుల నిర్వహణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత 1958లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) ఏర్పాటైంది. చివరగా తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావంతో 2014లో తెలంగాణ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)ని నెలకొల్పారు.

  • టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో రాష్ర్టవ్యాప్తంగా 3 జోన్లు, 11 రీజియన్లు, 95 డిపోలు ఉన్నాయి.
  • 2014 మార్చి 31 నాటికి తెలంగాణలో నడుస్తున్న మొత్తం బస్సుల సంఖ్య 10,342.
  • రాష్ర్టంలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య - దాదాపు 58 వేలు.
  • ఇంధన సామర్థ్యం-5.18 కి.మీ./లీ. (2013-14లో)
  • టీఎస్‌ఆర్టీసీ ద్వారా రోజూ ప్రయాణించే వారి సంఖ్య - 83.15 లక్షలు.
  • అన్ని బస్సులు కలిపి ప్రతి రోజు ప్రయాణించే దూరం- 34.17 లక్షల కిలోమీటర్లు.
  • రోజుకి సగటు వాహన ఉత్పాదకత- 331 కిలోమీటర్లు.

మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ఎంజీబీఎస్)
  • ఎంజీబీస్ పాత పేరు - ఇమ్లీబన్ (చింతచెట్ల అడవి).
  • ఇది హైదరాబాద్‌లోని గౌలీగూడలో ఉంది.
  • నిజాం రాజు కాలంలో ఈ బస్‌స్టేషన్‌ను మూసీనది ఒడ్డున నిర్మించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాలంలో నూతనంగా నిర్మించారు.
  • ఇందులోని ప్లాట్‌ఫాంల సంఖ్య - 110.
  • ఇది సుమారు 30 ఎకరాల్లో విస్తరించి ఉంది.
  • తెలంగాణ రాష్ర్టంలో ఇది అతిపెద్ద బస్‌స్టేషన్.
  • ఆసియా ఖండంలోనే మూడో అతిపెద్ద బస్‌స్టేషన్.
  • చెన్నై, ఢిల్లీలోని బస్‌స్టేషన్లు ఆసియాలోనే అతిపెద్ద బస్‌స్టేషన్లలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

కరీంనగర్ బస్‌స్టేషన్
  • ఇది ఆసియా ఖండంలో అతిపెద్ద బస్‌స్టేషన్లలో ఒకటి. తెలంగాణ రాష్ర్టంలో రెండో స్థానంలో ఉంది.
  • కరీంనగర్ బస్‌స్టేషన్‌కు మరో పేరు బి.ఆర్. అంబేద్కర్ బస్‌స్టేషన్.
  • 1976 నవంబర్ 11న దీన్ని ప్రారంభించారు. మొత్తం ప్లాట్‌ఫాంల సంఖ్య - 54.

రాష్ర్టంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)లో అభివృద్ధి చెందుతున్న రోడ్లు
  1. హైదరాబాద్-కరీంనగర్-రామగుండం(హెచ్‌కేఆర్)రోడ్డు: హైదరాబాద్-కరీంనగర్ - రామగుండం (హెచ్‌కేఆర్)లను కలిపే ఈ రాష్ర్ట రహదారి పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చెందుతోంది. దీని పొడవు- 206.85 కిలోమీటర్లు.
  2. నార్కెట్‌పల్లి-అద్దంకి-మేదరమెట్ల(ఎన్‌ఏఎమ్) రోడ్డు: తెలంగాణ రాష్ర్టంలో ఈ రోడ్డు నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి నుంచి వాడపల్లి (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు) వరకు ఉంది. దీని పొడవు- 212.5 కి.మీ.
  3. ఖమ్మం-తల్లాడ-దేవరపల్లి (ఎస్‌హెచ్-7): ఖమ్మం నుంచి దేవరపల్లి (పశ్చిమగోదావరి జిల్లాలో) వరకు దీన్ని నిర్మిస్తున్నారు. 227 కి.మీ.ల పొడవున్న ఈ రోడ్డును తెలంగాణలో ఖమ్మం-తల్లాడ మధ్య పబ్లిక్ - ప్రైవేట్ భాగస్వామ్యంలో అభివృద్ధి చేస్తున్నారు.
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించు-నిర్వహించు-బదలాయించు (బీవోటీ) పద్ధతిలో ప్రతిపాదించిన రోడ్లు:1) సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-భువనగిరి-చిట్యాల్ రోడ్డు-164 కి.మీ.
2) మహబూబ్‌నగర్-నల్లగొండ రోడ్డు-163.20 కి.మీ.
3) హైదరాబాద్-నర్సాపూర్- 28 కి.మీ.
4) జనగామ-చేర్యాల-దుద్దెడ- 46.40 కి.మీ.
5) జనగామ-సూర్యాపేట రోడ్డు- 84.40 కి.మీ.
6) సూర్యాపేట-మోతె-ఖమ్మం రోడ్డు-58.30 కి.మీ.
7) హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు- 36.40కి.మీ.

జాతీయ రహదారులను వెడల్పు చేయడం, వాటి ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) 1998లో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎన్‌హెచ్‌డీపీ)ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలో దశలవారీగా జాతీయ రహదారుల అభివృద్ధి జరిగింది. అవి:
ఫేజ్-3:ఫేజ్-3లో భాగంగా మనదేశంలో 12,109 కి.మీ. పొడవున జాతీయ రహదారుల ప్రమాణాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. తెలంగాణలో 220 కి.మీ. పొడవున జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. వాటి వివరాలు:
1) ఎన్‌హెచ్-9: హైదరాబాద్ నుంచి కోదాడ (నల్లగొండ) దాటిన తరువాత ఏపీ సరిహద్దు వరకు 190 కి.మీ.ల పొడవున అభివృద్ధి చేస్తున్నారు. దీని కొత్త నంబర్-65.
2) ఎన్‌హెచ్-202: దీని కొత్త నంబర్-163.
హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ సరిహద్దులను కలిపే 306 కి.మీ. పొడవున్న జాతీయ రహదారి ఇది. ఇందులో భాగంగా తెలంగాణలో 30 కి.మీ. పొడవున్న జాతీయ రహదారి (హైదరాబాద్- యాదగిరిగుట్ట రోడ్డు)ని అభివృద్ధి చేస్తున్నారు.
ఫేజ్-4: ఈ దశలో భాగంగా 473 కి.మీ.ల పొడవున రెండులేన్ల జాతీయ రహదారులను రాష్ర్టంలో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకుగానూ రూ. 1,732 కోట్లు వెచ్చించనున్నారు.

రైల్వే రవాణా
  • తెలంగాణ రాష్ర్టంలో నిజాం రైల్వే ఆధ్వర్యంలో మొదటగా రైళ్లు నడిచాయి. అప్పటి హైదరాబాద్ రాష్ర్టంలో నిజాం నవాబు 1879లో నిజామ్స్ గ్యారెంటీడ్ రైల్వే పేరుతో నిజాం రైల్వే సంస్థ స్థాపించారు.
  • హైదరాబాద్ రాష్ర్టం ఏర్పడటంతో 1950లో నిజాం రైల్వేను జాతీయం చేశారు. ఇది 1951లో భారత రైల్వేలో విలీనమయింది.
  • తెలంగాణ ప్రాంతంలో మొదటి రైల్వే లైన్‌ను సికింద్రాబాద్-వాడీ (మహారాష్ర్ట) మధ్య నిర్మించారు.
  • దీని పొడవు 177 మైళ్లు. ఇది 1864లో ప్రారంభమై 1874లో పూర్తయింది.
  • ఉమ్మడి ఆంధ్రప్రధేశ్‌లో విద్యుదీకరణ చేసిన మొదటి రైల్వేట్రాక్-మధిర (ఖమ్మం)-విజయవాడ.
  • మనదేశంలో మొత్తం రైల్వే జోన్లు-17.
  • తెలంగాణలో ఉన్న ఏకైక రైల్వేజోన్-దక్షిణ మధ్య రైల్వే. దీన్ని 1966 అక్టోబర్ 2న దేశంలో తొమ్మిదో జోన్‌గా ఏర్పాటు చేశారు.
  • ఈ జోన్ ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్‌లో ఉంది.
  • ఈ జోన్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, గుంతకల్లు, నాందేడ్ అనే 6 డివిజన్లు ఉన్నాయి. తెలంగాణలో 2, ఆంధ్రప్రదేశ్ 3, మహారాష్ర్టలో 1 డివిజన్ ఉన్నాయి.
  • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను 1874లో నిర్మించారు. ఇందులో ప్లాట్‌ఫాంల సంఖ్య-10.
  • ఈ స్టేషన్‌ను పూర్తిగా విద్యుదీకరణ చేసిన సంవత్సరం-1993.
  • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ద్వారా ప్రతిరోజు సుమారు 228 రైల్వేస్టేషన్ల నుంచి దాదాపు 1.2 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
  • కాచిగూడ రైల్వేస్టేషన్‌ను 1916లో ప్రారంభించారు.
  • 2014 మార్చి 31 నాటికి తెలంగాణ రాష్ర్టంలో 228 రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
  • తెలంగాణలో మొత్తం రైల్వేలైను పొడవు 1753 కి.మీ.(బ్రాడ్‌గేజ్).
  • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించడానికి మరో నూతన స్టేషన్ నిర్మాణానికి సన్నాహలు జరుగుతున్నాయి. మల్కాజ్‌గిరి లేదా మౌలాలి రైల్వేస్టేషన్‌లను నూతన స్టేషన్‌గా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు ఉన్నాయి.
  • సికింద్రాబాద్‌లోని ప్రధాన కేంద్ర భవనం సంచాలన్ భవన్‌ను 1980 నవంబర్ 10న ప్రారంభించారు.

మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్)జంట నగరాల్లో (హైదరాబాద్, సికింద్రాబాద్) ట్రాఫిక్ సమస్యల్ని అధిగమించి, రైలు మార్గాలను సమర్థంగా వినియోగించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఎంఎంటీఎస్‌ను ప్రారంభించారు. దీని మొదటి దశను రూ. 178 కోట్లతో సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య 2003 ఆగస్టు 9న అప్పటి ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ ప్రారంభించారు. 
ఇది దక్షిణ మధ్య రైల్వే, తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి సంస్థ.ఎంఎంటీఎస్ రైల్వే లైను పొడవు 43 కి.మీ. దీని పరిధిలో 27 స్టేషన్లు ఉన్నాయి.
ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి.
1) లింగంపల్లి-బేగంపేట-హైదరాబాద్ (నాంపల్లి)
2) లింగంపల్లి-బేగంపేట-సికింద్రాబాద్- కాచిగూడ-ఫలక్‌నుమ.
రెండో దశ:121 కి.మీ. పొడవు ఉన్న రెండో దశ ఎంఎంటీఎస్ రూ. 632 కోట్ల బడ్జెట్ నిధులతో 2012 మార్చి 1న ఆమోదం పొందింది.
ఈ దశలో భాగంగా మేడ్చల్ నుంచి నల్లగొండ జిల్లా భువనగిరి వరకు రైళ్లు నడపాలని నిర్ణయించారు.

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు (హెచ్‌ఎంఆర్‌పీ)నగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించడానికి 2008లో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును ఆమోదించింది. తొలిదశ నిర్మాణ పనులు 2013లో ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు ను తెలంగాణ ప్రభుత్వం, ఎల్ అండ్ టీ కలిసి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టాయి.
మనదేశంలో మెట్రో రైల్వే రవాణాలో చేసిన కృషికి గాను ఇండియన్ ఇంజనీరింగ్సర్వీసెస్ (ఐఈఎస్) రిటైర్డ్ అధికారి శ్రీధరన్‌ను ‘మెట్రోమ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తున్నారు.

ఫేజ్-1 (తొలిదశ)కు సంబంధించిన ముఖ్య వివరాలు:
  • ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) లో నిర్మితమవుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా రవాణా ప్రాజెక్టు ఇది.
  • ఈ ప్రాజెక్టుకు 2012 ఏప్రిల్ 26న శంకుస్థాపన చేశారు.
  • దీని పొడవు 72 కిలోమీటర్లు.
  • హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు చైర్మన్ ఎన్.వి.ఎస్. రెడ్డి.
  • సగటున ఒక కిలోమీటరుకు ఒకటి చొప్పున 63 ప్రదేశాల్లో 3 ఇంటర్ చేంజ్ స్టేషన్లతో కలిపి మొత్తం 66 స్టేషన్లు నిర్మిస్తున్నారు.
  • ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 14,132 కోట్లు.
దీనిని 3 కారిడార్లుగా నిర్మిస్తున్నారు. అవి:
కారిడార్ 1: మియాపూర్-ఎల్.బి.నగర్ (29 కి.మీ., 27 స్టేషన్‌లు)
కారిడార్ 2: జూబ్లీ బస్‌స్టేషన్-ఫలక్‌నుమ (15 కి.మీ., 16 స్టేషన్‌లు)
కారిడార్ 3: నాగోలు-శిల్పారామం (28 కి.మీ., 28 స్టేషన్‌లు)
  • అధిక భద్రతా ప్రమాణాల కల్పనకు స్టేట్ ఆఫ్ ఆర్డ్ సిగ్నలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.
  • భారతదేశంలో మొదటిసారిగా సీబీటీసీ (కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ప్రాజెక్టులో ప్రవేశపెట్టారు.
  • కోచ్‌లలో వీడియో కెమెరాలు, స్టేషన్‌ల్లో సీసీ టీవీలు అమర్చుతున్నారు.
  • హెచ్.ఎమ్.ఆర్. గరిష్ట వేగం గంటకు 80 కి.మీ., సగటు వేగం గంటకు 34 కి.మీ.
  • అత్యవసర పరిస్థితుల్లో 2 నుంచి 5 నిమిషాలకు ఒక రైలు ప్రయాణిస్తుంది.
  • సామాన్యులకు అందుబాటులో చార్జీలు ఉంటాయి.

వాయు రవాణా
అత్యంత వేగంగా ప్రయాణించేందుకు, సరకులను త్వరితగతిన రవాణా చేసేందుకు వాయు రవాణా అనుకూలమైంది. భారతదేశంలో ఇండియన్ ఎయిర్ లైన్స్, ఎయిర్ ఇండియా అనే రెండు జాతీయ ఎయిర్‌వేస్ ఉండేవి. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టక ముందు వాయు రవాణాలో ఇవి ఏకఛత్రాధిపత్యం కలిగి ఉండేవి. ఆర్థిక సంస్కరణల తర్వాత అనేక ప్రైవేట్ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించాయి. 2011లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ను ఎయిరిండియాలో విలీనం చేశారు. దేశంలో వాయు రవాణాను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తోంది.

