?max-results="+numposts1+"&orderby=published&alt=json-in-script&callback=showrecentposts1\"><\/script>");

Popular Posts

What’s Hot

భారత శీతోష్ణస్థితి ఎంతో వైవిధ్యభరితమైంది. ప్రతి రెండు నెలలకోసారి వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి! దేశంలో వాతావరణ పరిస్థితులు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా, ఒక్కో సమయంలో ఒక్కో రకంగా ఉంటాయి. దక్షిణ హిందూ మహాసముద్రంలో ఏర్పడే రుతుపవన ప్రక్రియ.. దేశ శీతోష్ణస్థితిని ఎక్కువగా ప్రభావితం చేస్త్తుంది!!
 ఒక ప్రాంతంలోని సగటు వాతావరణ పరిస్థితులనే శీతోష్ణస్థితిగా వ్యవహరిస్తారు. భారతదేశం శీతోష్ణస్థితి ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భారత్‌లో ఆరు రుతువులను గుర్తించవచ్చు. అంటే.. ప్రతి రెండు నెలలకు వాతావరణ మార్పులు సంభవిస్తాయి. భారతదేశ శీతోష్ణస్థితిని ‘రుతుపవన శీతోష్ణస్థితి’ అంటారు. శాస్త్రీయంగా పరిశీలిస్తే భారతదేశం ‘ఉష్ణో-ఆర్థ్ర శీతోష్ణస్థితి మండలం’ కిందకు వస్తుంది. కానీ సువిశాల భారతదేశంలో వాతావరణ పరిస్థితులు ఒక్కో ప్రాంతంలో, ఒక్కో సమయంలో ఒక్కోలా ఉంటాయి. సువిశాల విస్తీర్ణం, నైసర్గిక స్వరూపం, రుతుపవనాలు, భౌగోళిక ఉనికి లాంటి అంశాలు వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తాయి. 
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధిక(ఉదా.చిరపుంజి,మాసిన్‌రామ్), మరికొన్ని ప్రాంతాల్లో అత్యల్ప వర్షపాతం నమోదవుతుంది (ఉదా: థార్ ఎడారి). వేసవిలో దక్కన్ పీఠభూమి, పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాలు 45° సెంటీగ్రేడ్‌కు పైగా గరిష్ట ఉష్ణ్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి భిన్నంగా అదే సమయంలో ఉత్తరాన హిమాలయ పర్వత సానువుల్లో వాతావరణం చల్లగా ఉంటుంది.

వాతావరణ శాస్త్రజ్ఞులు భారత శీతోష్ణస్థితిని 4 భాగాలుగా విభజించారు.
1. రుతుపవన పూర్వకాలం(మార్చి15-జూన్ 15)
2. నైరుతి రుతుపవన కాలం (జూన్ 15 -సెప్టెంబర్ 15)
3. ఈశాన్య రుతు పవన కాలం (సెప్టెంబర్ 15 -డిసెంబర్ 15)
4. రుతుపవన అనంతర కాలం (డిసెంబర్ 15-మార్చి 15). 

రుతుపవన పూర్వ కాలంరుతుపవన పూర్వ కాలం (మార్చి 15 -జూన్15)లోదేశమంతటా ఉష్ణోగ్రతలు గరిష్టంగా ఉంటాయి. ఇది మండు వేసవి. ఈ సమయంలో సంవహన గాలులు వీస్తాయి. ఈ పవనాలను ఆంధీ, లూ, కాల్‌బైశాఖీ, మామిడి జల్లులు లాంటి స్థానిక పేర్లతో పిలుస్తారు. ఈ వేడిగాలులకు అప్పుడప్పుడూ చిరుజల్లులు, గాలిదుమ్ము కూడా తోడవుతాయి. ఈ కాలంలో ద్వీపకల్ప పీఠభూములు, వాయవ్య భారతదేశం బాగా వేడెక్కడంతో అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం నైరుతి రుతుపవనాలు భారత్‌లోకి ప్రవేశించటానికి ఉపకరిస్తుంది.

నైరుతి రుతుపవన కాలం నైరుతి రుతుపవన కాలం(జూన్15- సెప్టెంబర్15)లో అరేబియూ సముద్రం, హిందూమహా సముద్రాల నుంచి నైరుతి రుతు పవనాలు భారత్‌లోకి ప్రవేశిస్తాయి. వీటి ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి, దేశమంతా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. వార్షిక వర్షపాతంలో సుమారు 2/3 వంతు ఈ మూడు నెలల కాలంలోనే సంభవిస్తుంది. భారత ప్రధాన భూభాగంలోకి నైరుతి రుతు పవనాలు మొదటగా జూన్ మొదటి వారంలో మలబార్ తీరాన్ని తాకుతాయి. క్రమంగా ఇవి జూలై 15 కల్లా దేశమంతా వ్యాపిస్తాయి. నైరుతి రుతుపవనాలు రెండు శాఖలుగా(అరేబియూ సముద్రం, బంగాళాఖాతం) దేశంలోకి ప్రవేశిస్తాయి. నైరుతి రుతు పవనాలు ఎత్తయిన పర్వతాలు, పీఠభూములను దాటే సమయంలో పవనాభిముఖదిశలో ఉండే ప్రాంతాల్లో అధిక వర్షపాతం ఉంటుంది. కానీ అదే సమయంలో పవనపరాన్ముఖదిశలో ఉండే ప్రాంతాల్లో అత్యల్ప వర్షపాతం ఉండటంతో అవి పాక్షిక శుష్కమండలాలుగా రూపొందాయి. ఉదాహరణకు అరేబియా సముద్రం నుంచి ప్రవేశించే నైరుతి రుతుపవనాలను పశ్చిమ కనుమలు అడ్డుకుంటాయి. దీనివల్ల మలబార్, కొంకణ్ తీరాల్లో విస్తారంగా వర్షం కురుస్తుంది. ఇవి అతి ఆర్ధ్ర మండలాలు. కానీ సహ్యాద్రి కొండలకు వెనుక ఉన్న దక్కన్ పీఠభూమికి చెందిన ఉత్తర కర్ణాటక, పశ్చిమ తెలంగాణ, రాయలసీమ, మరాట్వాడా, విదర్భ ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువ. అందువల్ల ఇవి పాక్షిక శుష్కమండలాలుగా రూపొందాయి. ఈ ప్రాంతాలు ఎడారీకరణ సమస్యను ఎదుర్కొంటున్నాయి. మహబూబ్‌నగర్, అనంతపురం జిల్లాలు ఈ మండలం కిందకు వస్తాయి. ఈ మండలంలో వర్షపాత పరిమాణంలో అనిశ్చితి కూడా అధికంగా ఉంది. ఈ మండలం తరచూ తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటోంది.

విస్తారంగా వర్షాలుబంగాళాఖాతం నుంచి ప్రవేశించే నైరుతి రుతు పవనాలు తూర్పు, ఈశాన్య భారతదేశం, గంగా మైదానాల్లో వర్షాన్నిస్తాయి. ఈ పవనాలను పూర్వంచల్ కొండలు, శివాలిక్ పర్వతాలు అడ్డుకుంటున్నాయి. దాంతో పవనాభిముఖదిశలోని తెరాయి మండలం, మేఘాలయలోని షిల్లాంగ్ పీఠభూమి, నాగాలాండ్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గారో, ఖాసీ కొండల పవనాభిముఖదిశలో ఉన్న మాసిన్‌రామ్, చిరపుంజి ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. రాజస్థాన్‌లోని ఆరావళి పర్వతాలు నైరుతి రుతు పవనాలకు సమాంతరంగా ఉండటంతో ఇవి నైరుతి రుతుపవనాలను అడ్డగించలేవు. అదే సమయంలో పశ్చిమ రాజస్థాన్ ప్రాంత ఊర్థ్వ ట్రోపో ఆవరణంలో ఉన్న చల్లని స్థిర వాయురాశి నైరుతి రుతు పవనాలను పైకి లేవనీయకుండా అదిమిపెడతాయి. ఈ కారణాల వల్ల పశ్చిమ రాజస్థాన్‌లో వర్షపాతం అత్యల్పంగా ఉండి, శుష్క మండలం ఏర్పడింది. థార్ ఎడారి ఏర్పడటానికి ప్రధాన కారణం.

దక్షిణార్ధగోళంలోకి సూర్యుడుసెప్టెంబర్ మధ్య నుంచి సూర్యుడు దక్షిణార్ధగోళంలోకి ప్రవేశిస్తాడు. దీంతో భారత్‌లో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. భారత భూభాగంపై విస్తరించి ఉన్న అల్ప పీడనం క్రమంగా క్షీణించి, ఆ స్థానంలో అధిక పీడనం బలపడుతుంది. ఈ రకంగా నైరుతి రుతు పవనాల తిరోగమనం ప్రారంభమవుతుంది. తిరోగమించే రుతుపవనాలు శుష్కంగా ఉంటాయి. అయితే ఇవి బంగాళాఖాతంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి తేమను పీల్చుకొని, ఆర్ధ్రగా మారుతాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో వీస్తున్న ఈశాన్య వ్యాపారపవనాలు.. తిరోగమన రుతు పవనాలను ఈశాన్య రుతు పవనాలుగా రూపాంతరం చెందిస్తాయి. ఈశాన్య రుతుపవనాల వల్ల తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌ల్లో వర్షం కురుస్తుంది. ఈ సందర్భంగా గమనించాల్సిందేమిటంటే.. తమిళనాడు ప్రాంతంలోకి నైరుతి రుతుపవనాలు రాకుండా.. నీలగిరి, అన్నామలై, ఏలకుల కొండలు అడ్డగిస్తాయి. అందువల్ల నైరుతి రుతుపవన కాలంలో తమిళనాడులో వర్షం అంతగా కురవదు. 
 ఈశాన్య రుతుపవనాలతో ఈ ప్రాంతం విస్తారంగా వర్షాన్ని పొందుతుంది. డిసెంబర్ 15కల్లా దేశమంతటా శీతాకాలం ప్రారంభమవుతుంది. సైబీరియా నుంచి వచ్చే అతిశీతల పవనాలు.. గంగా-సింధూ మైదానంలోకి రాకుండా హిమాలయ పర్వతాలు అడ్డుకుంటాయి. లేకపోతే వీటి ప్రభావం వల్ల గంగా- సింధూ మైదానంలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకొని, నదులు గడ్డకట్టి రబీ సాగు సాధ్యమయ్యేది కాదు. డిసెంబర్, జనవరిల్లో హిమాలయూల నుంచి వీచే శీతల పవనాల వల్ల గంగా-సింధూ మైదానంలో ఎముకలు కొరికే చలి ఉంటుంది. డిసెంబర్-ఫిబ్రవరి కాలం సాధారణంగా దేశమంతా శుష్కంగా ఉంటుంది. కానీ ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం నుంచి వాయవ్య భారతదేశంలోకి కవోష్ణ చక్రవాతాలు ప్రవేశిస్తాయి. వీటిని పశ్చిమ అలజడులుగా పిలుస్తారు. వీటి ప్రభావం వల్ల దేశ వాయవ్య ప్రాంతంలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలు రబీలో సాగయ్యే గోధుమ దిగుబడి పెరగటానికి దోహదపడతాయి.
బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ద్రోణులు కొన్ని బలపడి ఆయనరేఖా చక్రవాతాలుగా మారి తూర్పు తీరాన్ని తాకుతాయి. వీటి ప్రభావం వల్ల తూర్పు తీరంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి.

17 - భారతదేశం - శీతోష్ణస్థితి

భారతదేశం సంక్షేమ రాజ్యం. ఈ భావనను దృష్టిలో ఉంచుకొని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇవి సక్రమంగా అమలయ్యేందుకు, వనరుల సమర్థ వినియోగానికి జనాభా లెక్కలను సేకరించడం తప్పనిసరి. జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘డెమోగ్రఫీ’ అంటారు. దేశంలో తొలిసారిగా 1872లో జనాభా లెక్కల సేకరణ మొదలైంది. 1881 నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కలను సేకరిస్తున్నారు.
భారతదేశ జనాభాలో విభిన్న శారీరక లక్షణాలు కనిపిస్తాయి. ప్రాచీన కాలం నుంచి వివిధ దేశాలకు చెందినవారు భారతదేశంలోకి ప్రవేశించి సాంఘికంగా, సాంస్కృతికంగా ఇక్కడి సమాజంలో కలిసిపోయారు. వీరు స్థానికులతో వివాహ సంబంధాలు ఏర్పర్చుకున్నారు. ఫలితంగా విభిన్న శారీరక లక్షణాలున్న సంతతి ఉద్భవించిందని ఆంత్రోపాలజిస్టుల అభిప్రాయం.
‘రిస్లే’ అనే ఆంత్రోపాలజిస్టు శారీరక లక్షణాల ఆధారంగా ప్రపంచ జనాభాను ఆరు జాతులుగా విభజించారు. ఏ దేశ జనాభాలోనైనా ఒక జాతి లేదా రెండు జాతుల లక్షణాలు ఉంటాయి. కానీ భారతదేశంలో మాత్రమే ప్రపంచంలోని ఆరు జాతుల లక్షణాలు కనిపిస్తాయి. అవి...

ఎ) నీగ్రిటోలు
దేశంలోకి మొదటిసారిగా వలస వచ్చిన జాతిగా వీరిని పేర్కొనవచ్చు. అండమాన్ నికోబార్ దీవుల్లో నివసించే షోంపైన్స్, జార్వాస్, ఓంజెస్ లాంటి తెగలలో, కేరళలోని పులియాన్స్ తెగలలో ఈ జాతి లక్షణాలు కనిపిస్తాయి.