రాష్ట్రంలోని విమానాశ్రయాలురాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)రాష్ర్టంలో ఉన్న ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయమిది. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. 2005లో ఈ విమానాశ్రయ నిర్మాణ పనులు మొదలయ్యాయి. దీన్ని 2008 మార్చి 14న ప్రారంభించారు. 2008 మార్చి 23 నుంచి విధులను నిర్వహిస్తోంది.
  • ఈ విమానాశ్రయం ఎన్‌హెచ్-44కు పశ్చిమంగా, శ్రీశైలం రాష్ర్ట రహదారికి తూర్పువైపు ఉంది.
  • పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు.
    ఆర్‌జీఐఏలో వాటాలు..
    మొత్తం వ్యయం- 5,584 కోట్లు
    జీఎంఆర్ గ్రూప్- 63 శాతం
    తెలంగాణ ప్రభుత్వం- 13 శాతం
    కేంద్ర ప్రభుత్వం- 13 శాతం
    మలేషియా ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్ బెర్‌హాడ్- 11 శాతం
  • రాష్ర్ట ప్రభుత్వం తన వాటా కింద 5449 ఎకరాల భూమిని ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అప్పగించింది.
  • ఈ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతను జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది.
  • పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశంలో నిర్మించిన తొలి ఎయిర్‌పోర్ట్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. రెండోది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.
  • ఇది తెలంగాణలో మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్.
  • దేశంలో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఆరో విమానాశ్రయమిది.
  • 2013లో బ్రిటన్‌కు చెందిన ఎయిర్‌పోర్ట్ రివ్యూ కన్సల్టెన్సీ స్కైట్రాక్స్ ప్రకారం.. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలో ఏడో స్థానంలో నిలిచింది.
  • ఈ అంతర్జాతీయ విమానాశ్రయం స్పైస్‌జెట్, బ్లూడార్ట్ ఏవియేషన్, లుప్తాన్సా కార్గో లాంటి అంతర్జాతీయ విమానయాన సంస్థలకు హబ్‌గా ఉంది.
  • ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దాదాపు 16 అంతర్జాతీయ విమానయాన సంస్థలు, 11 దేశీయ విమాయాన సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
  • ఈ విమానాశ్రయం నుంచి అత్యధికంగా ఎయిర్ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలు.. మధ్య ఆసియా (62%), ఉత్తర అమెరికా (20%), ఐరోపా (10%).
  • ఈ విమానాశ్రయానికి ప్రయాణికులను వేగంగా చేరవేయడానికి మెహదీపట్నం నుంచి రాజేంద్రనగర్ వరకు 11.66 కి.మీ. పొడవైన పి.వి.నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించారు. ఇది దేశంలోనే రెండో అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ హైవే. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ఈ విమానాశ్రయాన్ని చేరుకోవచ్చు.
  • ఆర్‌జీఐఏకు ‘పుష్పక్’ పేరుతో ఆర్‌టీసీ ప్రత్యేకంగా బస్సులను నడుపుతోంది.
ఈ విమానాశ్రయానికి వచ్చిన అవార్డులు
  • థర్డ్ బెస్ట్ ఎయిర్ పోర్టు ఇన్ ది వరల్డ్- 2014 (ప్రయాణికుల రవాణా కేటగిరిలో)
  • బెస్ట్ ల్యాండ్ స్కేప్ అవార్డు (వరుసగా అయిదోసారి)
  • సెకండ్ బెస్ట్ ఎయిర్ పోర్టు ఇన్ ఇండియా - సెంట్రల్ ఆసియా- 2014
  • స్వార్డ్ ఆఫ్ హానర్ అవార్డు -బ్రిటిష్ కౌన్సిల్. భద్రత విషయంలో ఈ అవార్డును ఆస్కార్‌లా భావిస్తారు.
  • వరల్డ్ సెకండ్ బెస్ట్ ఎయిర్‌పోర్టు - 2013
  • రాష్ర్టంలో పర్యాటక రంగం కార్యకలాపాలను ప్రోత్సహించడం కోసం ఆర్‌జీఐఏలో తెలంగాణ పర్యాటక రంగ కౌంటర్‌ను ప్రారంభించారు.
రాష్ర్టంలో మూతబడిన ఎయిర్‌పోర్ట్‌లు
  • వరంగల్ ఎయిర్‌పోర్ట్
  • బేగంపేట ఎయిర్‌పోర్ట్
  • ఆదిలాబాద్ ఎయిరో డ్రమ్
  • రామగుండం ఎయిర్ పోర్ట్. 1995లో ఈ ఎయిర్‌పోర్ట్ ను ఆదిత్యా బిర్లా నిర్మించారు.
వరంగల్ ఎయిర్‌పోర్టు: దీన్ని వరంగల్ జిల్లా మామ్‌నూర్‌లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1930లో నిర్మించాడు. ఆ సమయంలో ఇది దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ కావడం విశేషం.
  • అప్పటి విస్తీర్ణం - 1875 ఎకరాలు
  • రన్‌వే పొడవు - 6.6 కి.మీ.
  • దీన్ని నిజాం వ్యాపార అవసరాల కోసం.. ప్రధానంగా సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ ఇండస్ట్రీ, వరంగల్ జిల్లాలోని అజాంజాహీ మిల్స్ కోసం నిర్మించారు.
  • చైనాతో యుద్ధం సమయంలో ఈ ఎయిర్‌పోర్టులోనే విమానాలను నిలిపి ఉంచారు.
  • 1981 వరకు ఈ ఎయిర్‌పోర్ట్ పనిచేసింది.
  • దీని ప్రస్తుత విస్తీర్ణం 775 ఎకరాలు.
  • ఈ ఎయిర్‌పోర్ట్ ను మళ్లీ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అభివృద్ధి చేయనున్న ఎయిర్‌పోర్ట్‌లు
  • వరంగల్ ఎయిర్‌పోర్ట్
  • నిజామాబాద్ ఎయిర్‌పోర్ట్ (జాక్రాన్ పల్లి)
  • రామగుండం ఎయిర్‌పోర్ట్
నిర్మించ తలపెట్టిన ఎయిర్‌పోర్ట్‌లు
  • కరీంనగర్, కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ లు
రాష్ర్టంలోని వైమానిక కేంద్రాలు
  • దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ
  • హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్

రవాణా సౌకర్యాలు

అడవులు మానవాభివృద్ధితోపాటు దేశ, రాష్ర్ట ఆర్థికాభివృద్ధికీ తోడ్పడతాయి. అడవుల వల్ల వాతావరణ కాలుష్య నియంత్రణతో పాటు సకాలంలో వర్షాలు కురిసి ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాకుండా వన్యప్రాణులను సంరక్షిస్తాయి. అటవీ ఉత్పత్తులు, ఆక్సిజన్, మృత్తిక పోషకాలను కూడా అడవులు అందిస్తున్నాయి.
2015 ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణలో అడవులు 29,242 చ.కి.మీ. వైశాల్యంలో విస్తరించి ఉన్నాయి. ఇవి రాష్ర్టం మొత్తం వైశాల్యంలో 25.46 శాతం. కానీ తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తర్వాత ఖమ్మం జిల్లాలోని 327 ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం వల్ల రాష్ర్ట అడవుల విస్తీర్ణం 26,903.70 చ.కి.మీ.కు తగ్గింది. ఇది రాష్ర్ట వైశాల్యంలో 23.99 శాతం.తెలంగాణ.. అడవుల విస్తీర్ణంలో దేశంలో పన్నెండో స్థానంలో ఉంది.
గమనిక: మన జాతీయ అటవీ విధానం (1952), పర్యావరణ సమతుల్యత దృష్ట్యా ఒక ప్రాంత వైశాల్యంలో 33 శాతం అడవులను కలిగి ఉండాలి.
  • తెలంగాణలో అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లాలు వరుసగా.. 1. ఆదిలాబాద్, 2. ఖమ్మం
  • రాష్ర్టంలో అడవుల విస్తీర్ణం తక్కువగా ఉన్న జిల్లాలు 1. రంగారెడ్డి 2. నల్లగొండ.
  • రాష్ర్టంలో జిల్లా భౌగోళిక విస్తీర్ణం పరంగా అడవుల శాతం ఎక్కువగా ఉన్న జిల్లాలు 1. ఖమ్మం, 2. ఆదిలాబాద్
  • జిల్లా భౌగోళిక విస్తీర్ణం పరంగా అడవులు అత్యల్పంగా ఉన్న జిల్లాలు 1. నల్లగొండ 2. మెదక్.
పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ర్టంలోని అడవులను మూడు రకాలుగా విభజించారు. అవి..
1) రిజర్వేడ్ అడవులు: ఇవి రాష్ర్టంలో 18,294.52 చ.కి.మీ. విస్తీర్ణంతో మొత్తం అడవుల వైశాల్యంలో 68 శాతం వరకు విస్తరించి ఉన్నాయి.
2) రక్షిత అడవులు: ఇవి 7,802.07 చ.కి.మీ. విస్తీర్ణంతో రాష్ర్టం మొత్తం అడవుల వైశాల్యంలో 29 శాతం వరకు ఉన్నాయి.
3) విభజించిన అడవులు: ఇవి సుమారు 807.11 చ.కి.మీ.లలో మొత్తం అటవీ విస్తీర్ణంలో 3 శాతం ఉన్నాయి.
  • తెలంగాణ రాష్ర్ట వృక్షం - జమ్మిచెట్టు.
  • తెలంగాణ రాష్ర్ట పుష్పం - తంగేడు.
తెలంగాణ రాష్ర్ట అడవులు - రకాలు
సాధారణంగా అడవుల పెరుగుదల ఒక ప్రాంత వర్షపాతం, ఉష్ణోగ్రత, ఎత్తు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో ఆర్థికంగా అతి ముఖ్యమైన అడవులు ఆకురాల్చే అడవులు. వీటితోపాటు రాష్ర్టంలో చిట్టడవులు ఉన్నాయి. కానీ రాష్ర్టంలో సతతహరిత, మడ, పర్వత తదితర అడవులు కనిపించవు.
ఉష్ణ మండల ఆకురాల్చే అడవులు: 
ఈ అడవులు తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. ఇవి తక్కువ వర్షం, అధిక వేడి ప్రాంతాలు, ఎక్కువగా పీఠభూమి ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇవి ముఖ్యంగా రెండు రకాలు..
  • ఉష్ణమండల ఆర్థ్ర (లేదా) తేమ ఆకురాల్చే అడవులు:   
ఈ అరణ్యాలు 100 నుంచి 200 సెం.మీ. వార్షిక వర్షపాతం గల ప్రాంతాలు, 27 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత గల ప్రాంతాలు, సముద్ర మట్టానికి సుమారు 300 నుంచి 500 మీటర్ల ఎత్తయిన ప్రాంతాలు, కొండల అంచులు తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ అడవులు తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లో ప్రధానంగా వేగి, ఏగిస, మద్ది, సాల్, వెదురు, బండారు, జిట్టేగి, తంగేడు, విప్ప మొదలైన చెట్లు కనిపిస్తాయి.
  • ఉష్ణమండల శుష్క (లేదా) అనార్థ్ర ఆకురాల్చే అడవులు: 
ఈ అరణ్యాలు 70 - 100 సెం.మీ. వార్షిక వర్షపాతం గల ప్రాంతాల్లో సరాసరి 23 నుంచి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో సముద్రమట్టానికి 150 నుంచి 300 మీటర్ల ఎత్తుగల ప్రాంతాల్లో విస్తరించి ఉంటాయి. ఈ అరణ్యాల్లో ప్రధానంగా టేకు, వేప, వెదురు, వెలగ, తునికి, చిగురు బిల్లా, మోదుగ, మద్ది, బూరుగ వంటి వృక్షాలు పెరుగుతాయి. ఈ అడవులు ప్రధానంగా రంగారెడ్డి, మెదక్, వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
చిట్టడవులు లేదా ఉష్ణమండల పొదలు: 
ఈ అరణ్యాలు 75 సెం.మీ. కంటే తక్కువ వార్షిక వర్షపాతం గల ప్రాంతాలు, అధిక ఉష్ణోగ్రత ఉండే పొడి ప్రాంతాల్లో పెరుగుతాయి. ఈ అడవులు దట్టంగా ఉండవు. ఈ అడవుల్లో పెరిగే వృక్షాలు తుమ్మ, రేగుచెట్లు, బలుసు, మర్రి, బ్రహ్మజెముడు, నాగజెముడు లాంటివి పెరుగుతాయి. ఈ అడవులు ప్రధానంగా నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉన్నాయి.

ప్రధాన అటవీ ఉత్పత్తులు
వెదురు: ఇది తక్కువ కాలంలో అత్యంత వేగంగా పెరిగే మొక్క. దీన్ని గృహనిర్మాణం, గృహాలంకరణ వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు. దీన్ని పేపర్ తయారీకి వాడతారు. వెదురు కర్ర నుంచి పోలీసుల లాఠీ తయారు చేస్తారు. దీన్ని ‘పేదవాడి కలప’ అని అంటారు. ఇది ఖమ్మం జిల్లాలో అత్యధికంగా విస్తరించి ఉండగా, ఉత్పత్తి మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ.
టేకు: దీన్ని ‘ప్రాక్ దేశపు రాజ్యవృక్షం’ అంటారు. ఇది అత్యంత మన్నికైన కలపను ఇస్తుంది. ఇది ఎక్కువగా గోదావరి పరీవాహక జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో విస్తరించి ఉంది.
సరివి (కాజురైనా): తెలంగాణలోని అన్ని జిల్లాల్లో చవిటి నేలల ప్రాంతంలో కనిపిస్తాయి. ఇది ఎడారి లక్షణం ఉన్న చెట్టు. దీన్ని టెంట్ కర్రలకు, ఇళ్ల నిర్మాణంలో సపోర్టుకు వాడతారు.
ఇండియన్ రోజ్‌వుడ్ (డాల్ బర్జియా): ఇది ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిపిస్తుంది. దీన్ని రైల్వే వాగన్లు, బోగీల తయారీలో ఉపయోగిస్తారు.
ఉసిరి: ఇది ఎడారి లక్షణం గల చెట్టు. ఇది అన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. ఇది ‘సి’ విటమిన్‌కు ప్రధాన వనరు.
పుణికి చెట్టు: ఇది ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. దీన్ని ‘నిర్మల్ కొయ్యబొమ్మల’ తయారీకి ఉపయోగిస్తారు.
రూసా గడ్డి: ఇది నిజామాబాద్ జిల్లాలోని అడవుల్లో పెరుగుతుంది. దీన్ని సెంట్‌ల తయారీలో ఉపయోగిస్తారు.
తుంగ గడ్డి: ఇది మహబూబ్‌నగర్ జిల్లాలో లభిస్తుంది. దీన్ని ‘తుంగచాపల’ తయారీలో ఉపయోగిస్తారు.
బీడి ఆకులు: వీటిని బీడిల తయారీకి ఉపయోగిస్తారు. ఈ ఆకులను తునికాకు, తెండు ఆకులు అని పిలుస్తారు. ఇవి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో లభిస్తాయి.
విప్ప పువ్వు: దీన్ని సారా తయారీకి ఉపయోగిస్తారు. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని అడవుల్లో లభిస్తాయి
తెలంగాణ రాష్ర్టంలోని అటవీ సంబంధిత సంస్థలు
  • తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ - దూలపల్లి (రంగారెడ్డి)
  • అటవీ క్షేత్ర పరిశోధన కేంద్రం - దూలపల్లి (రంగారెడ్డి)
  • ఫారెస్ట్ రీసెర్చ్ డివిజన్ - హైదరాబాద్, వరంగల్
  • స్టేట్ ఫారెస్ట్ రీసెర్‌‌చ అండ్ డెవలప్‌మెంట్ - హైదరాబాద్ సర్కిల్
  • ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రం - ములుగు (మెదక్)
సామాజిక అడవులు
 సామాజిక అడవుల్లో ముఖ్యంగా వంట చెరకు, పశుగ్రాసం, కలప సేకరించడానికి పెద్ద ఎత్తున పథకాలు అమల్లోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమాలు ఐదో పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రారంభమై 1980-82 సంవత్సరాల్లో భారీ ఎత్తున చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో వంట చెరకు మొక్కలను నాటారు.
 తెలంగాణ రాష్ర్ట అటవీశాఖ, ప్రజల భాగస్వామ్యంతో వన సంరక్షణ సమితులు, ఎకో డెవలప్‌మెంట్ కమిటీలు, నదీలోయ ప్రాంతాల్లో వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ కమిటీలు నిర్వహిస్తోంది. వీటిని ‘త్రి-టైర్ సిస్టమ్’లో ఉంటాయి. అవి..
 1. రాష్ర్ట స్థాయిలో - స్టేట్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎస్‌ఎఫ్‌డీఏ).
 2. డివిజన్ స్థాయిలో - ఫారెస్ట్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎఫ్‌డీఏ).
 3. గ్రామ స్థాయిలో - వన సంరక్షణ సమితి (వీఎస్‌ఎస్).

తెలంగాణ రాష్ర్ట అడవులు

భారతదేశంలో అనాదిగా అనేక ప్రాంతాల నుంచి అనేకజాతులకు చెందినవారు వచ్చి స్థిరపడ్డారు. కాలక్రమంలో ఈ జాతులన్నీ పరస్పరం కలిసిపోయి ఉపజాతులు, కులాలు, ఉపకులాలు ఏర్పడ్డాయి. తెలంగాణలోనూ ఇదే రకమైన సామాజిక వర్గీకరణ గమనించవచ్చు. భౌగోళికంగా తెలంగాణ దక్షిణ భారతదేశంలో ఉంది. అందువల్ల ఇక్కడ ‘ద్రవిడియన్’ జాతి ప్రబలంగా కనిపిస్తుంది. వీరినే ‘మెడిటరేనియన్లు’ అని కూడా అంటారు.
తెలంగాణలో నివసించే ప్రజలు ప్రధానంగా ‘ద్రవిడ’ జాతికి చెందినవారు. వీరినే ‘ద్రవిడియన్లు’ అంటారు. వీరిది ద్రవిడ భాష. ద్రవిడ భాషలు ప్రధానంగా నాలుగు. అవి:
1) తెలుగు
2) కన్నడ
3) తమిళం
4) మలయాళం
ద్రవిడ భాషల్లో తెలుగు మాట్లాడే వారు ఎక్కువగా ఉన్నారు. తెలుగు భాషకు 2008లో ప్రాచీన హోదా కల్పించారు.