బి) ప్రొటో ఆస్ట్రలాయిడ్స్
మధ్య భారతదేశంలో నివసించే గోండులు, ముండాలు, భిల్లులు, ఒరేన్‌లు, సంతాలులు, చెంచులు, కురుంబాలు లాంటి గిరిజన తెగలలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. 

సి) మెడిటరేనియన్వీరినే ద్రవిడులు అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో నివసించే ప్రజలను ఈ జాతి సంతతిగా పేర్కొంటారు. వీరినే సింధూ నాగరికత ప్రజల సంతతిగా పేర్కొనవచ్చు. ద్రవిడ ప్రజల జీవన విధానంలో సింధూ నాగరికత ప్రజల సాంస్కృతిక లక్షణాలు ఇప్పటికీ కనిపిస్తాయి. 

డి) మంగోలాయిడ్స్ఈశాన్య భారతదేశంలోని అసోం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రజల్లో, అండమాన్‌లోని ‘సెంటినీలీస్’ అనే తెగలో ఈ జాతి లక్షణాలు కనిపిస్తాయి. ఈ జాతి ప్రజల శరీరంలో ‘ఎపికాంతిక్ ఐలిడ్’ అనే ప్రత్యేక లక్షణం కనిపిస్తుంది.

ఇ) బ్రాకీ సెఫాలస్
వీరినే కాకసాయిడ్ జాతి ప్రజలుగా పేర్కొంటారు. ఈ జాతి వారిలో తల వెడల్పుగా ఉంటుంది. గుజరాత్, మహారాష్ర్టలోని మార్వాడీలు, పశ్చిమ బెంగాల్‌లోని నయనార్ క్షత్రియులు, నంబూద్రీ బ్రాహ్మణుల్లో ఈ జాతి లక్షణాలు కనిపిస్తాయి.

ఎఫ్) నార్డిక్స్ వీరినే ఆర్యన్లు అని పిలుస్తారు. భారతదేశంలోకి చివరిసారిగా వలస వచ్చిన జాతిగా వీరిని పేర్కొనవచ్చు. ఈ జాతి లక్షణాలున్న సంతతి ప్రస్తుతం పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లోని రాజపుత్రులు, జాట్‌లలో కనిపిస్తుంది.

జనాభా లెక్కల సేకరణ (2011)ఒక నిర్దిష్ట ప్రాంతంలో తమలో తాము అంతఃప్రజననం జరుపుకునే, నిర్దిష్ట ఆవాసంలో నివసించే ప్రజా సమూహమే జనాభా. ఇంటింటి సర్వే ద్వారా శాస్త్రీయ పద్ధతిలో జనాభా, దాని అనుబంధ అంశాలను సేకరించే పద్ధతినే జనాభా లెక్కల సేకరణ అంటారు.
భారతదేశం సంక్షేమ రాజ్యం. ఈ భావనను దృష్టిలో ఉంచుకొని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇవి సక్రమంగా అమలయ్యేందుకు, వనరుల సమర్థ వినియోగానికి జనాభా లెక్కల సేకరణ తప్పనిసరి. జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘డెమోగ్రఫీ’ అని అంటారు.
  • ప్రపంచంలో మొదటిసారిగా 1841లో ఆధునిక జనాభా లెక్కల సేకరణ ఇంగ్లండ్‌లో ప్రారంభమైంది. 1872లో భారతదేశంలో జన గణన మొదలైంది. 1881 నుంచి పదేళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా మన దేశంలో జనాభా లెక్కలను సేకరిస్తున్నారు.
  • 2011 జనాభా లెక్కల సేకరణ 15వది, స్వాతంత్య్రం వచ్చాక ఏడోది. 2011 సెన్సస్ కమిషనర్ డాక్టర్ చంద్రమౌళి. ఈ జనాభా లెక్కల సేకరణ 2010 ఏప్రిల్ 1న ప్రారంభమై 2011 మార్చిలో ముగిసింది. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా 17.5 శాతం. అత్యధిక జనాభా ఉన్న దేశాల జాబితాలో చైనా తొలిస్థానంలో ఉండగా, మన దేశం రెండో స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో వరసగా అమెరికా, ఇండోనేసియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి.
  • 2011 మార్చి 1 నాటికి దేశ జనాభా 1.21 బిలియన్లు దాటింది. 2001 నాటికి దేశ జనాభా 1.02 బిలియన్లు ఉండేది. అంటే పదేళ్లలో దేశ జనాభా 18.196 కోట్లు పెరిగింది.
  • 1991-2001 దశాబ్దంలో జనాభా వృద్ధిరేటు 21.54 శాతం. కాగా, 2001-11 మధ్యకాలంలో అది 17.7 శాతానికి తగ్గింది.
  • 1991-2001 దశాబ్దంలో జనాభా వార్షిక వృద్ధిరేటు 1.9 శాతం కాగా 2001-11లో 1.64 శాతానికి తగ్గింది.
  • జనసాంద్రత 2001లో చ.కి.మీ.కు 325 ఉంటే, అది 2011లో 382కు పెరిగింది.
  • అక్షరాస్యత 2001 మార్చి 1 నాటికి 64.38 శాతం కాగా, 2011 మార్చి నాటికి 74.04 శాతానికి పెరిగింది.
  • లింగనిష్పత్తి 2001 మార్చి 1 నాటికి 933 ఉంటే, 2011 మార్చి 1 నాటికి 943కి పెరిగింది. ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్యను లింగనిష్పత్తి అంటారు. దేశంలోకెల్లా అత్యుత్తమంగా కేరళలో లింగనిష్పత్తి 1084:1000గా ఉంది.
  • దేశంలో అత్యధిక జనాభా ఉన్న మొదటి ఐదు రాష్ట్రాలు... ఉత్తరప్రదేశ్, మహారాష్ర్ట, బిహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్).
  • దేశంలో తక్కువ జనాభా ఉన్న మొదటి నాలుగు రాష్ట్రాలు... సిక్కిం, మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్, గోవా.
  • అత్యధిక జనసాంద్రత ఉన్న తొలి నాలుగు రాష్ట్రాలు... బిహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్.
  • అత్యల్ప జనసాంద్రత ఉన్న తొలి నాలుగు రాష్ట్రాలు... అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాం, సిక్కిం, నాగాలాండ్.
  • అత్యధిక జనసాంద్రత ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు.. ఢిల్లీ, చండీగఢ్.
  • అత్యల్ప జనసాంద్రత ఉన్న తొలి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు... అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలి.
  • జనాభా దశాబ్దపు వృద్ధిరేటు ఎక్కువగా ఉన్న మొదటి నాలుగు రాష్ట్రాలు... మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, బిహార్, జమ్మూ-కశ్మీర్.
  • జనాభా దశాబ్దపు వృద్ధిరేటు తక్కువగా ఉన్న తొలి నాలుగు రాష్ట్రాలు... నాగాలాండ్, కేరళ, గోవా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.
  • దేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న మొదటి రెండు రాష్ట్రాలు... కేరళ, మిజోరాం.
  • దేశంలో తక్కువ అక్షరాస్యత ఉన్న మొదటి రెండు రాష్ట్రాలు... బిహార్, అరుణాచల్‌ప్రదేశ్.
  • దేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న మొదటి రెండు జిల్లాలు మిజోరాంలో ఉన్నాయి. అవి.. సెర్‌చ్చిప్, ఐజ్వాల్.
  • దేశంలో అక్షరాస్యత తక్కువ ఉన్న మొదటి రెండు జిల్లాలు... మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 10.43 కోట్ల(8.6 శాతం) మంది షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు.
  • ఎస్టీ జనాభా అధికంగా ఉన్న రాష్ర్టం మధ్యప్రదేశ్, తక్కువగా ఉన్న రాష్ర్టం సిక్కిం.
  • ఎస్టీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ర్టం మిజోరాం, తక్కువగా ఉన్న రాష్ర్టం గోవా.
  • ఎస్టీ జనాభా లేని రాష్ట్రాలు... పంజాబ్, హర్యానా.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) జనాభా శాతం 16.6. సంఖ్యాపరంగా 20.14 కోట్లు.
  • ఎస్సీ జనాభా అధికంగా ఉన్న రాష్ర్టం ఉత్తరప్రదేశ్. తక్కువగా ఉన్న రాష్ర్టం మిజోరాం.
  • ఎస్సీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ర్టం పంజాబ్, తక్కువగా ఉన్నది మిజోరాం.
  • ఎస్సీ జనాభా లేని రాష్ర్టం నాగాలాండ్ 