2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మతాల వారీగా జనాభా వివరాలు
  • తెలంగాణ రాష్ట్ర మొత్తం జనాభా 3,51,93,978 (ఖమ్మం జిల్లా పూర్తి జనాభాను కలుపుకొని).
  • రాష్ట్రంలో మొత్తం హిందువుల జనాభా 2,99,48,451.
  • రాష్ట్ర మొత్తం జనాభాలో హిందువుల వాటా 85.09 శాతం.
  • రాష్ట్రంలో హిందువులు అధికంగా ఉన్న జిల్లాలు.. 1) రంగారెడ్డి (44.59 లక్షలు), 2) మహబూబ్‌నగర్ (36.73 లక్షలు).
  • హిందువులు తక్కువగా ఉన్న జిల్లాలు.. 1) హైదరాబాద్ (20.46 లక్షలు), 2) నిజామాబాద్ (21.23 లక్షలు).
  • రాష్ట్రంలో మొత్తం ముస్లింల జనాభా 44,64,699.
  • రాష్ట్ర మొత్తం జనాభాలో ముస్లింల వాటా 12.69 శాతం.
  • ముస్లింలు అధికంగా ఉన్న జిల్లాలు.. 1) హైదరాబాద్ (17.13 లక్షలు), 2) రంగారెడ్డి (6.17 లక్షలు).
  • ముస్లిం జనాభా తక్కువగా ఉన్న జిల్లాలు.. 1) ఖమ్మం (1.59 లక్షలు), 2) నల్లగొండ (1.89 లక్షలు).
  • రాష్ట్రంలో మొత్తం క్రైస్తవుల జనాభా 4,47,124.
  • రాష్ట్ర మొత్తం జనాభాలో క్రైస్తవుల వాటా 1.27 శాతం.
  • రాష్ట్రంలో క్రైస్తవులు అధికంగా ఉన్న జిల్లాలు.. 1) రంగారెడ్డి (1.44 లక్షలు), 2) హైదరాబాద్ (0.87 లక్షలు).
  • క్రైస్తవులు తక్కువగా ఉన్న జిల్లాలు.. 1) ఆదిలాబాద్ (0.15 లక్షలు), 2) నిజామాబాద్ (0.19 లక్షలు).
  • రాష్ట్రంలో మొత్తం సిక్కుల జనాభా 30,340.
  • రాష్ట్ర మొత్తం జనాభాలో సిక్కుల వాటా 0.086 శాతం.
  • రాష్ట్రంలో సిక్కులు అధికంగా ఉన్న జిల్లాలు.. 1) హైదరాబాద్ (11,446), 2) రంగారెడ్డి (8,062).
  • సిక్కుల జనాభా తక్కువగా ఉన్న జిల్లాలు.. 1) ఖమ్మం (655 మంది), 2) మహబూబ్‌నగర్ (658 మంది)
  • తెలంగాణ రాష్ట్రంలో మొత్తం బౌద్ధుల జనాభా 32,553.
  • రాష్ట్ర మొత్తం జనాభాలో బౌద్ధుల వాటా 0.092 శాతం.
  • బౌద్ధులు అధికంగా ఉన్న జిల్లాలు.. 1) ఆదిలాబాద్ (25,510 మంది), 2) రంగారెడ్డి (2,041 మంది).
  • బౌద్ధులు అత్యల్పంగా ఉన్న జిల్లాలు.. 1) ఖమ్మం (217 మంది), 2) నల్లగొండ (241 మంది).
  • తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జైనుల జనాభా 26,690.
  • రాష్ట్ర మొత్తం జనాభాలో జైనుల వాటా 0.076 శాతం.
  • జైనులు అధికంగా ఉన్న జిల్లాలు.. 1) హైదరాబాద్ (19,560 మంది), 2) రంగారెడ్డి (3,536 మంది).
  • జైనులు తక్కువగా ఉన్న జిల్లాలు.. 1) నల్లగొండ (250 మంది), 2) కరీంనగర్ (312 మంది).

దేశ జనాభాతో పోలిస్తే మతాల వారీగా తెలంగాణ జనాభా వివరాలు
  • దేశంలోని మొత్తం హిందువుల జనాభాలో తెలంగాణ హిందువుల వాటా 3 శాతం.
  • దేశ ముస్లిం జనాభాలో రాష్ట్ర ముస్లింల వాటా 2.59 శాతం.
  • దేశ క్రైస్తవ జనాభాలో రాష్ట్ర క్రైస్తవుల వాటా 1.58 శాతం.
  • దేశంలోని మొత్తం సిక్కుల జనాభాలో రాష్ట్ర వాటా 0.14 శాతం.
  • దేశ బౌద్ధుల జనాభాలో తెలంగాణ బౌద్ధుల వాటా 0.38 శాతం.
  • దేశంలోని మొత్తం జైనుల జనాభాలో రాష్ట్ర జైనుల వాటా 0.59 శాతం.

తెలంగాణలో మతాల వారీగా జనాభా (2011 గణాంకాల ప్రకారం)
మతం
జనాభా
శాతం
హిందువులు
2,99,48,451
85.09
ముస్లింలు
44,64,699
12.69
క్రైస్తవులు
4,47,124
1.27
సిక్కులు
30,340
0.086
బౌద్ధులు
32,553
0.092
జైనులు
26,690
0.076

పట్టణీకరణపట్టణాల్లో జనాభా అధికమవడం, పట్టణాల సంఖ్య పెరిగిపోవడాన్నే ‘పట్టణీకరణ’గా పేర్కొనవచ్చు.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణం అంటే..
    1) 5000 లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగి ఉండాలి.
    2) కనీసం 75 శాతం మంది పురుషులు వ్యవసాయేతర రంగాల్లో పనిచేస్తూ ఉండాలి.
    3) జనసాంద్రత చ.కి.మీ. కనీసం 400గా ఉండాలి.
  • తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా 136.09 లక్షలు.
  • రాష్ట్ర మొత్తం జనాభాలో పట్టణ జనాభా వాటా 38.88 శాతం.
  • సంఖ్యా పరంగా, శాతం పరంగా పట్టణ జనాభా అధికంగా ఉన్న జిల్లా ‘హైదరాబాద్’.
  • సంఖ్యా పరంగా, శాతం పరంగా పట్టణ జనాభా తక్కువగా ఉన్న జిల్లా ‘మహబూబ్‌నగర్’.

తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే - 2014

తెలంగాణ ప్రభుత్వం 2014 ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 17 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని 1,01,93,027 కుటుంబాల వివరాలను సేకరించారు. వీటి ఆధారంగా తెలంగాణలో ప్రజల జీవన పరిస్థితి, సామాజిక, ఆర్థిక, స్థితిగతులకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. 
సర్వే ప్రకారం తెలంగాణ జనాభాలో దాదాపుగా సగం మంది వెనకబడిన వర్గాలవారు ఉన్నారు. సుమారు అయిదో వంతు కుటుంబాల్లో మహిళలే పెద్ద దిక్కుగా ఉన్నారు. 30 శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు లేవని వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం..
  • అత్యధిక కుటుంబాలున్న జిల్లా రంగారెడ్డి.
  • అత్యల్ప కుటుంబాలున్న జిల్లా నిజామాబాద్.
  • సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్స్ 3,85,892 మంది.
సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా సామాజిక వర్గాల వారీగా జనాభా వివరాలు
సామాజిక వర్గం
శాతం
అధికంగా ఉన్న జిల్లాలు
అల్పంగా ఉన్న జిల్లా
ఎస్సీ
17.50
రంగారెడ్డి, మహబూబ్‌నగర్
నిజామాబాద్
ఎస్టీ
9.91
ఖమ్మం, ఆదిలాబాద్
హైదరాబాద్
బీసీ
51.08
రంగారెడ్డి, మహబూబ్‌నగర్
ఖమ్మం
ఓసీ
21.50
రంగారెడ్డి
ఆదిలాబాద్
మైనార్టీ
14.46
హైదరాబాద్, రంగారెడ్డి
ఖమ్మం