16 - జనాభా

వర్షపాతం, ఉష్ణోగ్రత, నేల స్వభావాన్ని బట్టి అడవులు పెరుగుతాయి. విశాల భారతదేశం వివిధ శీతోష్ణస్థితులకు నిలయం. వర్షపాతం అన్ని ప్రాంతాల్లో ఒకేలా లేదు.అందుకే భారత దేశంలో దట్టమైన అరణ్యాలు మొదలుకొని చిట్టడవులు, పొదలు, తుప్పలు కూడా విస్తారంగా కనిపిస్తాయి.
భారతదేశ సహజ ఉద్భిజ్జ సంపద ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుంది. వివిధ శీతోష్ణస్థితులు, నైసర్గిక స్వరూపం దీనికి కారణం. దట్టమైన అరణ్యాలు మొదలుకొని చిట్టడవులు, పొదలు, తుప్పలు కూడా భారతదేశంలో కనిపిస్తాయి. ఉష్ణమండల అరణ్యాలే కాకుండా సమశీతోష్ణ, ఆల్ఫైన్ అరణ్యాలు కూడా భారతదేశంలో పెరుగుతున్నాయి. హిమాలయ ప్రాంతం మినహారుుస్తే భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పెరిగే అరణ్య జాతులు ఆయా ప్రాంతాలు పొందే వర్షపాతంపై ఆధారపడి ఉంటాయి. అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతాల్లో సతతహరిత అరణ్యాలు పెరుగుతాయి. అత్యల్ప వర్షపాత ప్రాంతాల్లో పొదలు, తుప్పలు మాత్రమే ఉంటాయి. హిమాలయాల్లో ఎత్తును బట్టి అరణ్యాల జాతులు మారతాయి. ఎక్కువ ఎత్తులో కోనిఫెరస్ అరణ్యాలు, ఆల్ఫైన్ వృక్షజాతులు దర్శనమిస్తాయి.
సతత హరిత అరణ్యాలుఅత్యధిక వర్షపాతాన్ని మలబార్ తీరం, కేరళ, కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లోని పశ్చిమ వాలులు, అండమాన్-నికోబార్, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లోని ఆయనరేఖా ప్రాంతాల్లో సతతహరితారణ్యాలు విస్తరించి ఉన్నాయి. ఈ అరణ్యాల్లో మహాగని, ఎబోని, రోజ్‌వుడ్ ముఖ్య వృక్షజాతులు. ప్రవేశసౌలభ్యత లేకపోవటంతో ఈ అరణ్యాల్లో వాణిజ్య కలపను ఉత్పత్తి చేయటం కష్టం. ఈ అరణ్యాలు విస్తారమైన జీవవైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ కోవకు చెందిన కేరళలోని సెలైంట్‌వ్యాలీ ప్రాంతంలో సింహపుతోక లాంటి అందమైన కోతుల జాతి నివసిస్తోంది. పశ్చిమ కనుమల్లోని ఈ అరణ్య ప్రాంతాన్ని ప్రపంచంలోని 14 జీవ వైవిధ్య మండలాల్లో ఒకటిగా గుర్తించారు. అధిక వర్షపాతాన్ని పొందే తెరాయి ప్రాంతం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఈశాన్య భారతంలోని కొండ ప్రాంతాల్లో ఆర్ధ్ర ఆకురాల్చే అడవులు విస్తరించి ఉన్నాయి. వీటిని ‘రుతుపవన అరణ్యాలు’గా పిలుస్తారు. టేకు, సాల్, గుర్జన్, మహుబా ముఖ్యమైన వృక్షజాతులు. వెదురు, సబారుు, సలాయి గడ్డిజాతులు కూడా ఈ అరణ్యాల్లో పెరుగుతాయి. దేశంలో వాణిజ్య కలపను ఉత్పత్తి చేసే ముఖ్యమైన అరణ్యాలు ఇవి. 
60-100 సెం.మీ. మధ్యస్థ వర్షపాతాన్ని పొందే ప్రాంతాల్లో అనార్ధ్ర ఆకురాల్చే అరణ్యాలు పెరుగుతున్నాయి. ఈ అరణ్యాల్లో టేకు, మద్ది, అడవిచింత, అడవి వేప ముఖ్య వృక్షజాతులు ఇక్కడ పెరుగుతాయి. వెదురు కూడా విస్తారంగా లభిస్తుంది. ఇవి పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని నల్లమలై, ఎర్రమలై కొండ ప్రాంతాల్లో విస్తరించాయి. వ్యవసాయం విస్తరించడంతో ఈ అరణ్యాలు ఎక్కువగా కుచించుకపోతున్నాయి. ఈ అరణ్యాల్లో వాణిజ్య కలప ఉత్పాదకత తక్కువ.
చిట్టడవులుచిట్టడవులు 40-60 సెం.మీ. అల్ప వర్షపాతాన్ని పొందే సహ్యాద్రి కొండల వర్షచ్ఛాయా ప్రాంతం, వాయవ్య భారతదేశంలో పెరుగుతాయి. పశ్చిమ తెలంగాణ, రాయలసీమ, ఉత్తర కర్ణాటక, మరఠ్వాడా, పంజాబ్, హర్యానా, ఉత్తర రాజస్థాన్ ప్రాంతాల్లో ఈ అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. ముళ్లతో కూడిన తుమ్మ లాంటి అకేషియా జాతికి చెందిన తక్కువ ఎత్తు వృక్షజాతులు మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఈ అరణ్యాల్లో వంటచెరకు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. వాణిజ్య కలప లభించదు. 
అత్యల్ప వర్షపాతాన్ని పొందే ఉత్తర గుజరాత్(కచ్), పశ్చిమ రాజస్థాన్(థార్ ఎడారి) ప్రాంతాల్లో వృక్షాలు పెరగటానికి కావలసిన తేమ లభించదు. శుష్క, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలిగే మెగాధర్మ్, జెరోఫైట్ తరానికి చెందిన కాక్టస్‌లాంటి పొదలు, తుప్పలు మాత్రమే పెరుగుతాయి. ద్వీపకల్ప భారతదేశంలోని పర్వత శిఖర భాగాల్లో ఉప ఆయనరేఖ అనార్ధ్ర సతతహరిత అరణ్యాలు పెరుగుతాయి. మధ్యప్రదేశ్‌లోని మహదేవ కొండలు, అమర్‌కాంత్ ప్రాంతం, కేరళలోని పళని కొండలు, తమిళనాడులోని నీలగిరి, అన్నామలై కొండలు, కర్ణాటకలోని కూర్ల్ ప్రాంతాల్లోని అరణ్యాలు ఈ కోవకు చెందుతాయి. దక్షిణ భారతదేశంలో వీటిని ‘షోలా’ అరణ్యాలు అని పిలుస్తారు. ఇందులో యూకలిప్టస్, ఓక్, చెస్ట్‌నట్, మాపుల్ ముఖ్య వృక్షజాతులు.
ఎత్తును బట్టి వృక్ష జాతులు
హిమాలయ పర్వతాల్లో 2000 మీ. ఎత్తులో సమశీతోష్ణ మండల జాతులైన ఓక్, చెస్ట్‌నట్, వాల్‌నట్, మాపుల్, బీచ్ లాంటి వృక్షాలు ఉంటాయి. సుమారు 3000-3500 మీటర్ల ఎత్తులో కోనిఫెరస్ జాతికి చెందిన ఫైన్, ఫర్, స్పూస్, సెడార్‌లాంటి వృక్షాలతో కూడిన టైగా అరణ్యాలు పెరుగుతాయి. 4500 మీటర్ల ఎత్తులో విల్లో జాతి వృక్షాలు, రోడోడెండ్రాన్ జాతికి చెందిన పుష్పజాతులు, పచ్చిక బయళ్లు విస్తారంగా పెరుగుతాయి. ఈ ప్రాంతం సహజసిద్ధ ఉద్యానవనంగా కనిపిస్తుంది.
మడ అడవులుతీర ప్రాంతాల్లోని నదీ ముఖద్వారాలు, డెల్టాలు, ఉప్పునీటి కయ్యల వద్ద ప్రత్యేక రకమైన అరణ్యాలు పెరుగుతాయి. వీటిని ‘మడ అడవులు’ లేదా ‘మాన్‌గ్రూవ్ అరణ్యాలు’గా పిలుస్తారు. లవణీయతను తట్టుకొని నీటిలో తేలియాడే వృక్షజాతులు ఇక్కడ పెరుగుతాయి. సుందరి, రైజోఫెరా, సూల్పాకేన్ మొదలైనవి ముఖ్య వృక్షజాతులు. ఈ మడ అడవులు సముద్ర ఉప్పునీరు తీరమైదానాల్లోని వ్యవసాయ భూముల్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. ఎత్తయిన వేలా తరంగాలు, సునామీ తరంగాలు, చక్రవాతాలు తీరాన్ని దాటేటప్పుడు తీర ప్రాంతాల్లో ఎక్కువ నష్టం జరగకుండా ఈ అరణ్యాలు అడ్డుకుంటాయి. ఇవి జీవ వైవిధ్యానికి కూడా ప్రసిద్ధి. ఇటీవలి కాలంలో పర్యాటక కేంద్రాలు (రిసార్టులు, హోటల్స్) ఏర్పరచటానికి, వ్యవసాయాన్ని విస్తరించటానికి మడ అడవులను విచక్షణారహితంగా నరికివేస్తున్నారు. అందువల్ల భారత ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన మాన్‌గ్రూ ప్రాంతాలను రక్షిత మండలాలుగా ప్రకటించింది. అందులో ముఖ్యమైనవి సుందరవనాలు (పశ్చిమ బెంగాల్), భిత్తర్ కనికా (ఒడిశా), కొరింగ(ఆంధ్రప్రదేశ్), పిచ్చవరం, పారుయిట్ కాలిమోర్(తమిళనాడు), వెంబనాడు(కేరళ), కొండాపూర్ (కర్ణాటక), అచ్చా (మహారాష్ట్ర). భారతదేశంలో సగటున 23 శాతం భౌగోళిక ప్రాంతంలో మాత్రమే అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. 
ఇందులో 16 శాతం మాత్రమే దట్టమైన అరణ్యాల కోవకు చెందుతాయి. భౌగోళిక ప్రాంతంలో కనీసం 33 శాతం అరణ్యాలు ఉండాలని జాతీయ అటవీ విధానం నిర్దేశిస్తోంది. కొండలు ఎత్తయిన పీఠభూముల్లో కనీసం 60 శాతం, మైదాన ప్రాంతాల్లో కనీసం 20 శాతం అరణ్యాలు ఉండాలని కూడా జాతీయ అటవీ విధానం సూచిస్తోంది. కేవలం ఈశాన్య భారతదేశం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, అండమాన్-నికోబార్ అరణ్య ప్రాంతాలు మాత్రమే జాతీయ అటవీ విధాన లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరభారత మైదాన ప్రాంతాల్లో అరణ్యాల శాతం 10 కంటే తక్కువగా ఉంది. 
పర్యావరణాన్ని పరిరక్షించటానికి భారత ప్రభుత్వం కొన్ని అరణ్య ప్రాంతాలను జాతీయ ఉద్యానవనాలు, అభయారణ్యాలు, జీవావరణ మండలాలుగా ప్రకటించింది. దండేలి, భద్ర(కర్ణాటక) పెంచ్(మహారాష్ట్ర) బోరి, సాత్పుర (మధ్యప్రదేశ్), పాకీబామేరా (అరుణాచల్ ప్రదేశ్) అరణ్య ప్రాంతాలను ‘పులుల అభయారణ్యాలు’గా భారత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 1973లో ప్రారంభించిన ప్రాజెక్టు టైగర్ పథకం కింద స్థాపించిన పులుల అభయారణ్యాల సంఖ్య 29కి చేరింది. ‘మ్యాన్ అండ్ బయోస్పియర్’ పథకం కింద ఇప్పటి వరకు 14 రక్షిత జీవావరణ మండలాలను ఏర్పరిచారు. అవి..

రక్షిత జీవావరణ మండలంరాష్ట్రం (ఉనికి)
1. అచనాకర్ - అమర్‌కాంతక్    మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్
2. అగస్త్యమలైకేరళ
3. దేహాంగ్-దిబాంగ్అరుణాచల్ ప్రదేశ్
4. దిబ్రూ-సాయికోవాఅసోం
5. గ్రేట్ నికోబార్అండమాన్ - నికోబార్
6. మన్నార్ సింధు శాఖతమిళనాడు
7. కాంచనజంగసిక్కిం
8. మానస్అసోం
9. నందాదేవిఉత్తరాంచల్
10. నీలగిరికేరళ, తమిళనాడు, కర్ణాటక
11. నాక్రిక్మేఘాలయ
12. పచ్‌మాడిమధ్యప్రదేశ్
13. సిమ్లిపాల్ఒడిశా
14. సుందరవనాలుపశ్చిమ బెంగాల్

15 - భారతదేశ అటవీ సంపద

భారతదేశంలో విస్తారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయి. వీటిలో కోకింగ్ రకం తక్కువగా ఉండటం వల్ల ఆస్ట్రేలియా, చైనాల నుంచి దిగమతి చేసుకుంటున్నాం. నదీ పరీవాహక ప్రాంతాల్లో సహజ వాయువు అపారంగా లభిస్తోంది. సహజ వాయువు రంగంలో స్వయం సమృద్ధి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 ఇంధనాలు ప్రధానంగా రెండు రకాలు అవి..
 1) శిలాజ ఇంధనాలు
 ఉదా: బొగ్గు, చమురు, సహజవాయువు.
 2) అణు ఇంధనాలు
 ఉదా: యురేనియం, థోరియం, ఫ్లూటోనియం, రేడియం. 
 భారతదేశంలో సుమారుగా 220 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇందులో 200 బిలియన్ టన్నులు బిట్యూమినస్, 20 బిలియన్ టన్నులు లిగ్నైట్ రకానికి చెందినవి. ఆంథ్రసైట్, పీట్ తరగతికి చెందిన బొగ్గు నిల్వలకు మనదేశంలో అంతగా ప్రాధాన్యం లేదు. 
 బొగ్గు నిల్వలు: భారతదేశంలో బొగ్గు నిల్వలు ప్రధానంగా గోండ్వానా యుగానికి చెందినవి. ఇవి సుమారు 200 మిలియన్ సంవత్సరాల క్రితం నదీ హరివాణాల్లో ఏర్పడ్డాయి. భారతదేశపు బొగ్గు నిల్వలు ప్రధానంగా నాన్‌కోకింగ్ రకానికి చెందినవి. కోకింగ్ రకానికి చెందిన నాణ్యమైన బొగ్గును ఉక్కు కర్మాగారాల్లోని బ్లాస్ట్ ఫర్నేస్‌లలో వాడతారు. ఈ కోకింగ్ బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. 
 బొగ్గు క్షేత్రాలు: భారతదేశంలో బొగ్గు క్షేత్రాలు దామోదర్, మహానది, సోన్, గోదావరి, వార్ధా నదీ హరివాణాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. దేశంలో 60 శాతం బొగ్గు దామోదర్ నదీలోయ క్షేత్రాల నుంచే ఉత్పత్తి అవుతోంది. దామోదర్ నదీలోయ జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఝరియా, రాణిగంజ్, గిర్ధి, బొకారో, పాతకేరా ఈ ప్రాంతంలోని అతి పెద్ద బొగ్గు క్షేత్రాలు. పశ్చిమబెంగాల్‌లో రాణిగంజ్.. దేశంలోని అతిపెద్ద బొగ్గు క్షేత్రం. మహానది-సోన్ నదీ హరివాణాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఇది గోదావరి-వార్ధా లోయ తెలంగాణ, మహారాష్ర్టల్లో విస్తరించి ఉంది. ఇక్కడ కోర్బా, సింగ్రోలి, టాల్చేర్, ఇబ్‌లోయ, బిలాస్‌పూర్ ముఖ్యమైన బొగ్గు క్షేత్రాలు. మహారాష్ట్రలోని కాంప్‌తీ, చాందా, బలార్షా బొగ్గు క్షేత్రాలు, తెలంగాణలోని సింగరేణి బొగ్గు క్షేత్రం ఈ లోయలో భాగంగా ఉన్నాయి. తెలంగాణలోని సింగరేణి బొగ్గు క్షేత్రం ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో విస్తరించి ఉంది. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు(సింగరేణి), మణుగూరు, సత్తుపల్లి, వరంగల్‌లోని భూపాలపల్లి, ఆదిలాబాద్‌లోని మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, గోలేటి, కరీంనగర్‌లోని గోదావరిఖని ముఖ్యమైన గని కేంద్రాలు. 
 ఈశాన్యంలో బొగ్గు నిల్వలు: ఈశాన్య భారతదేశంలోని బొగ్గు నిల్వలు టెరిషరీ యుగానికి చెందినవి. వీటి బొగ్గులో గంధకం శాతం ఎక్కువ. అందువల్ల ఈ బొగ్గు పారిశ్రామిక విలువ తక్కువ. ఈశాన్య భారతంలో అసోం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో బొగ్గు నిల్వలున్నాయి. అసోంలోని మాకుమ్, నాగాలాండ్‌లోని నజీరా లోయ ప్రధాన బొగ్గు క్షేత్రాలు.
 లిగ్నైట్ బొగ్గు: లిగ్నైటు బొగ్గు మృదువైంది. దీన్ని విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే ఉపయోగిస్తారు. తమిళనాడు, డార్జిలింగ్, రాజస్థాన్‌లలో నిల్వలు ఉన్నాయి.
 పీట్ బొగ్గు: పీట్ బొగ్గు అపరిపక్వమైంది. ఇందులో సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీని కెలోరి విలువ చాలా తక్కువ. ‘పీట్’ తరగతికి చెందిన బొగ్గు నిల్వలు కేరళలోని కొచ్చిన్, అల్లెప్పీలలో విస్తరించి ఉన్నాయి.
అవక్షేప శిలల్లో చమురు: చమురు- సహజవాయువు నిల్వలు అవక్షేప శిలల్లో మాత్రమే లభిస్తాయి. ఖండ భాగాల్నే కాకుండా సముద్ర భూతలంపైన ఖండతీర అంచుల్లో కూడా చమురు సహజ వాయువు నిల్వలు ఉంటాయి. మహారాష్ట్ర తీరంలోని ముంబై హై, బేసిన్ క్షేత్రాలు భారతదేశంలో చమురు, సహజవాయువును ఉత్పత్తి చేసే ముఖ్య ప్రాంతాలు. గుజరాత్ తీరంలోని కంభత్ సింధుశాఖలో గాంధార్, వాస్నా, లూనెజ్ ముఖ్య క్షేత్రాలు. గుజరాత్ ఖండాంతర్భాగంలో మెహసానా, కాలోల్, అంకలేశ్వర్, హజీరా ఇతర చమురు-సహజవాయువు క్షేత్రాలు.  
యురేనియం నిల్వలు: మనదేశంలో యురేనియం నిల్వలు జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, మేఘాలయా, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. జార్ఖండ్‌లోని ‘జాడుగుడా’ ముఖ్యమైన యురేనియం గనుల కేంద్రం. మేఘాలయాలోని డొమియోస్టాట్, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, తెలంగాణలో నల్గొండల్లో యురేనియం నిల్వల ఉన్నాయి. 
మోనజైట్: కేరళ తీరంలోని ఇసుకలో మోనజైట్ లభిస్తోంది. ఇది ఇసుక, థోరియం, యురేనియం, ఫ్లూటోనియంల మిశ్రమం. ప్రపంచ మోనజైట్ నిల్వల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఈ గనులు, వాటి శుద్ధి కేంద్రాలు కేరళలోని క్విలన్, తమిళనాడులోని మనం కురిచ్చి, మహారాష్ట్రలోని రత్నగిరి, ఒడిశాలోని ఛత్రపూర్‌లలో ఉన్నాయి.

14 - భారతదేశం- ఇంధన వనరులు

మృత్తికలు లేదా నేలలు వ్యవసాయ పంటలకు, సహజ ఉద్భిజ సంపదకు మూలాధారం. మృత్తికల ఆవిర్భావ ప్రక్రియ చాలా సంక్లిష్టమైంది. ఈ సహజ సిద్ధ ప్రక్రియను ‘పిడోజెనెసిస్’ అంటారు. ఒక సెంటీమీటరు మందంఉన్న మృత్తిక ఏర్పడటానికి అయిదు నుంచి పది వేల సంవత్సరాల వరకు పడుతుంది!
 వ్యవసాయానికి కీలకమైన మృత్తికలు క్రమేణా క్రమక్షయం చెందుతున్నాయి. ఇది ఆవరణ వ్యవస్థల సుస్థిరతపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. పర్యావరణ సమతౌల్యం సాధించడానికి మృత్తికా సంరక్షణ అనివార్యం. మనదేశంలోని మృత్తికలు... 
 1. ఒండ్రుమట్టి నేలలు
 2. నల్లరేగడి నేలలు
 3. ఎర్ర నేలలు 
 4. నలుపు-ఎర్ర మిశ్రమ నేలలు
 5. లేటరైట్ నేలలు 
 6. ఎడారి నేలలు
 7. అటవీ నేలలు   
 8. క్షార లేదా ఆమ్ల నేలలు
 ఒండ్రుమట్టి నేలలు ఈ నేలలు గంగా-సింధు-బ్రహ్మపుత్ర మైదానం, తీర మైదానాలు, డెల్టాలు, నదీ హరివాణా ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ నేలలు చాలా సారవంతమైనవి. వీటిలో పంట దిగుబడి అధికంగా ఉంటుంది. ఒండ్రుమట్టి నేలలు రవాణా నేలల తరగతికి చెందినవి. మాతృక శిలలు వేర్వేరు ప్రాంతాలకు చెందినవి. దాంతో ఒండ్రుమట్టి నేలల్లో వివిధ స్థూల, సూక్ష్మ పోషకాలు ఉంటాయి. అందువల్ల ఈ నేలలు అనేక రకాల పంటల సాగుకు అనువైనవి. 
 ఈ నేలలు లోమి(Loamy) తరగతికి చెందినవి కావడం వల్ల తేమను బాగా పీల్చుకొని నిల్వ ఉంచుకుంటాయి. మృత్తికా కణాలు గోళాకారంలో ఉండటం వల్ల ఈ నేలలు దున్నడానికి చాలా అనువైనవి. ఒండ్రుమట్టి నేలలను తీర ప్రాంత, నదీ, డెల్టా అని మూడు రకాలు విభజించారు.  ప్రతి ఏటా శిలా పదార్థాలు నిక్షేపించడం వల్ల డెల్టా నేలలు సారవంతంగా తయారవుతాయి. సాపేక్షంగా పరిశీలిస్తే తీరప్రాంత ఒండ్రుమట్టి నేలల్లో వ్యవసాయ దిగుబడి తక్కువ. 
 నల్లరేగడి నేలలు వింధ్యా-సాత్పురా పర్వత శ్రేణుల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరకు నల్లరేగడి మండలం విస్తరించి ఉంది. ఈ నేలలు ప్రధానంగా గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోని మాళ్వా పీఠభూమి, పశ్చిమ మహారాష్ర్ట, ఉత్తర కర్ణాటక, పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. దక్కన్ నాపల ప్రాంతంలో బసాల్ట్ తరగతికి చెందిన అగ్నిశిలలు తీవ్ర క్రమక్షయం వల్ల నల్లరేగడి నేలలుగా ఏర్పడ్డాయి. ఇవి తేమను పీల్చుకొని ఎక్కవ కాలం తమలో నిల్వ చేసుకుంటాయి. అందువల్ల ఈ నేలలు వర్షాధార వ్యవసాయానికి అనువైనవి. నీటి ముంపునకు గురైతే ముద్దగా మారి సాగుకు అనువుగా ఉండవు. అందువల్ల నల్లరేగడి నేలల్లో సాగునీటి వ్యవసాయం సాధ్యం కాదు. ఇవి పత్తిసాగుకు చాలా అనువైనవి.
 ఎర్రనేలలు భారత్‌లోని పీఠభూమి ప్రాంతంలో ఈ నేలలు విస్తరించి ఉన్నాయి. ఇవి పోషకాల పరంగా సారవంతమైనవి. అయితే ఎర్ర ఇసుక  నేలల్లో పంటల దిగుబడి తక్కువ. తెలంగాణ, రాయలసీమ, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని నేలలు ఈ తరగతికి చెందినవి. గులకరాళ్లు, బండరాళ్లు పరుచుకొని ఉంటాయి. అందువల్ల ఈ నేలలను సాగులోకి తేవడం చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఈ నేలలను ఆంధ్రప్రదేశ్‌లో స్థానికంగా చెలకలు అంటారు. వీటిలో పంటల దిగుబడి తక్కువ. వరుసగా పంటలను సాగు చేస్తే త్వరగా సారాన్ని కోల్పోతాయి.  సాగునీరు, ఎరువులను వాడటం వల్ల దిగుబడిని స్థిరీకరించవచ్చు. ఎర్రనేలలు, నల్లరేగడి మండలాల మధ్య ప్రాంత నేలల్లో ఈ రెండింటి మిశ్రమ లక్షణాలు కనిపిస్తాయి. 
 లేటరైట్ నేలలు భారతదేశంలోని కొండలు, పీఠభూమి శిఖర భాగాల్లో లేటరైట్ నేలలు ఏర్పడ్డాయి. అధిక వర్షపాతం, ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఇవి ఏర్పడతాయి. ఖనిజ పోషకాలు ఈ నేలల పైపొరల నుంచి కింది పొరల్లోకి ఇంకిపోతాయి. దీనివల్ల పైపొరల్లో కేవలం ఫై ఆక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ లాంటి ఖనిజాలు మాత్రమే మిగులుతాయి. అందువల్ల ఇవి వ్యవసాయానికి అంతగా అనువైనవి కావు. ఈ నేలలు ముదురు జేగురు వర్ణంలో ఉంటాయి. సహ్యాద్రి, అన్నామలై, వింధ్యా పర్వతాలు, తూర్పు కనుమల శిఖరాల్లోని నేలలు ఈ కోవకు చెందినవి.
 ఎడారి నేలలు ఈ నేలలు పశ్చిమ రాజస్థాన్, ఉత్తర గుజరాత్ లలో  విస్తరించి ఉన్నాయి. వీటి పైపొరల్లో కఠిన లవణాలు ఉంటాయి. అందువల్ల ఇవి వ్యవసాయానికి పనికిరావు. సాగు నీటి ద్వారా ఉపరితల కఠిన పొరను తొలగిస్తే పంటలు పండించే అవకాశం ఉంటుంది. పశ్చిమ రాజస్థాన్ లోని ఇందిరాగాంధీ కాలువ ఆయకట్టు ప్రాంతంలో సాగునీటి ద్వారా కఠిన లవణ పొరను తొలగించి పంటలను సాగు చేస్తున్నారు.
 ఆమ్ల (క్షార) మృత్తికలు నిస్సారమైన ఈ మృత్తికలు ఒండ్రుమట్టి నేలల్లో చెదురుమదురుగా కనిపిస్తాయి. ఈ మృత్తికలను స్థానికంగా కల్లార్, రే, ఉసార్, నేలలు అంటారు. ఈ చౌడు నేలలను తటస్థీకరించడానికి సున్నం, జింక్‌లను నేలలకు కలుపుతారు. ఈ మృత్తికల్లో వ్యవసాయ పంటల దిగుబడి తక్కువ. కేరళ తీర ప్రాంతంలోని కొచ్చిన్, అల్లెప్పీల సమీపంలో ‘పీట్’ తరగతికి చెందిన నేలలు విస్తరించి ఉన్నాయి. 
 మృత్తికా సంరక్షణ చర్యలు
 వేగంగా ప్రవహించే నదుల వల్ల మృత్తికా క్రమక్షయం జరుగుతుంది. కొండల వాలులో చెట్లు నాటడం వల్ల నేలల క్రమక్షయాన్ని తగ్గించవచ్చు. మృత్తికా సంరక్షణ కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. కాంటార్ బండింగ్, సోపాన వ్యవసాయం, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, వాటర్‌షెడ్ పథకాల నిర్వహణపై దృష్టి కేంద్రీకరిస్తోంది. నేలల క్రమక్షయాన్ని తగ్గించడానికి రైతులు మల్చింగ్, స్ట్రిప్‌క్రాపింగ్ వంటి పద్ధతులను అనుసరిస్తున్నారు. పంట చేతికొచ్చిన తర్వాత మిగిలిన రొట్టను పొలంలోనే ఉంచి దున్నడం ద్వారా నేలల సారాన్ని పెంచొచ్చు. మల్చింగ్ పద్ధతిలో రొట్టను పొలంలో పరిచి, పవనాల వల్ల నేలల క్రమక్షయూన్ని అరికట్టొచ్చు. స్ట్రిప్ క్రాపింగ్ పద్ధతిలో వివిధ కాల వ్యవధుల్లో కోతకు వచ్చే పంటలను వరుసల్లో పెంచుతారు. చంబల్-యమునా లోయ ప్రాంతంలో నేలల తీవ్ర క్రమక్షయం వల్ల గల్లీలు, రావైన్‌లు ఏర్పడి ఆ ప్రాంతమంతా ‘బ్యాడ్‌ల్యాండ్’ భూస్వరూపాన్ని సంతరించుకుంది. ఈ ప్రాంతంలో భూవనరులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. పంటల మార్పిడి పద్ధతి ద్వారా కూడా నేలల సారం పెంచొచ్చు. లెగ్యూమ్ జాతికి చెందిన పంటలను మార్పిడి పంటగా వాడుతున్నారు!!