రాష్ట్రంలోని ముఖ్యమైన గిరిజన తెగలుతెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా గోండులు, కోలమ్, పర్ధాన్, లంబాడా, చెంచు, కోయ తదితర గిరిజన తెగలకు చెందిన ప్రజలున్నారు. వీరు అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో అధికంగా నివసిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని నల్లమల అడవుల్లో చెంచులు నివసిస్తున్నారు.
తెగ
నివసించే ప్రదేశం
మాట్లాడే భాష
ఎరుక
తెలంగాణ మొత్తం
తెలుగు, ఎరుకల
కోలాము
ఆదిలాబాద్
కోలామ్, తెలుగు
గోండులు
ఆదిలాబాద్, కరీంనగర్
తెలుగు, గోండి
తోటీలు
ఆదిలాబాద్
తెలుగు, మరాఠీ
ప్రదానులు
ఆదిలాబాద్
తెలుగు, మరాఠీ, గోండి
నాయక్ (నాయక్ పోడ్)
ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం
తెలుగు
భిల్లులు
ఆదిలాబాద్, హైదరాబాద్, మహబూబ్‌నగర్
తెలుగు
చెంచులు
మహబూబ్‌నగర్
తెలుగు
కోయ
ఖమ్మం, వరంగల్
తెలుగు, కోయ
కొండరెడ్లు
ఖమ్మం
తెలుగు
ఆంధ్
ఆదిలాబాద్
తెలుగు, మరాఠీ

తెలంగాణ రాష్ట్ర జనాభా-2011భారతదేశంలో 1872 నుంచి 2011 వరకు మొత్తం 15 పర్యాయాలు జనగణన చేశారు. 2011లో 15వ సారి 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో జనగణన నిర్వహించారు. అప్పటికి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉంది. భారతదేశంలో తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత జనగణన ఒక్కసారి కూడా చేపట్టలేదు.
  1. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోపాలకృష్ణ పిళ్లై, జాతీయ జనాభా గణాంకాల రిజిస్ట్రార్ జనరల్ ‘చంద్రమౌళి’ 2011 జనాభా లెక్కల వివరాలను 2011 మార్చి 30న విడుదల చేశారు.
  2. ప్రపంచ జనాభాలో భారతీయులు 17.7 శాతం ఉన్నారు.
  3. జనాభా పరంగా భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా ఉంది. చైనా మొదటి స్థానంలో ఉంది.
  4. 2011 గణాంకాల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు.

2011 జనాభా గణాంకాల ప్రధానాంశాలు
  • 2011 జనాభా లెక్కల రిజిస్ట్రార్ జనరల్ - చంద్రమౌళి
  • 2011 జనాభా లెక్కల నినాదం ‘అవర్ సెన్సస్ - అవర్ ఫ్యూచర్’.
  • 2011 జనగణన స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏడోసారి నిర్వహించింది.
  • దేశంలో మొట్టమొదటిసారిగా జనాభా వివరాలను 1872లో లార్డ్ మేయో కాలంలో లెక్కించారు.
  • 1881 నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా గణాంకాలు సేకరిస్తున్నారు.

రాష్ట్ర జనాభా - 2011
  • 2011 గణాంకాల ప్రకారం భారతదేశ జనాభా 1,21,05,69,573.
  • తెలంగాణ రాష్ట్ర జనాభా 3,51,93,978. గమనిక: ప్రస్తుతం తెలంగాణ జనాభా 3,50,03,674. ఖమ్మం జిల్లాలో 327 గ్రామాలను (7 మండలాలు) ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. దీంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 1.90 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వచ్చారు. ఫలితంగా జనాభా సంబంధిత విషయాల్లో మార్పులు జరిగాయి.
  • రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా ఉన్న జిల్లాలు 1) రంగారెడ్డి, 2) మహబూబ్‌నగర్.
  • రాష్ట్రంలో అత్యల్ప జనాభా ఉన్న జిల్లాలు 1) నిజామాబాద్, 2) ఖమ్మం.

తెలంగాణ రాష్ట్ర జనాభా
సం.జనాభా (కోట్లలో)జన సాంద్రతలింగ నిష్పత్తి
19611.27111975
19711.58138961
19812.02176971
19912.61227967
20013.10270971
20113.51307988
ప్రస్తుతం3.50312

భాష ఆధారంగా జనాభా వివరాలు
  • రాష్ట్రంలో తెలుగు మాట్లాడేవారు 76 శాతం మంది ఉన్నారు.
  • తెలంగాణలో ఉర్దూ మాట్లాడేవారు 12 శాతం ఉన్నారు.
  • ఇతర భాషలు మాట్లాడేవారు 12 శాతం ఉన్నారు.
గమనిక: 1948కు ముందు హైదరాబాద్ ప్రాంతంలో అధికార భాష ‘ఉర్దూ’. 
జనాభా పరిమాణం: రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభాను ‘రాష్ట్ర జనాభా పరిమాణం’ అంటారు.
జనసాంద్రత: ఒక చదరపు కిలోమీటర్ వైశాల్యంలో నివసించే వారి సంఖ్యను లేదా జనాభాను ‘జనసాంద్రత’గా పేర్కొంటారు.
  • 2011 లెక్కల ప్రకారం రాష్ట్ర జనసాంద్రత 307 (ప్రస్తుతం 312).

గమనిక:
 ఖమ్మం జిల్లా జనసాంద్రత 175 నుంచి 197కు పెరిగింది.
లింగ నిష్పత్తి: ప్రతి వేయి మంది పురుషులకు ఉండే స్త్రీల సంఖ్యనే ‘లింగ నిష్పత్తి’ అంటారు.
  • 2011 లెక్కల ప్రకారం రాష్ట్ర లింగ నిష్పత్తి 988 (1000 : 988).
  • 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో స్త్రీ, పురుష నిష్పత్తి అధికంగా ఉన్న జిల్లాలు - 1) నిజామాబాద్ (1040), 2) ఖమ్మం, కరీంనగర్ (1008).
  • 2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో స్త్రీ, పురుష నిష్పత్తి తక్కువగా ఉన్న జిల్లాలు.. 1) హైదరాబాద్ (954), 2) రంగారెడ్డి (961).

గమనిక: 
దేశంలో స్త్రీ, పురుష నిష్పత్తి 943.
  • దేశంలో అధిక స్త్రీ, పురుష నిష్పత్తి ఉన్న రాష్ట్రం కేరళ (1084).
  • దేశంలో అత్యల్ప స్త్రీ, పురుష నిష్పత్తి ఉన్న రాష్ట్రం - హర్యానా (879).
  • తెలంగాణలో అత్యధిక జనసాంద్రత ఉన్న జిల్లాలు 1) హైదరాబాద్ (18,172), 2) రంగారెడ్డి (707).
  • రాష్ట్రంలో అత్యల్ప జనసాంద్రత ఉన్న జిల్లాలు 1) ఆదిలాబాద్ (170), 2) ఖమ్మం 175 (ప్రస్తుతం - 197).

గమనిక:
 భారతదేశ సగటు జనసాంద్రత 382.
  • దేశంలో అత్యధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రం బిహార్ (1106).
  • దేశంలో అత్యల్ప జనసాంద్రత ఉన్న రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్ (17).
  • దేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాలు 1) ఉత్తరప్రదేశ్, 2) మహారాష్ట్ర.
  • దేశంలో అత్యల్ప జనాభా ఉన్న రాష్ట్రాలు 1) సిక్కిం, 2) మిజోరాం.

జిల్లాల వారీగా జనసాంద్రత, లింగ నిష్పత్తి
జిల్లాలుజనసాంద్రతలింగ నిష్పత్తి
మహబూబ్‌నగర్220977
రంగారెడ్డి707961
హైదరాబాద్18,172954
మెదక్313992
నిజామాబాద్3211,040
ఆదిలాబాద్1701,001
కరీంనగర్3191,008
వరంగల్273997
ఖమ్మం1971,008
నల్లగొండ245983
మొత్తం312988
గమనిక: ఖమ్మం జిల్లాలోని ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడానికి ముందు తెలంగాణ జనసాంద్రత 307.