13 - మృత్తికలు

భారత్‌లో 7517 కిలోమీటర్ల తీరరేఖ వెంబడి 12 ప్రధాన రేవు పట్టణాలు... సుమారు 200 చిన్న, మధ్యతరహా రేవు పట్టణాలు ఉన్నాయి. ప్రధాన రేవు పట్టణాలను కేంద్ర ప్రభుత్వం నేరుగా పోర్టు ట్రస్టుల ద్వారా నిర్వహిస్తోంది. చిన్న, మధ్య తరహా పోర్టుల నిర్వహణ బాధ్యత ఆయూ రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి.
అంతర్జాతీయ వాణిజ్యంలో రేవు పట్టణాల పాత్ర కీలకం. ఇవి తీరప్రాంత వాణిజ్యంలోనూప్రధానపాత్ర పోషిస్తున్నాయి. నౌకాశ్రయంతో సంబంధం ఉన్న ప్రాంతం(హింటర్‌లాండ్) ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి. మన దేశంలో సుమారు 75 శాతం సరకు రవాణా కేవలం 12 ప్రధాన రేవు పట్టణాల నుంచే జరుగుతోంది.
ప్రధాన రేవు పట్టణాలు:
 1) కోల్‌కతా-హాల్దియా
 2) ముంబై
 3) జేఎన్‌పీటీ
 4) చెన్నై
 5) ఎన్నూరు
 6) పారాదీప్
 7) విశాఖపట్నం
 8) కాండ్లా
 9) ట్యూటికోరిన్
 10) కొచ్చిన్
 11) మార్ముగావ్
 12) న్యూ మంగళూరు 
కోల్‌కతా-హాల్దియాహుగ్లీ నది ముఖద్వారం నుంచి 148 కి.మీ. దూరంలో కోల్‌కతా నదీ రేవు పట్టణం ఉంది. దీని పృష్టభూమి తూర్పు, ఈశాన్య భారతదేశమంతా విస్తరించి ఉంది. విశాఖపట్నం, పారాదీప్ రేవు పట్టణాలు అభివృద్ధి చెందాక కోల్‌కతా రేవు పట్టణ ప్రాధాన్యం తగ్గింది. పూడిక వల్ల కూడా దీని సామర్థ్యం పడిపోయింది. 1978లో ఈ రేవు పట్టణానికి 90 కి.మీ. దిగువన ఉన్న హాల్దియూ రేవు పట్టణాన్ని  అభివృద్ధి చేశారు. తేయాకు, అబ్రకం, తోళ్లు ముఖ్య ఎగుమతులు.
ముంబైఇది పశ్చిమ తీరంలోని అతిపెద్ద రేవు పట్టణం. స్వాతంత్య్రానికి పూర్వమే ఈ ఓడ రేవు అభివృద్ధి చెందింది. సూయజ్ కాలువ ప్రారంభం దీని అభివృద్ధికి దోహదం చేసింది. ఈ రేవు పట్టణాన్ని భారతదేశ ముఖద్వారంగా వ్యవహరించేవారు. ఇది కూడా సహజసిద్ధ రేవు పట్టణం. దీని హింటర్‌లాండ్ మహారాష్ట్ర, గుజరాత్, తూర్పు రాజస్థాన్, కర్ణాటకల్లో విస్తరించి ఉంది. పత్తి, యంత్ర పరికరాలు ప్రధాన ఎగుమతులు. ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు, కాగితం ప్రధాన దిగుమతులు.
జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్
ముంబై రేవుపై రద్దీని తగ్గించడానికి 1989లో ముంబై పోర్ట్ కు 15 కి.మీ. దక్షిణాన నావసేవా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్(జేఎన్‌పీటీ)ను అభివృద్ధి చేశారు.
చెన్నై రేవు పట్టణంచెన్నై పోర్ట్ ట్రస్ట్ హింటర్‌లాండ్ దక్షిణ భారతదేశమంతటా విస్తరించింది. ఈ రేవు పట్టణం నుంచి ప్రధానంగా పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గు, నూనె ఉత్పత్తులు, యంత్ర పరికరాలు దిగుమతి అవుతున్నాయి.అబ్రకం, పొగాకు, తోళ్లు, పసుపు ప్రధాన ఎగుమతులు.
ఎన్నూర్ రేవుచెన్నై రేవు పట్టణంపై ఒత్తిడిని తగ్గించడానికి సమీపంలో ఎన్నూర్ రేవు పట్టణాన్ని ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. 
పారాదీప్ 
ఒడిశా తీరంలో కటక్‌కు సమీపంలోని పారాదీప్ దేశంలోకెల్లా లోతైన రేవు పట్టణం. ప్రధానంగా ఇది ఎగుమతి రేవు పట్టణం. ముఖ్యంగా ఒడిశాలో ఉత్పత్తి అవుతోన్న ఇనుప ఖనిజం ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుంది. 
విశాఖపట్నం
తూర్పు తీరంలోని ఏకైక సహజసిద్ధ రేవు పట్టణం విశాఖపట్నం. యూరాడ కొండచరియ బంగాళాఖాతంలోకి చొచ్చుకొని పోవడం వల్ల ఈ సహజసిద్ధ రేవు పట్టణం ఏర్పడింది. ఈ రేవు పట్టణం హింటర్‌లాండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్,  ఒడిశా రాష్ట్రాల్లోకి విస్తరించింది. బైలడిల్లా గనుల్లో ఉత్పత్తయిన ఇనుప ఖనిజం ఇక్కడి నుంచే జపాన్‌కు ఎగుమతి అవుతోంది.
కాండ్లా ఇది గుజరాత్‌లోని కచ్ సింధుశాఖ తీరంలో భుజ్‌కు 48 కి.మీ. దూరంలో ఉన్న సహజసిద్ధ రేవు పట్టణం. స్వాతంత్య్రం వచ్చాక దీన్ని అభివృద్ధి చేశారు. దేశ విభజనలో కరాచీ రేవు పట్టణం పాకిస్తాన్‌కు వెళ్లడంతో.. భారత ప్రభుత్వం కాండ్లా రేవు పట్టణాన్ని అభివృద్ధి చేసింది. ఈ నౌకాశ్రయ హింటర్‌లాండ్ పశ్చిమ, వాయవ్య భారతదేశంలోకి విస్తరించింది. ఇది ప్రధానంగా దిగుమతి రేవు పట్టణం. పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులు, గంధకం, ఫాస్పేట్ ప్రధాన దిగుమతులు. పత్తి, తేయాకు, ఆహారధాన్యాలు ముఖ్య ఎగుమతులు.
ట్యూటికోరిన్ తమిళనాడు తీరంలోని ట్యూటికోరిన్ కృత్రిమ లోతైన రేవు పట్టణం. జాతీయ రహదారులు, బ్రాడ్‌గేజ్ రైలు మార్గాల ద్వారా ఈ రేవు పట్టణం అంతర్భాగాలతో పటిష్టంగా అనుసంధానించారు. ట్యూటికోరిన్‌లో ఆధునిక కంటైనర్, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ టెర్మినళ్లను నిర్మించారు.
కొచ్చిన్
కేరళ తీరంలో వెంబనాడ్ సరస్సు ముఖద్వారం వద్ద కొచ్చిన్ రేవు పట్టణం ఉంది. సూయజ్ కాలువ-కొలంబో అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గానికి సమీపంలో ఉండటం వల్ల కొచ్చిన్ రేవు పట్టణం బాగా అభివృద్ధి చెందింది. కొబ్బరిపీచు, కొబ్బరి కాయలు, తేయాకు, కాఫీ, జీడిపప్పు, చేపలు ప్రధాన ఎగుమతులు. పెట్రోలియం, నూనె ఉత్పత్తులు, ఎరువులు, రసాయనాలు ప్రధాన దిగుమతులు.
మార్ముగావ్గోవా తీరంలో జువారీ నది ముఖద్వారం వద్ద మార్ముగావ్ రేవు పట్టణం ఉంది. ఇది కూడా సహజసిద్ధ రేవు పట్టణమే. ఇక్కడ నుంచి ప్రధానంగా ముడి ఇనుము ఎగుమతి అవుతోంది. మాంగనీసు, ఉప్పు, జీడిపప్పు ఇతర ఎగుమతులు. పెట్రోలియం ఉత్పత్తులు ప్రధాన దిగుమతులు. కొంకణ్ రైలు మార్గ నిర్మాణంతో ఈ రేవు పట్టణం ప్రాధాన్యత బాగా పెరిగింది.
న్యూమంగళూరు  మంగళూరు రేవుకు ఉత్తరంగా 10 కి.మీ. దూరంలో న్యూమంగళూరు రేవు పట్టణాన్ని  అభివృద్ధి చేశారు. ఇది గురుపూర్ నదీ ముఖద్వారానికి సమీపంలో ఉంది.

12 - ప్రధాన రేవు పట్టణాలు

భూపటలం అనేక శిలలతో కూడి ఉంటుంది. భూ ఉపరితలంపై ఉన్న పర్వతాలు, పీఠభూములు, మైదానాలు వంటి భూస్వరూపాలు వివిధ రకాల శిలలతో నిండి ఉంటాయి. శిలలు ఖనిజాల సమాహారం. శిలల్లో రెండు వేల రకాలకు పైగా ఖనిజాలున్నాయి. అందులో ఆరు ఖనిజాలు ముఖ్యమైనవి. అవి.. ఫెలస్పార్, క్వార్ట్జ్, పైరిక్సిన్, ఆంఫిబోల్స్, మైకా, ఆలివిన్.
ఉద్భవన విధానం, భౌతికధర్మాల ఆధారంగా శిలలు మూడు రకాలు అవి.. అగ్ని శిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు. పటలంలో అధిక ఉష్ణోగ్రతలు, పీడనాల వల్ల శిలా పదార్థం ద్రవ రూపంలో ఉంటుంది. దీన్ని ‘మాగ్మా’అంటారు. మాగ్మా ఘనీభవించడం వల్ల అగ్ని శిలలు ఏర్పడతాయి. ఇవి ప్రాథమిక శిలలు. పటలం అంతర్భాగంలో అధిక లోతుల్లో మాగ్మా ఘనీభవించడం వల్ల ఏర్పడినవే పాతాళ (Plutonic) అగ్ని శిలలు. ఇవి విశాలమైన ‘బాతోలిథ్’ భూస్వరూపాలను ఏర్పరుస్తాయి. అధిక లోతుల్లో మాగ్మా నెమ్మదిగా ఘనీభవించడంతో శిలల్లో భారీ స్ఫటికాలు ఏర్పడతాయి. మధ్యస్థ లోతుల్లో మాగ్మా ఘనీభవించడం వల్ల ‘హైపర్‌బేసిల్’ అగ్ని శిలలు ఏర్పడతాయి. ఇవి సిల్స్, డైక్స్, ఫాకోలిథ్, లాకోలిథ్ లాంటి భూస్వరూపాలను ఏర్పరుస్తాయి. ఉపరితలంపైకి ఉబికి వచ్చిన మాగ్మాను ‘లావా’ అంటారు. ఇదే అగ్నిపర్వతక్రియ. లావా ఘనీభవనం వల్ల ఏర్పడే అగ్ని శిలల్లో స్ఫటికాలు ఉండవు. ఈ శిలలు అగ్ని పర్వతాలు, లావాడోమ్లు లాంటి భూస్వరూపాలను ఏర్పరుస్తాయి.
ఆమ్ల అగ్ని శిలలుసిలికా శాతం అధికంగా ఉన్న అగ్ని శిలలను ‘ఆమ్ల అగ్ని శిలలు’ అంటారు. వీటిలో ఫెర్నో మెగ్నీషియం ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఉదాహరణకు గ్రానైట్, సిలికా తక్కువగా ఉండి మెగ్నీషియం, అల్యూమినియం, పొటాషియం అధికంగా ఉన్న శిలలను ‘బేసిక్ అగ్నిశిలలు’ అంటారు. బసాల్టు, గాబ్రో మొదలైన శిలలు ఈ తరగతికి చెందినవి. ఆమ్ల అగ్ని శిలలు లేతరంగులో ఉండి, క్రమక్షయాన్ని తట్టుకోగలవు. బేసిక్ అగ్ని శిలలు ముదురు రంగులో ఉండి, త్వరగా క్షయం చెందుతాయి. అగ్ని శిలలు అధిక ఉష్ణోగ్రత, పీడనాల వద్డ్ద ఏర్పడటం వల్ల వాటిలో శిలాజాలు ఉండవు. అగ్ని శిలలు పటలం లోపలి భాగాల్లో ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి. భారతదేశంలో దక్కన్ నాపల ప్రాంతం.. బసాల్టు రకానికి చెందిన అగ్ని శిలలతో నిండి ఉంటుంది. హిమాలయ పర్వతాల కేంద్రకంలో గ్రానైట్ శిలలు ఉన్నాయి.
నదులు, పవనాలు, హిమనీ నదులు, వేలాతరంగాల వంటి బాహ్య క్రమక్షయ కారకాల చర్య వల్ల ఉపరితలంపై విస్తరించిన శిలలు శిథిలమవడంతో.. శిథిల శిలా పదార్థం ఏర్పడుతుంది. ఈ శిథిల పదార్థం నిక్షేపణ వల్ల అవక్షేప శిలలు ఏర్పడతాయి. ఉపరితల శిలల్లో 75 శాతం అవక్షేప శిలల తరగతికి చెందుతాయి. ఉద్భవన విధానాన్ని బట్టి అవక్షేప శిలలను రెండు రకాలు. అవి.. ఎ) యాంత్రిక అవక్షేప శిలలు, బి) రసాయనిక అవక్షేప శిలలు.
యాంత్రిక అవ క్షేప శిలలుశిథిల శిలా పదార్థ నిక్షేపణలు సంఘటితంలో క్రమంగా గట్టిపడి యాంత్రిక అవక్షేప శిలలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఇసుకరాయి(sand stone),షేల్. రసాయనిక చర్యల ఫలితంగా శిథిలమైన శిలా పదార్థం గట్టిపడి రసాయనిక అవక్షేప శిలలు ఏర్పడతాయి. 
ఉదా: కాల్సైట్, జిప్సం, సున్నపురాయి. జీవసంబంధ పదార్థ నిక్షేపాలతో కూడా అవక్షేప శిలలు ఏర్పడవచ్చు. 
ఉదా: పీట్, లిగ్నైట్, ప్రవాళ ఇసుకరాయి. అవక్షేప శిలలు, నదీలోయలు, నదీ ముఖద్వారాలు, వరద మైదానాలు, తీరమైదానాల్లో విస్తరించి ఉంటాయి. అవక్షేప శిలల్లో శిలాజాలు ఉంటాయి. బొగ్గు, చమురు, సహజ వాయువులాంటి శిలాజ ఇందనాలు అవక్షేప శిలలో మాత్రమే లభిస్తాయి. అవక్షేప శిలలు పొరలు పొరలుగా ఉంటాయి. బెడ్డింగ్ ప్లేనులు, స్ట్రాటిఫికేషన్ అవక్షేపశిలల ముఖ్య లక్షణం. అవక్షేప శిలలు మృదువుగా లేదా కఠినంగా ఉండొచ్చు.
రూపాంతర శిలలుమాతృక శిలలు అధిక ఉష్ణోగ్రతలు, పీడనాలకు లోనై వాటి భౌతిక, రసాయనిక లక్షణాలు పూర్తిగా మారిపోయి కొత్తరకం శిలలుగా రూపాంతరం చెందుతాయి. వీటిని రూపాంతర శిలలుగా పిలుస్తారు. సాధారణంగా అగ్నిపర్వత ప్రక్రియ, పర్వతోద్భవన ప్రక్రియల వల్ల రూపాంతర శిలలు ఏర్పడతాయి. ఇవి చాలా కఠినంగా, దృఢంగా, పెళుసుగా ఉంటాయి. ఈ శిలల్లో పగుళ్లు, బీటలు, అతుకులు ఎక్కువగా ఉంటాయి. ఇవి అనేక రకాల ఖనిజాలతో కూడి ఉంటాయి. నీస్ (Gneiss), సిస్ట్, క్వార్ట్జైట్ ముఖ్య రూపాంతర శిలలు . రూపాంతర శిలల మాతృక శిలలు అగ్ని, అవక్షేప లేదా రూపాంతర శిలల తరగతికి చెందినవి.

మాతృక శిల- రూపాంతర శిల
షేల్స్లేటు
స్లేటుసిస్ట్
గ్రానైట్నీస్
సున్నపురాయిమార్బుల్
ఇసుకరాయిక్వార్ట్జైట్
శిలా చక్రంభూస్వరూపాల్లాగే శిలలు కూడా శాశ్వతం కాదు. వివిధ ప్రక్రియల వల్ల ఒక తరగతికి చెందిన శిలలు ఇతర రకాల శిలలుగా మారతాయి. దీనినే శిలాచక్రం అంటారు. అగ్ని, రూపాంతర శిలలు క్రమక్షయం వల్ల శిథిలమై.. అవక్షేప శిలలు ఏర్పడతాయి. పర్వతోద్భవనం, అగ్నిపర్వత ప్రక్రియల వల్ల అవక్షేప, అగ్నిశిలలు పటలంలోకి చొచ్చుకొనిపోయి అధిక ఉష్ణోగ్రత, పీడనాల ప్రభావం వల్ల రూపాంతర శిలలుగా మారతాయి. పలకల సరిహద్దుల వద్ద సబ్‌డక్షన్ మండలంలో ఉపరితల శిలలు.. పటల అంతర్భాగాల్లోకి నెట్టడం వల్ల శిలాద్రవంగా మారిపోతాయి. శిలాద్రవం ఘనీభవించి అగ్నిశిలలుగా ఏర్పడతాయి.

11 - శిలలు

ఒక దేశం ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి పరిశ్రమలు ఎంతగానో తోడ్పడతాయి. సమాజ సంక్షేమం పారిశ్రామిక అభివృద్ధితోనే సాధ్యమవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అభివృద్ధి చెందిన దేశాలను దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. భారతదేశంలో రెండో పంచవర్ష ప్రణాళికా కాలంలో పరిశ్రమలకు అధిక ప్రాధాన్యమిచ్చి వాటి అభివృద్ధికి కృషి చేశారు. దేశంలో వాస్తవిక పారిశ్రామికీకరణ 1950-60 మధ్య కాలంలో ప్రధానంగా ఇనుము-ఉక్కు పరిశ్రమల స్థాపనతో ప్రారంభమైంది.
దేశంలోని పరిశ్రమలను ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:1) వ్యవసాయాధారిత పరిశ్రమలు
2) అటవీ ఆధారిత పరిశ్రమలు
3) ఖనిజాధారిత పరిశ్రమలు
వ్యవసాయాధారిత పరిశ్రమలు
వ్యవసాయ ఉత్పత్తులను ముడిసరకుగా ఉపయోగించే పరిశ్రమలను ‘వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు’ అంటారు.
ఉదా: నూలు, జనుము, ఉన్ని, కాఫీ, పంచదార, రబ్బరు, పట్టు, తోలు, తేయాకు పరిశ్రమలు.
వస్త్ర పరిశ్రమ (టెక్స్‌టైల్ ఇండస్ట్రీ)
ఇది భారతదేశంలో బాగా విస్తరించిన, అతిపెద్ద, అతి పురాతన పరిశ్రమ. దీనికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంది. ఇది ప్రత్యక్షంగా 3.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. విదేశీ మారక ద్రవ్య ఆదాయంలో 24.6 శాతం ఈ రంగం నుంచే వస్తోంది. స్థూల జాతీయోత్పత్తిలో (జీఎన్‌పీ) 4 శాతం ఈ పరిశ్రమ నుంచే లభిస్తోంది. నూలు, జనపనార, ఉన్ని, పట్టు వస్త్ర పరిశ్రమలు దీనిలో ముఖ్యమైనవి.
1. నూలు వస్త్ర పరిశ్రమ (కాటన్ టెక్స్‌టైల్స్): దేశంలో నూలు వస్త్ర పరిశ్రమ అత్యంత పురాతనమైంది, అతిపెద్దది. ఎక్కువ మంది శ్రామికులను కలిగిన పరిశ్రమ ఇది. ఇందులో సుమారు 15 మిలియన్ల మంది కార్మికులు పని చేస్తున్నారు. భారతదేశ శ్రామికుల్లో 20 శాతం ఈ పరిశ్రమలోనే ఉన్నారు.
  • దేశంలో మొదటి నూలు మిల్లును 1818లో కోల్‌కతా సమీపంలోని ‘పోర్ట్ గ్లాస్టర్’ వద్ద ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో ఇది మూతపడింది.
  • 1854లో ముంబై సముద్ర తీర ప్రాంతంలో సి.ఎన్. థేవార్ అనే పారశీక పెట్టుబడిదారుడి సహాయంతో ఆధునిక పద్ధతిలో నూలు మిల్లు ప్రారంభించారు. దేశంలో వాస్తవంగా పరిశ్రమల స్థాపన దీని ద్వారానే మొదలైందని భావిస్తారు.
  • స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నూలు మిల్లులు ఎక్కువగా మహారాష్ట్రలోని ముంబై, గుజరాత్‌లోని అహ్మదాబాద్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమయ్యాయి.
  • ప్రస్తుతం నూలును ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న మొదటి మూడు దేశాలు.. 1) అమెరికా 2) చైనా 3) భారత్
  • దేశంలో నూలును ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న మొదటి మూడు రాష్ట్రాలు.. 1) మహారాష్ట్ర 2) గుజరాత్ 3) తమిళనాడు
  • ప్రస్తుతం దేశంలో నూలు వస్త్ర పరిశ్రమకు అత్యంత ముఖ్యమైన నగరం మహారాష్ట్రలోని ముంబయి. దీన్ని ‘కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా’, ‘మాంచెస్టర్ ఆఫ్ ఇండియా’గా పేర్కొంటారు.
  • గుజరాత్‌లోని అహ్మదాబాద్ నూలు వస్త్ర పరిశ్రమకు దేశంలో ముంబై తర్వాత రెండో అతిపెద్ద కేంద్రంగా ఉంది. ఈ నగరాన్ని ‘మాంచెస్టర్ ఆఫ్ నార్‌‌త ఇండియా’ అని పిలుస్తారు.
  • దక్షిణ భారతదేశంలో తమిళనాడులోని ‘కోయంబత్తూర్’ నూలు పరిశ్రమకు అత్యంత ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందింది. దీన్ని ‘మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా’గా భావిస్తారు.
2. జనపనార వస్త్ర పరిశ్రమ (జ్యూట్ టెక్స్‌టైల్): మొదటిసారిగా దీన్ని 1855లో పశ్చిమ బెంగాల్‌లో కోల్‌కతాకు సమీపంలోని ‘రిష్రా’ వద్ద చేనేత పరిశ్రమగా ఏర్పాటు చేశారు. 1859లో మరమగ్గాల ద్వారా జనపనార వస్త్ర పరిశ్రమ ప్రారంభమైంది. ఈ పరిశ్రమ ‘హుగ్లీ’ నదీ తీరం వెంట అధికంగా కేంద్రీకృతమైంది. జనపనార వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. కానీ ఎగుమతుల విషయంలో బంగ్లాదేశ్ తర్వాత రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం సింథటిక్ ప్యాకింగ్ మెటీరియల్ కారణంగా జనపనార పరిశ్రమలో తీవ్ర మాంద్యం ఏర్పడింది.
  • పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడం వల్ల జనపనార పరిశ్రమను ‘గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా’గా వ్యవహరిస్తున్నారు.
  • దేశంలో అధికంగా జనుమును ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం - పశ్చిమ బెంగాల్.
3. ఉన్ని వస్త్ర పరిశ్రమ: భారతదేశంలో ఆయన రేఖా ప్రాంత రుతుపవన శీతోష్ణస్థితి ఉన్ని పరిశ్రమ అభివృద్ధికి అవరోధంగా ఉంది. దేశంలో మేలురకం ఉన్ని ఎక్కువగా లభించకపోవడం వల్ల ఈ పరిశ్రమ అంతగా అభివృద్ధి చెందలేదు. 1876లో ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో ఉన్న ‘లాల్‌ఇమ్లి’ వద్ద దేశంలో మొదటి ఉన్ని పరిశ్రమ ఏర్పాటు చేశారు.
  • ప్రస్తుతం ఉన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న ప్రాంతం ‘పంజాబ్’లోని ‘లుథియానా- అమృత్‌సర్-గురుదాస్‌పూర్’.
  • ఉన్ని పరిశ్రమలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం- పంజాబ్. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి.
4. పట్టు వస్త్ర పరిశ్రమ (సిల్క్ టెక్స్‌టైల్స్): ప్రపంచంలో పట్టు ఉత్పత్తిలో భారతదేశం చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. 1932లో పశ్చిమ బెంగాల్‌లోని ‘హౌరా’ వద్ద మొదటి పట్టు పరిశ్రమను ఏర్పాటు చేశారు. భారతదేశంలో ప్రధానంగా మల్బరీ, ఇరి, టసార్, ముగ అనే నాలుగు రకాల పట్టు ఉత్పత్తి చేస్తున్నారు. ‘ముగ’ అనేది ‘బంగారు పసుపు’ రకం పట్టుగా ప్రసిద్ధి చెందింది.
  • దేశంలో పట్టును అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం - కర్ణాటక.
5. సింథటిక్ వస్త్ర పరిశ్రమ: ఈ పరిశ్రమలో రేయాన్, నైలాన్, టెర్లిన్, పాలిస్టర్ మొదలైన రసాయనాల కలయికలతో వస్త్రాలు రూపొందిస్తారు.
  • దేశంలో సింథటిక్ వస్త్రాలను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం - మహారాష్ట్ర.
పంచదార పరిశ్రమవ్యవసాయాధార పరిశ్రమల్లో నూలు తర్వాత రెండో అతి ముఖ్యమైన పరిశ్రమ ఇదే. చెరకుతో పాటు పంచదార ఉత్పత్తిలో బ్రెజిల్ తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. బెల్లం, కండసారి చక్కెర ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది.
  • భారతదేశంలో మొదటి పంచదార పరిశ్రమను 1840లో బిహార్‌లో ‘డచ్’ దేశస్థుల సహకారంతో ఏర్పాటు చేశారు. ఇది కొన్ని కారణాల వల్ల కొనసాగలేదు. ఆ తర్వాత బ్రిటిషర్ల సహకారంతో 1903లో బిహార్‌లో ఆధునిక పంచదార మిల్లు ప్రారంభించారు.
  • దేశంలో అత్యధికంగా పంచదార పరిశ్రమలు ఉన్న రాష్ట్రం - ఉత్తరప్రదేశ్. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంది.
  • ఉత్తరప్రదేశ్‌ను ‘సుగర్ బౌల్ ఆఫ్ ఇండియా’గా పేర్కొంటారు.
  • పంచదార పరిశ్రమ నుంచి లభించే ‘మొలాసిస్’ను చాక్లెట్లు, ఆల్కహాల్ తదితరాల తయారీలో ఉపయోగిస్తారు.
  • చెరకు గెడలలో ఉండే పదార్థం ‘సుక్రోజ్’.
  • చక్కెర పరిశ్రమకు సంబంధించి నియమించిన కమిటీ - మహాజన్ కమిటీ.
తేయాకు పరిశ్రమ (టీ ఇండస్ట్రీ)19వ శతాబ్దంలో డార్జిలింగ్, అసోం, నీలగిరి ప్రాంతాల్లో మొదటిసారిగా టీ పరిశ్రమ ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో తేయాకును అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం - అసోం. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు తర్వాత స్థానంలో ఉన్నాయి.
కాఫీ పరిశ్రమభారతదేశంలో మొదటి కాఫీ పరిశ్రమను 1826లో కర్ణాటక రాష్ట్రంలోని ‘చిక్ మంగుళూరు’ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. దేశంలో కాఫీని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం - కర్ణాటక.
రబ్బరు పరిశ్రమదేశంలో మొదటి రబ్బర్ పరిశ్రమను 1920లో కోల్‌కతాలో ఏర్పాటు చేశారు. మొదటి సింథటిక్ రబ్బర్ పరిశ్రమను 1955లో ఉత్తరప్రదేశ్‌లోని ‘బరేలీ’లో స్థాపించారు.
  • రబ్బరు ఉత్పత్తిలో ‘కేరళ’ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది.
తోలు (లెదర్) పరిశ్రమభారతదేశంలో మొదటి తోలు పరిశ్రమను 1960లో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఏర్పాటు చేశారు. దేశంలో అత్యధికంగా తోలు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం - ఉత్తరప్రదేశ్.
అటవీ ఆధార పరిశ్రమలు
అడవుల నుంచి లభించే ఉత్పత్తుల ఆధారంగా ఏర్పాటు చేసిన పరిశ్రమలను ‘అటవీ ఆధార పరిశ్రమలు’ అంటారు. వీటిలో ముఖ్యమైనవి.. కాగితం, అగ్గిపుల్లలు, ఆట వస్తువులు, లక్క, తునికి మొదలైనవి. 
కాగితం పరిశ్రమభారతదేశంలో మొదటి కాగితం పరిశ్రమను 1832లో కోల్‌కతా సమీపంలోని ‘సేరంపూర్’ వద్ద ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అధిక ఉత్పత్తి కోసం 1870లో పశ్చిమ బెంగాల్‌లోని ‘బాలిగంజ్’ ప్రాంతంలో ఆధునిక కాగిత పరిశ్రమ ‘రాయల్ బెంగాల్ పేపర్ మిల్’ ఏర్పాటు చేశారు.
  • మధ్యప్రదేశ్‌లోని ‘నేపానగర్’లో 1955లో ‘నేషనల్ న్యూస్ ప్రింట్ మిల్’ స్థాపించారు.
  • పేపర్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు - పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర.
  • కాగితం ఉత్పత్తిలో ఉపయోగించే ముడి పదార్థాలు వెదురు, బగాసే, సబాయ్ గడ్డి. ఈ గడ్డి శివాలిక్ ప్రాంతంలో లభిస్తుంది.
  • దేశంలో మొదటి అగ్గిపుల్లల పరిశ్రమను 1921లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో స్థాపించారు.
  • దేశంలో అగ్గిపుల్లలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు - తమిళనాడు (శివకాశి), కేరళ (తిరువనంతపురం), తెలంగాణ (హైదరాబాద్, వరంగల్).
  • దేశంలో మొదటి ఆటవస్తువుల పరిశ్రమను ‘పంజాబ్’లోని ‘సియాల్ కోట్’లో స్థాపించారు. ఇది ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది. రెండో పరిశ్రమను ఉత్తరప్రదేశ్‌లోని ‘మీరట్’లో స్థాపించారు. ప్రస్తుతం వీటిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్.
  • దేశంలో లక్క ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం - జార్ఖండ్. (చోటానాగ్‌పూర్ పీఠభూమి), రెండో రాష్ట్రం - మధ్యప్రదేశ్.
  • రెజిన్‌ను ‘ఖైర్’ అనే వృక్షం నుంచి తీస్తారు. దీని ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం - అరుణాచల్ ప్రదేశ్.
  • టెండు (లేదా) తునికి పరిశ్రమ అధికంగా ఉన్న రాష్ట్రం - మధ్యప్రదేశ్.
మహారత్నాలు
ఏడాదికి సరాసరి 25 వేల కోట్ల టర్నోవర్, 5 వేల కోట్ల ప్రాఫిట్ ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీలను మహారత్నాలుగా ప్రకటిస్తారు. 2009 డిసెంబర్ నుంచి కంపెనీలకు మహారత్న హోదా ఇస్తున్నారు. ఈ హోదా ఉన్న పరిశ్రమలు నికర విలువలో 15శాతం వరకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉదా॥వ్యాపార ఒప్పందాలు, అదనపు సిబ్బంది నియామకాలు, యంత్రాల కొనుగోలు మొదలైన విషయాల్లో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ హోదా ఉన్న పరిశ్రమలు ఏడు. అవి..
1. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) 
2. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)
3. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ) 
4. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ)
5. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌ఏఐల్)
6. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (జీఏఐల్)
7. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)
నవరత్నాలు
ఏడాదికి సరాసరి 10 వేల కోట్ల టర్నోవర్, 1000 కోట్ల ప్రాఫిట్ ఉన్న ప్రభుత్వ పరిశ్రమలను నవరత్నాలుగా ప్రకటిస్తారు. వీటిని 1997 జులై నుంచి గుర్తిస్తున్నారు. ఈ హోదా ఉన్న పరిశ్రమలు నికర విలువలో 15శాతం వరకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు. 
నవరత్న హోదా ఉన్న కంపెనీలు..
1. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) 
2. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) 
3. కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్) 
4. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) 
5. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) 
6. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) 
7. మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్‌ఎల్) 
8. నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎండీసీ) 
9. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఏఎల్‌సీఓ) 
10. నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎల్‌సీఎల్) 
11. ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్) 
12. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్‌సీఎల్) 
13. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్)
14. రాష్ట్రీయ ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) 
15. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్‌ఈసీఎల్)
16. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌సీఐఎల్) 
17. నేషనల్ బిల్డింగ్‌‌స కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌బీసీసీ)

దేశంలోని వివిధ సంస్థలు వాటి ప్రధాన కార్యాలయాలు
1. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ -ముంబై2. ఇండియన్ పెట్రో కెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ - వడోదర3. ఇండియన్ రేర్ ఏర్‌‌త్స లిమిటెడ్ - ఆల్వే4. నేషనల్ ఫిజికల్ లేబొరేటరీ - న్యూఢిల్లీ 5. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ -పనాజీ6. నేషనల్ కెమికల్ లేబొరేటరీ - పుణే7. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ - కోల్‌కతా8. సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - జోథ్‌పూర్ 9. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ - నాగపూర్ 10. సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - కాసర్‌గఢ్ 11. సెంట్రల్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ -డెహ్రాడూన్ 12. కాటన్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - ముంబై13. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రౌండ్ నట్ -జునాగఢ్ 14. ఆటమిక్ ఎనర్జీ కమిషన్ -ముంబై15. నేషనల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - నాగపూర్16. ఇండియన్ గ్రాస్‌లాండ్ అండ్ ఫొడేర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - ఝాన్సీ 17. ఆంత్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - కోల్‌కతా18. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ - అహ్మదాబాద్

10 - భారతదేశం - పరిశ్రమలు

పారిశ్రామిక కార్యకలాపాలు భారీగా కేంద్రీకృతమైన భౌగోళిక ప్రాంతాన్నే పారిశ్రామిక మండలంగా వ్యవహరిస్తారు. పారిశ్రామిక ముడి సరకులు, మార్కెట్లు, అవస్థాపనా సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో పారిశ్రామిక కార్యకలాపాలు కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతమై పారిశ్రామిక మండలాలు ఏర్పడతాయి. ఐరోపా, ఉత్తర అమెరికా, జపాన్‌లలో పారిశ్రామిక మండలాలు విశేషంగా అభివృద్ధి చెందాయి. ఉదాహరణకు యూఎస్‌ఏలోని ఈశాన్య ప్రాంతం, మహా సరస్సుల ప్రాంతాల్లో విస్తారమైన పారిశ్రామిక మండలాలు రూపొందాయి. అదేవిధంగా అభివృద్ధి చెందుతోన్న చైనా, ఇండియూ, బ్రెజిల్ దేశాల్లోనూ ఇటీవల పారిశ్రామిక మండలాల అభివృద్ధిని గమనించవచ్చు.
ఒక భౌగోళిక ప్రాంతంలో ఉత్పత్తి అవుతున్న పారిశ్రామిక వస్తువుల విలువ, వసూలవుతున్న కార్పొరేట్ సుంకాల విలువ, వినియోగమవుతున్న విద్యుచ్ఛక్తి, పారిశ్రామిక ఉపాధి పరిమాణం మొదలైన సూచికల ఆధారంగా పారిశ్రామిక మండలాలను గుర్తించవచ్చు. భారతదేశంలో ఆరు ప్రధాన పారిశ్రామిక మండలాలు ఉన్నాయి. అవి:
  • ముంబై-పుణె మండలం
  • హుగ్లీ బేసిన్ మండలం
  • చోటా నాగపూర్ మండలం
  • ఢిల్లీ-ఆగ్రా-మధుర మండలం
  • అహ్మదాబాద్-వడోదర మండలం
  • చెన్నై-మధురై-కోయంబత్తూరు మండలం
ముంబై-పుణె మండలం ముంబై-పుణె, హుగ్లీ బేసిన్ మండలాలు స్వాతంత్య్రానికి ముందే అభివృద్ధి చెందాయి. మిగతా నాలుగు మండలాలు ప్రధానంగా స్వాతంత్య్రానంతరం అభివృద్ధి చెందాయి. మహారాష్ట్రలో విస్తరించిన ముంబై-పుణె మండలం దేశంలోకెల్లా అతిపెద్ద, అత్యాధునిక పారిశ్రామిక మండలం. స్వాతంత్య్రానికి పూర్వమే నూలు వస్త్ర పరిశ్రమ స్థాపనతో ఈ పారిశ్రామిక మండల అభివృద్ధికి అంకురార్పణ జరిగింది. ఇప్పటికీ నూలు వస్త్ర పరిశ్రమను ఈ మండలానికి వెన్నుముకగా పేర్కొనవచ్చు.
స్వాతంత్య్రం తర్వాత ఈ మండలంలో పారిశ్రామిక వైవిధ్యం సంభవించింది. ఆటోమొబైల్, చమురు శుద్ధి, కాగితం, ఇంజనీరింగ్, రసాయనాలు తదితర పరిశ్రమలు ఇక్కడ అభివృద్ధి చెందాయి. ముంబై మెట్రోపాలిటన్ నగరం ఈ పారిశ్రామిక మండల కేంద్రం. కళ్యాణ్, పుణె, కొల్హాపూర్, ఉలాస్‌పూర్, థానే, నాగాథానే, ట్రాంబే మొదలైన పారిశ్రామిక పట్టణాలు ఈ మండలం కిందకు వస్తాయి.
ముంబై రేవుపట్టణం, సహ్యాద్రి కొండల్లోని జలవిద్యుచ్ఛక్తి సామర్థ్యం, పటిష్టమైన రవాణా వ్యవస్థ, బ్యాంకింగ్ రంగం, స్థానిక పెట్టుబడి సామర్థ్యత, రాష్ట్ర ప్రభుత్వ ఉదారవాద విధానాలు ఈ పారిశ్రామిక మండల అభివృద్ధికి దోహదం చేస్తున్న అనుకూలాంశాలు. విపరీతంగా పెరుగుతున్న భూమి ధరలు, కాలుష్యం ఈ పారిశ్రామిక మండల అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి.
 
హుగ్లీ బేసిన్ మండలం స్వాతంత్య్రానికి పూర్వమే కలకత్తా నగర పరిసర ప్రాంతాల్లో హుగ్లీ బేసిన్ పారిశ్రామిక మండలం అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. కలకత్తా నదీరేవు పట్టణం కావడం ఈ పారిశ్రామిక మండల అభివృద్ధి ప్రాథమిక దశలో కీలక పాత్ర పోషించింది.
 మొదట జనపనార పరిశ్రమ అభివృద్ధితో ప్రారంభమై క్రమంగా ఆటోమొబైల్, భారీ యంత్ర పరికరాలు, వినిమయ వస్తువులు, రసాయనాలు, కాగితం, పెట్రో రసాయన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. హౌరా, డమ్‌డమ్, సాల్ట్ లేక్ సిటీ, రిస్రా, ఆగర్‌పారా, సెరామ్‌పూర్, చందర్ నాగోర్, ఫోర్ట్‌గ్లాస్టర్, లీలూ, బడ్జ్ బడ్జ్ ఆసన్‌సోల్, హల్దియా మొదలైనవి ఈ బేసిన్‌లో ముఖ్య పారిశ్రామిక పట్టణాలు.
దేశంలో మొదటి జనపనార కర్మాగారాన్ని రిస్రాలో స్థాపించారు. సమీపంలోని ఝరియా, రాణిగంజ్ బొగ్గు క్షేత్రాలు, జల రవాణా వ్యవస్థలు, అధిక జనసాంద్రత, కలకత్తా రేవుపట్టణం ఈ పారిశ్రామిక మండల అభివృద్ధికి దోహదం చేశాయి. రేవులో పూడిక సమస్య, తీవ్రమైన పారిశ్రామిక వివాదాలు, అతివాద ట్రేడ్ యూనియన్ ధోరణులు ఈ పారిశ్రామిక మండల అభివృద్ధికి ఇటీవల ప్రధాన అడ్డంకులుగా మారాయి. దీంతో ఈ పారిశ్రామిక మండల అభివృద్ధి కుంటుపడింది.
 
చోటానాగపూర్ మండలంఇది దేశంలోని ఏకైక ఖనిజాధారిత పారిశ్రామిక మండలం. చోటానాగపూర్ పీఠభూమిలో  పరిశ్రమలకు అవసరమైన ఖనిజ నిల్వలు విస్తారంగా ఉన్నాయి. దామోదర్ నదీలోయలోని బొగ్గు క్షేత్రాలు (బొకారో, గిర్ధి, ఝరియూ), హజారీబాగ్-సింగ్‌భమ్ ప్రాంతాల్లోని ఇనుము, బాక్సైట్, రాగి మొదలైన లోహ ఖనిజాలు  పరిశ్రమలను ఆకర్షించాయి. గనుల తవ్వకం ఈ మండలంలో పెద్ద పరిశ్రమగా రూపొందింది. భారత ప్రభుత్వం స్థాపించిన వివిధ భారీ ప్రభుత్వ రంగ కర్మాగారాలు ఈ పారిశ్రామిక మండల అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాయి. రాంచీలోని హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ (HEC), సింధ్రీలోని ఎరువుల కర్మాగారం (FCI), బరేనీలోని చమురు శుద్ధి కర్మాగారాలను ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇవేకాకుండా సిమెంట్ కర్మాగారాలు, ఇనుము- ఉక్కు కర్మాగారాలు (బొకారో, జంషెడ్‌పూర్) ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాయి. పటిష్టమైన రోడ్డు, రైలు రవాణా వ్యవస్థలు లేకపోవడం ఈ మండలం అభివృద్ధికి ప్రధాన ఆటంకం. ఈ పారిశ్రామిక మండలంలోని భారీ ప్రభుత్వ రంగ సంస్థలకు అనుసంధానాలు లేకపోవడం వల్ల స్థానిక పారిశ్రామిక పట్టణాలు సమగ్ర ప్రాంతీయాభివృద్ధికి ఉపకరించడంలో విఫలమయ్యాయి. పారిశ్రామికాభివృద్ధి స్థానికులకు ఉపాధి చూపలేకపోయింది.
 
ఢిల్లీ-ఆగ్రా-మధుర మండలంఢిల్లీ మెట్రోపాలిటన్ నగరం కేంద్రంగా 1970వ దశకం నుంచి పారిశ్రామికాభివృద్ధి ప్రారంభమైందని చెప్పవచ్చు. ప్రధాన రైలు మార్గాలు, జాతీయ రహదారులు ఢిల్లీ నగరంలో అభిసరణం చెందడం, విస్తార స్థానిక మార్కెట్, సమీపంలోని సారవంతమైన వ్యవసాయ ప్రాంతం ఈ మండల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. వ్యవసాయాధార పరిశ్రమలైన చక్కెర, నూలు వస్త్రాల తయారీతో ప్రారంభమై క్రమంగా పారిశ్రామిక వైవిధ్యం ఏర్పడింది. ఢిల్లీ మెట్రోపాలిటన్ నగరంలో కాల్కా, షాదారా, నోయిడా, గుర్గావ్ ప్రాంతాల్లో ఆటోమొబైల్, ఇంజనీరింగ్, వినిమయ వస్తువుల తయారీ కేంద్రీకృతమైంది. ఆగ్రా, మధుర, ఘజియాబాద్, యమునానగర్ మొదలైనవి ఇతర పారిశ్రామిక కేంద్రాలు.
 