జనాభా వృద్ధిరేటుఒక నిర్దిష్ట ప్రదేశంలో నిర్దిష్ట కాలంలో పెరిగే జనాభాను ‘జనాభా వృద్ధి’ అంటారు. ఏడాది కాలంలో ప్రతి వంద మంది జనాభాకు అదనంగా ఎంత మంది చేరుతున్నారో తెలిపే రేటును ‘జనాభా వృద్ధిరేటు’గా పేర్కొంటారు.
  • రాష్ట్రంలో 2001-11 మధ్య కాలంలో జనాభా వృద్ధిరేటు 13.58 శాతం.
  • తెలంగాణలో 2001-11 దశాబ్ద కాలంలో అధిక జనాభా వృద్ధిరేటు ఉన్న జిల్లాలు.. 1) రంగారెడ్డి (48.16 శాతం), 2) మహబూబ్‌నగర్ (15.34 శాతం).
  • రాష్ట్రంలో 2001-11 దశాబ్ద కాలంలో అల్ప జనాభా వృద్ధిరేటు నమోదైన జిల్లాలు.. 1) హైదరాబాద్ (2.97 శాతం) 2) నల్లగొండ (7.41 శాతం).
గమనిక: 2001-11లో భారతదేశ జనాభా వృద్ధిరేటు 17.7 శాతం.
  • దేశంలో అధిక జనాభా వృద్ధిరేటు ఉన్న రాష్ట్రం మేఘాలయ (27.9 శాతం)
  • దేశంలో అల్ప జనాభా వృద్ధిరేటు ఉన్న రాష్ట్రం నాగాలాండ్ (-0.6 శాతం).
  • తెలంగాణలో పురుషుల జనాభా 1.77 కోట్లు. రాష్ట్ర మొత్తం జనాభాలో 50.2 శాతం పురుషులు ఉన్నారు.
  • రాష్ట్రంలో పురుషుల జనాభా అత్యధికంగా ఉన్న జిల్లాలు.. 1) రంగారెడ్డి (27.01 లక్షలు), 2) మహబూబ్‌నగర్ (20.50 లక్షలు).
  • రాష్ట్రంలో పురుషుల జనాభా తక్కువగా ఉన్న జిల్లాలు.. 1) నిజామాబాద్ (12.50 లక్షలు), 2) ఆదిలాబాద్ (13.69 లక్షలు).
  • రాష్ట్రంలో స్త్రీల జనాభా 1.74 కోట్లు. మొత్తం జనాభాలో 49.8 శాతం స్త్రీలు ఉన్నారు.
  • రాష్ట్రంలో అత్యధిక స్త్రీ జనాభా ఉన్న జిల్లాలు 1) రంగారెడ్డి (25.95 లక్షలు), 2) మహబూబ్‌నగర్ (20.03 లక్షలు).
  • రాష్ట్రంలో అత్యల్ప స్త్రీ జనాభా ఉన్న జిల్లాలు 1) నిజామాబాద్ (13.00 లక్షలు), 2) ఆదిలాబాద్ (13.71 లక్షలు).

తెలంగాణ జనాభా వృద్ధిరేటు
దశాబ్దంవృద్ధిరేటు (శాతాల్లో)
1961-7124.43
1971-8127.58
1981-9129.27
1991-200118.77
2001-201113.58

తెలంగాణలో జిల్లాల వారీగా జనాభా పరిమాణం
జిల్లాలుపురుషులుస్త్రీలుమొత్తం జనాభా
మహబూబ్‌నగర్20,50,38620,02,64240,53,028
రంగారెడ్డి27,01,00825,95,73352,96,741
హైదరాబాద్20,18,57519,24,74839,43,323
మెదక్15,23,03015,10,25830,33,288
నిజామాబాద్12,50,64113,00,69425,51,335
ఆదిలాబాద్13,69,59713,71,64227,41,239
కరీంనగర్18,80,80018,95,46937,76,269
వరంగల్17,59,28117,53,29535,12,576
ఖమ్మం12,98,54313,08,52326,07,066
నల్లగొండ17,59,77217,29,03734,88,809
మొత్తం3,50,03,6741,73,92,0413,50,03,674

అక్షరాస్యత రేటు
ఏదో ఒక భాషలో చదవడం, రాయడం తెలిసి ఉండటాన్ని ‘అక్షరాస్యత’ అంటారు. అక్షరాస్యత రేటు గణనలో ఏడేళ్ల పైబడిన వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అక్షరాస్యత రేటు విషయంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం 25వ స్థానంలో ఉంది.
అక్షరాస్యత రేటు = (మొత్తం అక్షరాస్యులు ÷ మొత్తం జనాభా) × 100

వివిధ జనగణనల ప్రకారం తెలంగాణ రాష్ర్ట అక్షరాస్యత రేటు
సం.స్త్రీల అక్షరాస్యత రేటు (%)పురుషుల అక్షరాస్యత రేటు (%)మొత్తం అక్షరాస్యత రేటు (%)
19618.5525.9117.34
198116.7935.9026.49
200149.9068.8058.00
201157.9274.9566.46
  • తెలంగాణ రాష్ట్ర సగటు అక్షరాస్యత రేటు 66.46 (ప్రస్తుతం 66.54) శాతం.
  • దేశ సగటు అక్షరాస్యత రేటు 73 శాతం.
  • రాష్ట్రంలో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 207.84 లక్షలు. (ప్రస్తుతం 206.96 లక్షలు). ఇందులో పురుషులు 117.49 లక్షల (ప్రస్తుతం 117 లక్షలు) మంది, స్త్రీలు 90.35 లక్షల (ప్రస్తుతం 89.95 లక్షలు) మంది ఉన్నారు.
  • రాష్ట్రంలో పురుషుల సగటు అక్షరాస్యత రేటు 74.95 (ప్రస్తుతం 75.04) శాతం. స్త్రీల సగటు అక్షరాస్యత రేటు 57.92 (ప్రస్తుతం 57.99) శాతం.
  • రాష్ట్రంలో అక్షరాస్యులు అధికంగా ఉన్న జిల్లా రంగారెడ్డి.
  • రాష్ట్రంలో అక్షరాస్యులు అతి తక్కువగా ఉన్న జిల్లా నిజామాబాద్.
  • తెలంగాణలో అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్ (83.25 శాతం).
  • రాష్ట్రంలో అక్షరాస్యత రేటు తక్కువగా ఉన్న జిల్లా మహబూబ్‌నగర్ (55 శాతం).
  • పురుషుల్లో అక్షరాస్యత అధికంగా ఉన్న జిల్లా రంగారెడ్డి, తక్కువగా ఉన్న జిల్లా నిజామాబాద్.
  • స్త్రీలలో అక్షరాస్యత అధికంగా ఉన్న జిల్లా రంగారెడ్డి కాగా, అతి తక్కువగా ఉన్న జిల్లా నిజామాబాద్.
  • పురుషుల అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్ (86.99), తక్కువగా ఉన్న జిల్లా మహబూబ్‌నగర్ (62.21).
  • స్త్రీల అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్ (79.35 శాతం), తక్కువగా ఉన్న జిల్లా మహబూబ్‌నగర్ (44.72 శాతం).

షెడ్యూల్డ్ కులాల అక్షరాస్యత రేటు
  • రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) సగటు అక్షరాస్యత రేటు 58.90 శాతం.
  • షెడ్యూల్డ్ కులాల్లో పురుషుల సగటు అక్షరాస్యత రేటు 68.04 శాతం, స్త్రీల సగటు అక్షరాస్యత రేటు 49.90 శాతం.
  • ఎస్సీల్లో అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్ (77.28 శాతం).
  • ఎస్సీల్లో అక్షరాస్యత రేటు తక్కువగా ఉన్న జిల్లా మహబూబ్‌నగర్ 47.72 శాతం.

షెడ్యూల్డ్ తెగల అక్షరాస్యత రేటు
  • రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) అక్షరాస్యత రేటు 49.51 శాతం.
  • ఎస్టీల్లో పురుషుల సగటు అక్షరాస్యత రేటు 59.49 శాతం, స్త్రీల అక్షరాస్యత రేటు 39.44 శాతం.
  • ఎస్టీల్లో సగటు అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్ (69.34 శాతం).
  • ఎస్టీల్లో సగటు అక్షరాస్యత రేటు అల్పంగా ఉన్న జిల్లా మహబూబ్‌నగర్ (42.29).
  • భారతదేశంలో అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న రాష్ట్రం కేరళ.
  • దేశంలో అక్షరాస్యత రేటు తక్కువగా ఉన్న రాష్ట్రం బిహార్.

అక్షరాస్యత రేటు
  • తెలంగాణలో గ్రామీణ అక్షరాస్యత రేటు 57.25 (ప్రస్తుతం 57.30) శాతం.
  • రాష్ట్రంలో గ్రామీణ అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న జిల్లా రంగారెడ్డి.
  • రాష్ట్రంలో గ్రామీణ అక్షరాస్యత రేటు తక్కువగా ఉన్న జిల్లా మహబూబ్‌నగర్.