అహ్మదాబాద్-వడోదర మండలం గుజరాత్‌లోని అహ్మదాబాద్-వడోదర మండలంలో పారిశ్రామికాభివృద్ధి 1970వ దశకం నుంచి వేగం పుంజుకుంది. అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్, జామ్‌నగర్, వల్సాస్, ఆనంద్, భరోచ్ ఈ ప్రాంతంలోని పారిశ్రామిక పట్టణాలు. నూలు వస్త్రాలు, చమురు శుద్ధి, పెట్రో రసాయనాలు, ఇంజనీరింగ్, సిమెంట్ మొదలైన పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. ‘వడోదర’ను భారతదేశ పెట్రో రసాయనాల రాజధానిగా అభివర్ణిస్తారు. కంబత్ సింధు శాఖలో బయల్పడిన చమురు, సహజ వాయు నిక్షేపాలు, సారవంతమైన కథియావాడ్ వ్యవసాయ ప్రాంతం, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఈ మండల అభివృద్ధికి దోహదం చేశాయి.
 
చెన్నై - మధురై - కోయంబత్తూరు మండలం
తమిళనాడులో పారిశ్రామికాభివృద్ధి మొదట చెన్నై పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైంది. దీనికి  చెన్నై రేవుపట్టణం ఉపయోగపడింది. మెట్టూరు, శివ సముద్రాల్లో జలవిద్యుచ్ఛక్తి, రవాణా సౌకర్యాల అభివృద్ధి, నైపుణ్యం ఉన్న శ్రామికుల లభ్యత ఈ మండలానికి అనుకూలించే అంశాలు. కోయంబత్తూరులో నూలు వస్త్ర పరిశ్రమలు కేంద్రీకృతమవడంతో ఈ నగరం ‘దక్షిణ భారత మాంచెస్టర్’గా అవతరించింది. ఇక్కడ ఇంజనీరింగ్, సిమెంటు పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాయి. మధురై, ఈరోడ్, తిరుప్పూర్, సేలం మొదలైనవి ఇతర పారిశ్రామిక పట్టణాలు.

9 - పారిశ్రామిక మండలాలు

దేశ ఆర్థికాభివృద్ధిలో ఖనిజ సంపద కీలకపాత్ర పోషిస్తుంది. భారత దేశంలో బొగ్గు, ముడి ఇనుము, బెరైటీస్, బాక్సైట్, మైకా, మాంగనీస్, జిప్సం, డోలమైట్, సున్నపురాయి మొదలైన ఖనిజాలు అధిక సంఖ్యలో లభిస్తున్నాయి.
భారతదేశంలో ఖనిజాలు అత్యధికంగా జార్ఖండ్ రాష్ట్రంలోని ‘ఛోటా నాగపూర్’ పీఠభూమిలో లభిస్తున్నాయి. అందువల్ల దీన్ని ‘రూర్ ఆఫ్ ఇండియా’గా పేర్కొంటారు. రూర్ అనేది జర్మనీలోని ప్రసిద్ధి చెందిన ఖనిజాల గని.
దేశంలోని ఖనిజాలను స్థూలంగా నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:
1. లోహ ఖనిజాలు
ఎ. ఫై ఖనిజాలు: ఇనుము, మాంగనీస్, కోబాల్ట్, నికెల్ మొదలైనవి.
బి. నాన్ ఫై ఖనిజాలు: రాగి, సీసం, తగరం మొదలైనవి.
సి. విలువైన ఖనిజాలు: బంగారం, అల్యూమినియం, వెండి మొదలైనవి.
2. అలోహ ఖనిజాలు
మైకా (అభ్రకం), సున్నపురాయి, ముగ్గురాయి, రాతినార మొదలైనవి.
3. అణు ఖనిజాలుయురేనియం, థోరియం, జెర్కోనియం, ఇల్మనైట్, టెటానియం మొదలైనవి.
4. ఇంధన ఖనిజాలు
బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు మొదలైనవి.

ఇనుముప్రపంచ ఇనుప ఖనిజ నిల్వల్లో 25 శాతం భారతదేశంలోనే ఉన్నాయి. ప్రపంచ ఇనుము ఉత్పత్తిలో మనదేశానికి 5 శాతం వాటా ఉంది. ఇనుము ఉత్పత్తిలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఇనుప ధాతువులో లభ్యమయ్యే ఇనుము శాతం ఆధారంగా ముడి ఇనుప ఖనిజాన్ని 4 విధాలుగా వర్గీకరించవచ్చు. అవి:
మాగ్నటైట్: ఇది నలుపు రంగు నుంచి డార్‌‌క బ్రౌన్ వరకు వివిధ వర్ణాల్లో ఉంటుంది. ఇందులో 72 శాతం వరకు ఇనుము ఉంటుంది. ఇది అన్నింటి కంటే మేలైంది. ఈ రకమైన ఇనుము అగ్ని, రూపాంతర శిలల్లో ఎక్కువగా లభిస్తుంది.
హెమటైట్: ఇది ఎరుపు రంగులో ఉండి 70 శాతం వరకు ఇనుమును కలిగి ఉంటుంది. ఈ రకం ఇనుము ప్రపంచంలో ఎక్కువగా లభిస్తోంది. ముఖ్యంగా భారతదేశంలో ఇది విస్తారంగా లభిస్తోంది.
లియోనైట్: ఇది బూడిద రంగులో ఉంటుంది. ఇందులో 40 నుంచి 50 శాతం వరకు ఇనుము ఉంటుంది. ఇది అవక్షేప శిలలో లభిస్తుంది.
సిడరైట్: ఇది అన్నింటికంటే నాసి రకమైంది. ఇందులో 35 శాతం కంటే తక్కువగా ఇనుము ఉంటుంది. దీన్నే ‘కార్బొనేట్ ఐరన్’ అంటారు. ఇది బొగ్గు గనుల సమీపంలో లభిస్తుంది. ఇది గోధుమ రంగులో ఉండే కర్బన ఇనుము.

దేశంలో ముఖ్యమైన ఇనుప గనులు
ఒడిశా: కియోంజర్, తాల్చేరు, మయూర్ భంజ్, సుందర్‌గర్.
జార్ఖండ్: సింగ్‌భమ్.
ఛత్తీస్‌గఢ్: దూర్‌‌గ, బస్తర్ (బైలదిల్లా గని).
కర్ణాటక: చిత్రదుర్‌‌గ, బళ్లారి, చిక్‌మంగుళూరు
ఆంధ్రప్రదేశ్: వైఎస్సార్ కడప జిల్లా, కర్నూలు, నెల్లూరు.
తెలంగాణ: ఖమ్మం, ఆదిలాబాద్.
మహారాష్ట్ర: చంద్రాపూర్, రత్నగిరి.
తమిళనాడు: సేలం.
  • భారతదేశంలో మొదటి ఇనుప గనిని 1904లో జార్ఖండ్‌లోని ‘సింగ్‌భమ్’లో కనుగొన్నారు.
  • భారతదేశంలో ఇనుము నిల్వలపరంగా మొదటి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు వరసగా.. 1. జార్ఖండ్, 2. ఒడిశా, 3. ఛత్తీస్‌గఢ్
  • ఇనుము ఉత్పత్తి పరంగా దేశంలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు.. 1. ఒడిశా, 2. ఛత్తీస్‌గఢ్, 3. జార్ఖండ్
  • లోహాల్లో కెల్లా ఇనుము వాడకం ఎక్కువ. దీన్ని యంత్రాలు, యంత్ర పరికరాల తయారీలో విరివిగా వినియోగిస్తారు.
  • సల్ఫైడ్ల రూపంలో దీన్ని ఐరన్ పెరైట్స్, రబ్బరు పరిశ్రమల్లో వాడతారు.
మాంగనీస్
ఇది పైరోలుసైట్, సైలోమిలేన్, బ్రాకైట్, క్రిప్టోమిలాన్ లాంటి ధాతువుల నుంచి లభిస్తుంది. మాంగనీస్ ఎక్కువగా ‘ధార్వార్’ శిలల నుంచి లభిస్తుంది.
  • భారతదేశంలో మాంగనీస్ నిల్వలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు - ఒడిశా, కర్ణాటక.
  • దేశంలో మాంగనీస్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు - మహారాష్ట్ర, మధ్యప్రదేశ్.
దేశంలో ముఖ్యమైన మాంగనీస్ నిక్షేపాలు
ఒడిశా: కియోంజర్, కలహండి, కోరాపుట్
కర్ణాటక: షిమోగా, బెల్గాం, తుమ్కూరు.
ఆంధ్రప్రదేశ్: శ్రీకాకుళం, విజయనగరం.
మధ్యప్రదేశ్: బాలాఘాట్, చింద్వారా బెల్ట్.
మహారాష్ట్ర: నాగపూర్, బండారా బెల్ట్.
మాంగనీస్‌ను బ్లీచింగ్ పౌడరు, నల్ల ఎనామిల్ తయారీలో; ఫొటోగ్రఫీ, తోళ్లు, గాజు పరిశ్రమల్లోనూ ఉపయోగిస్తారు.

బాక్సైట్దీన్నే ‘అల్యూమినియం ఆక్సైడ్’ అని కూడా అంటారు. దీని నుంచి అల్యూమినియంను సంగ్రహిస్తారు.
  • భారతదేశంలో బాక్సైట్ ఎక్కువగా ఒడిశా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది.
  • విమానాలు, ఆటోమొబైల్, ఓడలు, ఫొటోగ్రఫీకి సంబంధించిన వస్తువులు, విద్యుత్ ఉపకరణాల తయారీలో బాక్సైట్‌ను ఉపయోగిస్తారు.
దేశంలో బాక్సైట్ లభించే ముఖ్యమైన గనులు
ఒడిశా: కలహండి, కోరాపుట్.
ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి.
గుజరాత్: జామ్‌నగర్, కెరా, కచ్.
ఛత్తీస్‌గఢ్: బిలాస్‌పూర్, రాయ్‌గర్
మధ్యప్రదేశ్: జబల్‌పూర్, బాలాఘాట్.
కర్ణాటక: కెమ్మనగండి.
  • మనదేశం నుంచి బాక్సైట్‌ను ఎక్కువగా ఇటలీకి ఎగుమతి చేస్తున్నారు.
రాగిదీన్ని నాణేల తయారీలో అధికంగా ఉపయోగిస్తారు.
  • పారిశ్రామికంగా ఇనుము తర్వాత ముఖ్యమైన ఖనిజం రాగి.
  • రాగి అత్యుత్తమ విద్యుత్ వాహకం. కాబట్టి దీన్ని ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.
  • రాగి ఇతర లోహాలతో సులభంగా మిళితం అవుతుంది. రాగి, జింకుతో కలిస్తే.. ‘ఇత్తడి’ ఏర్పడుతుంది. రాగి, తగరంతో కలిస్తే.. ‘కంచు’ ఏర్పడుతుంది. రాగి, జింకు, నికెల్‌ను కలిపి ‘జర్మన్ సిల్వర్’ను రూపొందిస్తారు.
  • భారతదేశంలో రాగి ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న రాష్ట్రం ‘రాజస్థాన్’.
దేశంలోని ముఖ్యమైన రాగి నిక్షేపాలు:
రాజస్థాన్:
 ఖేత్రి, ఆల్వార్, జైపూర్.
ఆంధ్రప్రదేశ్: అగ్నిగుండాల (గుంటూరు).
మధ్యప్రదేశ్: మలజ్‌ఖండ్, బాలాఘాట్.
జార్ఖండ్: సింగ్‌భమ్, హజారీబాగ్.
తమిళనాడు: దక్షిణ ఆర్కాట్.
కర్ణాటక: హసన్.
హిమచల్‌ప్రదేశ్: కాంగ్రా.

బంగారంబంగారాన్ని ‘నోబుల్ మెటల్’ అంటారు. ప్రపంచంలో బంగారం ఉత్పత్తిలో 0.75 శాతం మనదేశంలో ఉత్పత్తి అవుతోంది.
  • బంగారం క్వార్‌‌ట్జశిలల నుంచి లభిస్తుంది.
  • భారతదేశంలో బంగారాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం - కర్ణాటక.
భారత్‌లోని ముఖ్యమైన బంగారం గనులు:కర్ణాకట: కోలార్, హట్టి.
ఆంధ్రప్రదేశ్: అనంతపురం జిల్లాలోని రామగిరి.
తమిళనాడు: కోయంబత్తూరు, నీలగిరులు.
కేరళ: కోజికోడ్.

క్రోమైట్ఇది క్రోమియం నుంచి లభిస్తుంది. దీన్ని ‘స్టెయిన్‌లెస్ స్టీల్’ తయారీలో ఉపయోగిస్తారు.
  • మనదేశంలోని క్రోమియం నిక్షేపాల్లో సుమారు 90 శాతం ఒడిశాలోనే ఉన్నాయి.
  • క్రోమైట్‌ను అధికంగా జపాన్, ఆస్ట్రేలియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
దేశంలోని ముఖ్యమైన నిక్షేపాలుఒడిశా: కియోంజర్, కటక్.
మహరాష్ట్ర: రత్నగిరి, భాండార్.

8 - భారతదేశం - ఖనిజాలు