పట్టణ అక్షరాస్యత రేటు
  • తెలంగాణలో పట్టణ అక్షరాస్యత రేటు 81.09 శాతం.
  • రాష్ట్రంలో పట్టణ అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్.
  • పట్టణ అక్షరాస్యత రేటు తక్కువగా ఉన్న జిల్లా ఆదిలాబాద్.

తెలంగాణ అక్షరాస్యత - 2011 లెక్కల ప్రకారం (వివిధ జిల్లాలు)
జిల్లాస్త్రీల అక్షరాస్యతా రేటుపురుషుల అక్షరాస్యత రేటుమొత్తం అక్షరాస్యతా రేటు
హైదరాబాద్79.3586.9983.25
రంగారెడ్డి69.4082.1175.87
వరంగల్55.6974.5865.11
ఖమ్మం58.3073.3065.75
నల్లగొండ54.1974.1064.20
కరీంనగర్54.7973.6564.15
మెదక్51.3771.4361.42
నిజామాబాద్51.5471.4761.25
ఆదిలాబాద్51.3170.8161.01
మహబూబ్‌నగర్44.7265.2155.04
మొత్తం57.9975.0466.54

పట్టణ, గ్రామీణ జనాభాదేశంలో, రాష్ట్రంలో కాలానుగుణంగా పట్టణ జనాభా పెరుగుతోంది. 2011 లెక్కల ప్రకారం భారత్‌లో సగటు పట్టణ జనాభా శాతం 31.2 ఉండగా, రాష్ట్రంలో పట్టణ జనాభా శాతం 38.67గా ఉంది. అంటే రాష్ట్ర పట్టణ జనాభా జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నట్లు గమనించవచ్చు.
  • రాష్ట్రంలో గ్రామీణ జనాభా 215.85 లక్షల (ప్రస్తుతం 213.95 లక్షలు) మంది.
  • రాష్ట్ర మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా వాటా 61.33 (ప్రస్తుతం 61.12) శాతం.
  • సంఖ్యా పరంగా, శాతం పరంగా గ్రామీణ జనాభా అధికంగా ఉన్న జిల్లా మహబూబ్‌నగర్, తక్కువగా ఉన్న జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి.
  • తెలంగాణ రాష్ట్ర పట్టణ జనాభా 136.09 లక్షల మంది.
  • రాష్ట్ర మొత్తం జనాభాలో పట్టణ జనాభా వాటా 38.67 శాతం.
  • సంఖ్యా పరంగా, శాతం పరంగా పట్టణ జనాభా అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్, తక్కువగా ఉన్న జిల్లా మహబూబ్‌నగర్.
  • దేశంలో గ్రామీణ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్.
  • దేశంలో పట్టణ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర.

తెలంగాణ రాష్ర్టంలోని గ్రామీణ, పట్టణ జనాభా శాతం
సం.పట్టణ జనాభా శాతంజనాభా శాతం
197120.9979.01
198125.2774.73
199130.1869.82
200131.7968.21
201138.6761.33

రాష్ట్రంలో పిల్లల (0-6 ఏళ్ల మధ్య వయసు వారు) జనాభా
  • తెలంగాణ రాష్ట్రంలో పిల్లల జనాభా 39.20 లక్షలు. ఇందులో బాలురు 20.28 లక్షల మంది కాగా, బాలికలు 18.92 లక్షల మంది ఉన్నారు.
  • రాష్ట్ర మొత్తం జనాభాలో పిల్లల వాటా 11.14 శాతం.
  • సంఖ్యా పరంగా పిల్లల జనాభా అధికంగా ఉన్న జిల్లా రంగారెడ్డి.
  • సంఖ్యా పరంగా పిల్లల జనాభా తక్కువగా ఉన్న జిల్లా ఖమ్మం.
  • శాతం పరంగా పిల్లల జనాభా అధికంగా ఉన్న జిల్లా మహబూబ్‌నగర్.
  • శాతం పరంగా పిల్లల జనాభా తక్కువగా ఉన్న జిల్లా కరీంనగర్.

రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జనాభా
  • రాష్ట్రంలో ఎస్సీల మొత్తం జనాభా 54,32,680 మంది.
  • రాష్ట్ర జనాభాలో ఎస్సీ జనాభా శాతం 15.44
  • రాష్ట్ర మొత్తం ఎస్సీ జనాభాలో గ్రామీణ ప్రాంతంలో ఉండేవారి శాతం 75.40.
  • రాష్ట్ర మొత్తం ఎస్సీ జనాభాలో పట్టణ ప్రాంతాల్లో ఉండే వారి శాతం 24.60.
  • సంఖ్యా పరంగా, శాతం పరంగా ఎస్సీ జనాభా అధికంగా ఉన్న జిల్లా కరీంనగర్.
  • సంఖ్యా పరంగా, శాతం పరంగా రాష్ట్రంలో ఎస్సీ జనాభా తక్కువగా ఉన్న జిల్లా హైదరాబాద్.
  • భారతదేశ మొత్తం జనాభాలో ఎస్సీ జనాభా వాటా 16.6 శాతం.
  • సంఖ్యా పరంగా దేశంలో ఎస్సీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్.
  • శాతం పరంగా దేశంలో ఎస్సీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం పంజాబ్.
  • సంఖ్యా పరంగా, శాతం పరంగా దేశంలో ఎస్సీ జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం మిజోరాం.

షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జనాభా
  • తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీల జనాభా 32.87 లక్షల మంది.
  • రాష్ట్ర మొత్తం జనాభాలో ఎస్టీల వాటా 9.34 శాతం.
  • సంఖ్యా పరంగా, శాతం పరంగా ఎస్టీ జనాభా అధికంగా ఉన్న జిల్లా ఖమ్మం.
  • సంఖ్యా పరంగా, శాతం పరంగా ఎస్టీ జనాభా తక్కువగా ఉన్న జిల్లా హైదరాబాద్.
  • రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న షెడ్యూల్డ్ తెగ ‘లంబాడి’.
  • రాష్ట్రంలో ఉన్న మొత్తం షెడ్యూల్డ్ తెగల సంఖ్య 32.
  • భారతదేశ మొత్తం జనాభాలో ఎస్టీ జనాభా వాటా 8.6 శాతం.
  • దేశంలో సంఖ్యా పరంగా అత్యధిక ఎస్టీ జనాభా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్.
  • దేశంలో సంఖ్యా పరంగా ఎస్టీ జనాభా అల్పంగా ఉన్న రాష్ట్రం సిక్కిం.
  • దేశంలో శాతం పరంగా ఎస్టీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం మిజోరాం.
  • దేశంలో శాతం పరంగా ఎస్టీ జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం గోవా.
  • దేశంలో ఎస్టీ జనాభా లేని రాష్ట్రాలు పంజాబ్, హర్యానా.

జనన రేటుఒక సంవత్సర కాలంలో 1000 మంది జనాభాకు ఉన్న జననాల నిష్పత్తిని ‘జనన రేటు’ అంటారు.
  • తెలంగాణ రాష్ట్ర సగటు జనన రేటు 17.4.
  • రాష్ట్రంలో అత్యధిక జనన రేటు ఉన్న జిల్లా హైదరాబాద్ (19.4).
  • రాష్ట్రంలో అత్యల్ప జనన రేటు ఉన్న జిల్లా వరంగల్ (16.2).

శిశు మరణాల రేటుప్రతి 1000 మంది జీవించి ఉన్న పిల్లలకు మరణించే పిల్లల సంఖ్యను ‘శిశు మరణాల రేటు’ అంటారు.
  • తెలంగాణ రాష్ట్రంలో శిశు మరణాల రేటు 39గా ఉంది.
  • రాష్ట్రంలో అత్యధిక శిశు మరణాల రేటు ఉన్న జిల్లా మహబూబ్‌నగర్ (53).
  • అత్యల్ప శిశు మరణాల రేటున్న జిల్లా హైదరాబాద్ (20).

ప్రసూతి మరణాల రేటుప్రతి లక్ష మంది జననాలకు మరణించే తల్లుల సంఖ్యను ‘ప్రసూతి మరణాల రేటు’ అంటారు.
  • తెలంగాణ రాష్ట్రంలో ప్రసూతి మరణాల రేటు 92.
  • రాష్ట్రంలో అత్యధిక ప్రసూతి మరణాల రేటు ఉన్న జిల్లా ఆదిలాబాద్ (152).
  • అత్యల్ప ప్రసూతి మరణాల రేటు ఉన్న జిల్లా హైదరాబాద్ (71).

జనాభా గణాంకాలు